భారత్ లో 5 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ గత 24 గంటల్లో 23 లక్షలకు పైగా టీకాలు కొత్తకేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్

Mar 24, 2021 - 20:42
 0
భారత్ లో 5 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ గత 24 గంటల్లో 23 లక్షలకు పైగా టీకాలు  కొత్తకేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్

కోవిడ్ మీద పోరులో భాగంగా టీకాల పంపిణీ కార్యక్రమంలో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య ఐదు కోట్లు దాటింది.  ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్నిబట్టి 8,23,046 శిబిరాల ద్వారా 5,08,41,286 టీకా డోసులిచ్చారు.  ఇందులో 79,17,521 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోస్ కాగా,   50,20,695 ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండవ డోస్ లు,   83,62,065 కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 30,88,639 డొసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు, 47,01,894 డోసులు 45-6- ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు,   2,17,50,472 మంది 60 ఏళ్ళు  పైబడ్డవారికిచ్చిన డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

 

మొత్తం

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

మొదటి డోస్

79,17,521

50,20,695

83,62,065

30,88,639

47,01,894

2,17,50,472

5,08,41,286

 

దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైన 67 వ రోజైన మార్చి 23నాడు 23,46,692  టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో  

21,00,799 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది ఉండగా 2,45,893 మంది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. 

 

తేదీ: మార్చి 23, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాలవ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

మొదటి డోస్

మొదటి డోస్

రెండో డోస్

57,942

60,731

1,19,938

1,85,162

4,03,584

15,19,335

21,00,799

2,45,893

మొత్తం కోవిడ్ టీకాలలో 60% మేరకు 8 రాష్ట్రాలలో తీసుకున్నారు. 

 

రోజువారీ కొత్త కోవిడ్ కేసులు ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్ లో ఎక్కువగా వస్తున్నాయి. గత 24 గంటలలో 47,262 కొత్త కేసులు రాగా అందులో  77.44% ఈ రాష్ట్రాలదే.  ఆరు రాష్ట్రాలలో నమోదైన కేసుల వాటా 81.65%. మహారాష్ట్రలో అత్యధికంగా  ఒక్క రోజులో  28,699 కేసులు రాగా పంజాబ్ లో 2,254, కర్నాటకలో 2,010 కేసులు వచ్చాయి.

వారపు సగటి పాజిటివ్ శాతం ఎనిమిది రాష్ట్రాలలో జాతీయ సగటు అయిన 4.11% కంటే అధికంగా కనబడుతోంది. మహారాష్ట్రలో వారపు పాజిటివ్ శాతం 20.53% గా నమోదైంది.

భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య  3,68,457 కి చేరుకుంది.  ఇది ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో  3.14%.  గత 24 గంటలలో నికరంగా పెరిగిన కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య  23,080. దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,12,05,160 కాగా దేశపు కోలుకున్నవారి శాతం 95.49%. గత 24 గంటలలో 23,907 మంది కోలుకున్నారు.  

గత 24 గంటలలో 275 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త మారణాలలో 83.27%  ఆరు రాష్ట్రాలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 132 మంది కోవిడ్ తో మరణించగా పంజాబ్ లో 53 మంది, చత్తీస్ గఢ్ లో 20 మంది చనిపోయారు.

గత 24 గంటలలో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఒడిశా, లక్షదీవులు, లద్దాఖ్, మణిపూర్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow