దిశ యాప్ గురించి : సూటిగా సుత్తి లేకుండా : నిజానిజాలు

అమ్మాయిలు, మహిళల రక్షణకు ఉపయోగపడే అనేక ఫీచర్స్ ఉన్నాయి. కేవలం 4.7 ఎంబీ సైజ్ గల ఈ యాప్‌లో

Jul 3, 2021 - 21:46
Jul 3, 2021 - 21:54
 0
దిశ యాప్ గురించి : సూటిగా సుత్తి లేకుండా : నిజానిజాలు

'దిశ ఎస్ఓఎస్' యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది.

మొదటిసారి డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరం.

యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు.

ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయాల్సి ఉంటుంది.

మీ వ్యక్తిగత సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి.

ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చాలు.

యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేసేంత సమయం లేకపోతే ఫోన్‌ని గట్టిగా ఊపినా చాలు.

మీరు ఎక్కడున్నారో లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది.

అంతేకాదు... మీరు ఉన్న లొకేషన్ 10 సెకండ్ల వీడియో కూడా కమాండ్ రూమ్‌కు వెళ్తుంది.

మీరు ఉన్న లొకేషన్ ఆధారంగా దగ్గర్లో అందుబాటులో ఉన్న పోలీస్ రక్షక్ వాహనాలకు, పోలీస్ స్టేషన్లకు సమాచారం వెళ్తుంది.

పోలీస్ రక్షక్ వాహనాలు జీపీఎస్ ద్వారా మీరు ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయి.

మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లకు కూడా సమాచారం వెళ్తుంది.

యాప్ ఓపెన్ చేయగానే SOS బటన్‌తో పాటు నేరుగా 100 లేదా 112 నెంబర్‌కు కాల్ చేసేందుకు బటన్ ఉంటుంది. 100 నెంబర్‌కు నేరుగా కాల్ చేయొచ్చు.

112 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఇక యాప్‌లో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది.

మీరు క్యాబ్‌లో, ఆటోలో వెళ్తున్నప్పుడు మీ గమ్యస్థానాన్ని అందులో ఎంటర్ చేయాలి.

ఒకవేళ వాహనం వేరే రూట్‌లో వెళ్తున్నట్టైతే వెంటనే కంట్రోల్ రూమ్‌తో పాటు మీ కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్తుంది.

యాప్‌లో పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలు కూడా ఉంటాయి.

వీటితో పాటు దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలు కూడా దిశ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో దిశ యాప్‌కు 4.9/5 స్టార్ రేటింగ్ ఉండటం మరో విశేషం. 

___________________________________________________

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle.

My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here Donate.  https://mydigitalnews.in/donate   

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow