PRC అమలు , CPS రద్దు పై ఇచ్చిన హామీని మరచిన శ్రీయుత వైస్ జగన్ గారు

తాము అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి.. పాత పింఛన్‌ విధానం అమలు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు ఇప్పటికే పలుమార్లు చేసిన ఉద్యమాలను ప్రభుత్వం పట్టించు కోవడం లేదు అంటూ .. గుంటూరు కలెక్టరేట్ నందు ఉద్యోగ సంఘాల నిరసన ...

Sep 29, 2020 - 13:51
Sep 29, 2020 - 14:10
 0
PRC అమలు , CPS రద్దు పై ఇచ్చిన హామీని మరచిన శ్రీయుత వైస్ జగన్ గారు

స్థానిక :గుంటూరు : ఏపిలో చాలాకాలంగా కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం పై ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ విధానం ర‌ద్దు చేసి పాత విధానం లోనే పెన్ష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆనాడు వైసిపి - జ‌న‌సేన అధినేత‌లిద్ద‌రూ సీపీఎస్ విధానం ర‌ద్దు కోసం హామీ ఇచ్చారు. నాటి పూర్వ ముఖ్య మంత్రి వర్యుల తనయుడు - శ్రీయుత జగన్ గారు ఉద్యోగులకు కచ్చితంగా న్యాయం చేస్తారు అని ఆశించి ఉద్యోగులు అధికశాతం మంది మద్దతు ఇచ్చిన సంగతి తెసినదే. 2004 సెప్టెంబరు నుంచి పాత పింఛన్‌ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.

రాష్ట్రంలోసూమారు  1.70 నుండి 1.85 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు , సీపీఎస్‌ విధానంలో ఉద్యోగి మూలవేతనం, దినసరి భత్యం నుంచి పది శాతం నిధులను ప్రభుత్వం మినహాయించుకుని, అంతే మొత్తాన్ని జత చేసి దాన్ని షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతోంది. ఇందులో లాభనష్టాలను మాత్రం ఉద్యోగి భరించాలి. షేర్‌ మార్కెట్‌ అనేది జూదం లాంటిదని ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే తమ సీపీఎస్‌ ఖాతాలో ఎంత మొత్తం ఉందనే విషయం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు.

ఉద్యోగి చనిపోయినా, అలాగే ఉద్యోగం మానివేసినా.. ఆ నగదు ఎలా పొందాలనే దానిపై ప్రభుత్వాలు విధివిధానాలు ట్రెజరీలకు అందించలేదు. దీంతో ఆ నగదును ఉపసంహరించుకునే పరిస్థితి లేక కొందరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము 60 ఏళ్ల వరకు సేవ చేసిన తరువాత ప్రభుత్వం పింఛన్‌ అందిస్తే.. ఉద్యోగ విరమణ జీవితాన్ని ప్రశాంతంగా ఆర్థిక భరోసాతో గడిపే అవకాశముంటుందని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయం పై దిన దిన ప్రవర్ధ మానం గా కొనసాగుతున్న జాప్యం పై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.ఇందులో భాగంగా --

ఫైల్ :source of image is Sakshi

ఈ రోజు  కలెక్టర్ ఆఫీస్, మరియు జలవనరుల శాఖ ఆఫీసు ఆవరణలో "మధ్యాహ్న భోజన విరామ సమయ నిరసన "కార్యక్రమం లో భాగంగా ఉద్యోగుల నిరసన కార్యక్రమము జరిగినది .ఈ నిరసన  కార్యక్రమం లో జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కలసి పాల్గొన్నాయి ,ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోడీ వైఖరిని కండిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటికీ ఉద్యోగుల సేవా హక్కులైన  P.R.C,3 DA లు , ఇవ్వక పోగా , CPS ను అమలు చేయడం ఎంతో బాధాకరమైన విషయం, CPS ను రద్దు చేస్తాము అని ప్రస్తుత ముఖ్య మంత్రి వర్యులు ఆనాడు, అనగా ఎలక్షన్ల సమయం లో వాగ్ధానం చేశారు ,

గతం లో --రాష్ట్రంలో 2017, 2018 సెప్టెంబరులో చేపట్టిన మిలియన్‌ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమాలను అణచివేసింది. పలు జిల్లాలు, ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘ నేతలు, సీపీఎస్‌ ఉద్యోగులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించిన ఘనతను మూట కట్టుకుంది. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ.. ఏటా సెప్టెంబరు ఒకటిన సీపీఎస్‌  పరిధిలోని ఉద్యోగులు సామూహిక సెలవుదినాన్ని పాటిస్తున్నారు.

జగన్ గారి హామీతో  నాటి ఉద్యోగుల భావనలు -- జగన్‌ గారు  సీపీఎస్‌ రద్దు హామీ ఇవ్వడం గొప్ప విషయం. ఆయన ఉద్యోగుల కష్టాలు చూసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. సీపీఎస్‌ రద్దుకు సహకరించే వారికే మా మద్దతు తెలుపుతాం. జగన్‌ తీసుకున్న సీపీఎస్‌ రద్దు నిర్ణయం చారిత్రాత్మకంగా మారడం ఖాయం. పాత పింఛను విధానాన్ని ప్రవేశ పెడతామని వైఎస్‌ జగన్ గారు ‌ చెప్పిన ఒక్క మాటతో లక్షలాది కుటుంబాల ఎదురుచూపులు తీరతాయి. ఎన్నో ఏళ్లుగా సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానం ప్రవేశ పెట్టాలని నాయకులను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నా పట్టించుకోలేదు. 

కాగా ఇప్పటికి శ్రీయుత వై ఎస్ జగన్ గారి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2 సంవత్సరములు కావోస్తోంది ,మరియు హామీ ఇచ్చి రెండు సంవత్సరములు పై బడినవి ,ఇది ఊహించని పరిణామం, ఇప్పటికైనా ప్రభుతం జాప్యం చేయకుండా ,  స్పందించాలీ అంటూ శ్రీ నమ్రత్ కుమార్ .పి , (మునిసిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ,AP  స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ,మరియు AP  జేఏసీ డిస్ట్రిక్ట్ కన్వీనర్ )  గారు ఉద్యోగుల తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పాతవిధానం, సీపీఎస్‌ పోలికలివే..

పాతవిధానం,

 సీపీఎస్‌ పోలికలివే..

పాత విధానంలో ఉద్యోగి పింఛను కోసం ఒక రూపాయి కూడా జీతం నుంచి చెల్లించక్కరలేదు సీపీఎస్‌లో ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా పది శాతం దాచుకోవాల్సి ఉంది. 
పాత విధానంలో ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆ ఇంట్లో అర్హత గల వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇచ్చేవారు. మరణించిన ఉద్యోగి భార్యకు పింఛను ఇచ్చేవారు సీపీఎస్‌ విధానంలో.. ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకాలు ఉండవు.
ఉద్యోగి తన భవిష్యనిధిలో దాచుకున్న డబ్బుకు ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీపీఎస్‌లో దాచుకున్న డబ్బుకు ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత షేర్‌మార్కెట్‌లో ఈ పెట్టుబడుల వల్ల హెచ్చుతగ్గులు వచ్చి స్థిరీకరణతో కూడిన పింఛను అందదు

కరువు భత్యం వర్తించదు.

ఉద్యోగి ఆరోగ్య కార్డు రద్దవుతుంది

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow