డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇలా ..పూర్తి వివరాలు. టెస్ట్ లేదు కానీ ?

ఇకపై ఆటీఓ కార్యాలయాలకు వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా....

Jul 4, 2021 - 08:48
 0
డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇలా ..పూర్తి వివరాలు. టెస్ట్ లేదు కానీ ?

కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా దీనికి సంబంధించి కొన్ని నియమాలను ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.

భారతదేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల ద్వారా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీనికి గల కారణం రహదారి నిబంధనలు తెలియకపోవడం..

18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న (మైనర్లకు) వాహనం ఇవ్వడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే లక్ష్యంతో ఓ ముసాయిదాను కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చింది.

ఈ నిబంధనల ప్రకారం లైసెన్స్ కోరుకునే అభ్యర్థులు ఏదైనా డ్రైవింగ్ సెంటర్లలో ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే.. డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు లభిస్తుంది. 

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇక నుంచి ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) వద్ద గంటలు గంటలు వేచి చూడాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ప్రాంతీయ రవాణా కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు కూడా చేయాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వం నిర్దేశించిన అక్రెడిటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్స్ లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ కేంద్రాల్లో పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైతే, లైసెన్స్ పొందే సమయంలో ఆర్టీఓలలో డ్రైవింగ్ పరీక్షలకు హాజరుకాకుండా మినహాయింపు ఉంటుంది.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గత డిసెంబర్‌‌లోనే ముసాయిదా రూపొందించింది.

ఈ డ్రైవింగ్ కోర్సు లైట్ మోటార్ వెహికల్ కోసం అందించనున్నారు.

కోర్సు వ్యవధి 29 గంటలు అంటే.. గరిష్టంగా నాలుగు వారాలు పాటు ఉంటుంది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు కూడా ఉంటుంది. ఇక మీడియం, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కోర్సు వ్యవధి 38 గంటలు.. ( ఆరు వారాల పాటు ఉంటుంది. ) ఇందులో రెండు సిగ్మెంట్లు ఉంటాయి. థియరీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది.

ఈ ట్రైనింగ్ లో కొన్ని బేసిక్స్ కూడా నేర్పిస్తారు. అలాగే రోడ్లపై ఎలా వాహనాన్ని నడపాలనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు.. ఇండస్ట్రీలో డ్రైవింగ్ కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా అందించనున్నాయి. తక్కువ సమయంలో డ్రైవింగ్ లో నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేలా కోర్సు అందిస్తారు. 

డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల నుంచి పొందే అక్రిడేషన్ గడువు ఐదేళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ శిక్షణ ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదివరకే డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్ కోసం రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ధృవీకరిస్తే.. టెస్టింగ్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయనున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow