భారత్ లో వరుసగా 13 రోజులుగా కొత్త కోవిడ్ కేసులు 30 వేల లోపే

29 రోజులుగా రోజువారీ కొత్తకేసులకంటే కోలుకున్నవారే ఎక్కువమంది

భారత్ లో వరుసగా 13 రోజులుగా కొత్త కోవిడ్ కేసులు 30 వేల లోపే

రోజూ కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య ఎక్కువగానూ, కొత్త కేసుల సంఖ్య తక్కువగాను ఉండటం వలన చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య, మరణాలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి.  ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 97.5 లక్షలకు దగ్గరవుతూ నేడు 97,40,108 గా నమోదయ్యాయి. ఇప్పటిదాకా కోలుకున్నవారి  సంఖ్య ప్రపంచంలోనే  అత్యధికంగా నమోదవుతూ ఉండగా కోలుకున్నవారి శాతం 95.78%  కు చేరింది. దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 2,81,667 కాగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 2.77% మాత్రమే.  

WhatsApp Image 2020-12-26 at 10.09.38 AM.jpeg

జాతీయ స్థాయిలో సాగుతున్న ధోరణికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాలలోను కోలుకున్నవారి శాతం 90 దాటింది.

WhatsApp Image 2020-12-26 at 10.07.00 AM.jpeg

గత 13 రోజులుగా రోజువారీ కేసులు 30,000 లోపు ఉంటూ ఉన్నాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 22,273 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

WhatsApp Image 2020-12-26 at 9.57.19 AM.jpeg

రోజూ వచ్చే కొత్త కోవిడ్ కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గత 29 రోజులుగా సాగుతూనే ఉంది.  గత 24 గంటలలో 22,274 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు..  

WhatsApp Image 2020-12-26 at 10.01.59 AM.jpeg

కొత్తగా కోలుకున్నవారిలో 73.56%  మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా  ఒక్క రోజులోనే 4,506 మంది కోలుకోగా,  పశ్చిమ బెంగాల్ లో 1,954 మంది, మహారాష్ట్రలో 1,427  మంది కోలుకున్నారు. 

WhatsApp Image 2020-12-26 at 9.52.25 AM.jpeg

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 79.16%  మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు కాగా, కేరళలో అత్యధికంగా  5,397 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మహారాష్ట్రలో 3,431 పశ్చిమ బెంగాల్ లో 1,541 కేసులు వచ్చాయి.

WhatsApp Image 2020-12-26 at 9.49.29 AM.jpeg

గత 24 గంటలలో 251 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో  85.26%  మరణాలు కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 71 మరణాలు, పశ్చిమబెంగాల్ లో 31, ఢిల్లీలో 30 మరణాలు నమోదయ్యాయి.

WhatsApp Image 2020-12-26 at 9.50.48 AM.jpeg

****