"నాన్న"ను ప్రేమించే వారందరు చదవండి

May 21, 2021 - 09:41
Jul 20, 2021 - 07:46
 0

"నాన్న"ను ప్రేమించే వారందరు చదవండి.

"My Dady Is My Real Hero"

మనం అందరం బాగా ఎదిగిపోయాం.!

మన ఫ్రెండ్ మనకి కాల్ చేసి, బైటకు రమ్మంటే మనం అనే మాట..

"రేయ్ మామ.. మా బాబు (నాన్న) ఉన్నాడ్రా ఇంట్లో.. బయటకు వచ్చానో మా బాబు సావ గోట్టేస్తాడు రా..!

హ..హ..హా ☺
"నాన్నని నాన్న" అని పిలవలేకపోతున్నాం..
ఒక్కొకరు ఒక్కో పేరు పెడుతున్నారు తండ్రికి.☺

"నాన్న" అనే ఈ 2 అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు.

"నాన్న" చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో...
ఒక చోట "నాన్న" బాడీ ని నేలపై ఉంచి కొడుకు ని తండ్రి చెవిలో
నాన్న.. నాన్న.. నాన్న అని 3సార్లు పిలవమంటారు. 

కొడుకు 2సార్లు బాగానే పిలుస్తాడు. మూడోసారి మాట రాదు.

గుండెలో బాధ..
గొంతులో తెలియని నొప్పి..
కళ్ళల్లో నీళ్ళు.. ఎందుకంటే..?!
ఆ కొడుకు, తండ్రితో నాన్న అని 
పిలిచేది అదే ఆఖరిసారి..! 

ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు..!

ఆ పిలుపు తనకి Just Half Second మాత్రమే పట్టిింది. కానీ..!

ఆ Half Second లో వాడికి మొత్తం కళ్ళ ముందు కనిపించేది మాత్రం.!?

“మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది. 

మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలిన కూడా హాస్పిటల్ కి వెళ్ళకుండా మన Future కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి. 

అమ్మ మనకి ఇష్టమైన కూర వందినపుడు అందరం కలసి భోజనం చేసేటప్పుడు నాన్న తన ప్లేట్ లో కూర తీసి మన ప్లేట్ లో వేసింది కనిపిస్తుంది.

చివరగా ఎవరైనా "నువ్వు ఏం 
సంపాధించావురా?" అని నాన్నని అడిగేతే నా ఆస్తి నా కొడుకేరా
అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది. 

ఇవ్వన్ని కనిపించిప్పుడు నాన్నని గట్టిగా హత్తుకుని నాన్న నాన్న నాన్న నాన్న నాన్న నాన్న అని పిలవాలనిపిస్తుంది.

కాని.. అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా, అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు.

So.. ఫ్రెండ్స్..! 
నాన్న ఉన్నప్పుడే తనని నాన్న అని ప్రేమగా పిలుద్దాం.

నాన్న పోయాక తన ఫోటో దగ్గర కూర్చుని బాధపడే బదులు... 
నాన్న ఉన్నపుడే తనతో రోజు కొంత టైం గడుపుదాం. 

ఆయన పోయాక Whatsapp,FB లో My Dad is my Real Heroఅనే post లు పెట్టే బదులు..  నాన్న ఉన్నప్పుడే నాన్నతో..  
నాన్న.. You are my Real Hero అని చెప్పుదాం..!

అంత గొప్ప నాన్న అనే పదాన్ని బాబు, గీబు అంటూ కించపరచకండి.

తన జీవితాన్ని ఖర్చు పెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడే "నాన్న"  
నాన్నకు ప్రేమతో..

 ని కొడుకు

Source:- Whatsapp Forward. 

Comment for Credits. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow