బొగ్గు రవాణా కూడా అదానీకే!

Apr 12, 2021 - 16:02
 0
బొగ్గు రవాణా కూడా అదానీకే!

krishnapatnam Port - Adhani-CPIM-coal transportation.

#అక్కరకు రాని రివర్స్‌...

గతంలోనే ఈ పనికి టెండర్లు పిలిచినప్పటికీ ఖర్చు తగ్గించేరదుకంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తాజాగా మరోసారి ఆహ్వానించారు. గతంలో 6,669 రూపాయలకు టెండర్‌ రాగా రివర్స్‌ విధానంలో తగ్గాల్సిందిపోయి ఎల్‌-1గానే 7,770 రూపాయలు కోట్‌ కావడం విశేషం. అంటే అదనంగా 1,101 రూపాయలు పెరిగినట్టయింది.

1

1

బొగ్గు రవాణా కూడా అదానీకే!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
శ్రీదామోదరం సంజీవయ్య ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు భారీ ఎత్తున బొగ్గును సరఫరా చేసే టెండర్లల్లో అయోమయం కనిపిస్తోంది. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా జరిగే సరఫరా ప్రక్రియకు ఇప్పటికే నాలుగు సంస్థలు టెండర్లను దాఖలుచేసినప్పటికీ వాటిని ఖరారు చేయడంలో జాప్యం నెలకొంది. ఈ టెండర్ల ప్రక్రియలో ఎల్‌-2గా నిలిచిన అదానీ సంస్థకు ఖరారు చేయడానికే జాప్యం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో హైదరాబాద్‌కు చెరదిన ట్రిడెంట్‌ ఛెంఫర్‌ లిమిటెడ్‌ టన్నుకు 7,770 రూపాయలతో ఎల్‌-1గా నిలిచింది. గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌కు చెందిన అదానీ సంస్థ 7,830 రూపాయలతో ఎల్‌-2గా ఉండగా, హైదరాబాద్‌కు చెందిన ఎంబిసి 7, 999తో ఎల్‌-3గా, ముంబాయికి చెందిన గాంధారీ ఆయిల్‌ రిఫైనరీ సంస్థ 9, 010 రూపాయలతో ఎల్‌-4గా నిలిచింది. ఎల్‌-1గా వచ్చిన ట్రిడెంట్‌ సంస్థకు ఈ టెండర్‌ ఇప్పటికే ఖరారు కావాల్సిఉంది. టెండర్‌ పిలిచిన సమయంలో పది శాతం ఎక్కువ, తక్కువతో అన్న నిబంధన విధించారు. దీనిని ఆసరాగా తీసుకుని తాజాగా ఎల్‌-1గా వచ్చిన ట్రిడెంట్‌తో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఆ సంస్థ కోట్‌ చేసిన 7,770 రూపాయలను తగ్గించాలని కోరాలని నిర్ణయించారు. దీనికి ఆ సంస్థ అంగీకరించకపోయినా, తగ్గించిన సొమ్ముపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయకపోయినా ఎల్‌-2గా వచ్చిన ఆదానీతో చర్చలు జరిపే అవకాశాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవు మొత్తాన్ని కైవసం చేసుకున్న ఆదానీ సంస్థకే బొగ్గు రవాణా టెండర్‌ కూడా ఖరారయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
#అక్కరకు రాని రివర్స్‌...
గతంలోనే ఈ పనికి టెండర్లు పిలిచినప్పటికీ ఖర్చు తగ్గించేరదుకంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తాజాగా మరోసారి ఆహ్వానించారు. గతంలో 6,669 రూపాయలకు టెండర్‌ రాగా రివర్స్‌ విధానంలో తగ్గాల్సిందిపోయి ఎల్‌-1గానే 7,770 రూపాయలు కోట్‌ కావడం విశేషం. అంటే అదనంగా 1,101 రూపాయలు పెరిగినట్టయింది. దీనివల్ల యూనిట్‌ విద్యుత్‌ ధర కూడా పెరుగుతుందని అంటున్నారు. గత టెండర్‌ మేరకు యూనిట్‌ ధర 3.14 రూపాయలుగా అంచనా వేయగా, ట్రిడెండ్‌ దాఖలు చేసిన టెండర్‌ వల్ల యూనిట్‌ ధర 3.31 రూపాయలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ కూడా విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా యూనిట్‌కు 3.14 రూపాయలనే ఖరారు చేసిన నేపథ్యంలో ట్రిడెంట్‌ టెండర్‌ ద్వారా 17 నుంచి 29 పైసల వరకు భారం పెరిగే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. అరదుకే ఎల్‌-1ను ఖరారుచేయడానికి ముందుగా చర్చలు జరపాలని భావిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow