గాయత్రీ దేవత కాదు - గాయత్రి అంటే వ్యాకరణం- గాయత్రీ కి స్త్రీ రూపం ఇచ్చి పూజించడం నిరుపయోగం

ఈవ్యాసము ఆఖరి వరకూ చదివి మీయొక్క అభిప్రాయం చెప్పవలసిందిగా ప్రార్థన - అంటూ అనేకానేక సామజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ ఆర్టికల్ ను , సవివరంగా Mr . T మోహనరావు శర్మ ఉరఫ్ వేద బ్రహ్మ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారితో ప్రస్తావించి MDN మీ ముందుకు తీసుకు వచ్చింది

Apr 27, 2022 - 17:38
Apr 27, 2022 - 17:44
 0

 గాయత్రీ అనగానేమి? ఛందస్సా లేక దేవతా? వైదిక పరిశీలనచేద్దామా! : వేద బ్రహ్మ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ. 

కొన్ని దశాబ్దాలుగా గాయత్రీ పేరుతో స్త్రీ రూపమును సృష్టించి పూజలు చేస్తూ చేయిస్తున్నారు. బహుదేవతారాధకులు హిందువులు కనుక సరేలే అని ఊరుకొని ఉండలేని పరిస్థితి. ఎందుకంటే దీనివలన ఆమంత్రానికి సంబంధించిన నిజమైన దేవుని నిర్లక్ష్యం జరుగుతుంది. ఎందుకు ఆమంత్రముయొక్క అధిదేవుడు పురుషుడు ఉండగా ఆదేవున్ని త్యజించి ఆస్థానములో పూర్తిగా భిన్నమైన స్త్రీ రూపదేవతను ఎందుకు సృష్టించి ప్రచారం చేసారు?

ఏదైనా ఒక బలమైన కారణమైతే ఉండాలి.

ఆదేవుడు ఎవరు?

ఆ వైదిక పురుషదేవున్ని పూజించి ప్రచారం గావించినచో ఎవరికి ఏవర్గంవారికి నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

వారికి ఏవిధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకేభయపడి ఇంతటి సారస్వత్య దోషానికి వేదనిందనకు పాల్పడి మహాపాపము అందరిచేత చేయించారు.

దీనిపై ఈరోజు పూర్తిగా విశ్లేషణ చేద్దాం. మనకు షోడశ వేదవిద్యలు కలవు. ఈవేద విద్యలలో ఐదు వేదాలు ,ఐదు ఉపవేదాలు, ఆరు వేదాంగాలు కలిపి షోడశ వేదవిద్యలు అంటారు.

ఈ వీడియో విశ్లేషణ ను చూడగలరు :

5వేదాలు :-

 1.ఋగ్వేదం , 2.యజుర్వేదం, 3.సామవేదము, 4.అథర్వణ వేదము, 5.ప్రణవవేదము

ఉపవేదములు : -

1.ఆయుర్వేదం

2.ధనుర్ళేదము

3.గాంధర్వవేదము

4. అర్థశాస్త్రము

5. స్థాపత్య వేదము

వేదాంగాలు 6 :- 

 1.శిక్ష

2.కల్పము, 

3.వ్యాకరణము, 

4.నిరుక్తము, 

5.చందస్సు మరియు 

6.జ్యోతిష్యం 

ఇంకా కొంతమంది నాలుగు వేదాలు, నాలుగు ఉపవేదాలు ,ఆరు వేదాంగాలు, ఉపాంగాలు చేరుస్తూ అష్టాదశ వేదవిద్యలు అని అంటారు.

ఉపాంగాలు నాలుగు అవి ఏవి అంటే : 

మీమాంస, న్యాయశాస్త్రము , పురాణాలు, ధర్మశాస్త్రాలు.

ఇందులో వేదాంగాలలోకల ఛందస్సు గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మనము చిన్నప్పుడు నుంచి పద్యాలు చదువుతూ ఉంటాం కంఠస్తం చేస్తూ ఉంటాం పరీక్షలు వ్రాసి ఉంటాం, వాటి రచన ఛందస్సు ఆధారంగా చేస్తారని మనందరికీ తెలుసు.

అందులో ముఖ్యంగా తెలుగు పద్యరచనలో ఉత్పలమాల చంపకమాల శార్దూలం ఆటవెలది మొదలైన చందస్సు లను ఉపయోగించి పద్యరచనలు చేస్తారు అని మనందరికీ తెలుసు. ఇదేవిధంగా సంస్కృతంలో వేదమంత్రాల  రచనకు కూడా ఛందస్సుని ఉపయోగిస్తారు

ఇక్కడ ముఖ్యంగా 7 ప్రముఖ ఛందస్సు లు కలవు.

అవి 

1. గాయత్రీ ఛందస్సు       - 3 పాదాలు

2. ఉష్ణక్ చందస్సు           - 3 పాదాలు

3. అనుష్టుప్ ఛందస్సు.    - 4 పాదాలు

4.  బృహతి ఛందస్సు.      - 4 పాదాలు

5. పంక్తి ఛందస్సు.            - 4 పాదాలు

6. త్రిష్టుప్ ఛందస్సు.         - 4 పాదాలు

7.  జగతి ఛందస్సు లు.     - 4 పాదాలు

పై విధమైన  చందస్సు లను ఉపయోగించి వేద మంత్రములను గ్రంధస్థము చేయడం జరిగింది.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం వేదములలో చాలా మంది దేవతలు యొక్క సూక్తులు మంత్రములు కలవు.

ప్రతి ఒక్క మంత్రము కూడా పైన ఉదహరించిన ఛందస్సులలో ఏదో ఒక దానిని ఉపయోగించి రాయటం జరిగింది.

ఉదాహరణకు అతిపురాతన ఆధారము కలిగిన ఋగ్వేదము నందలి ప్రథమ మంత్రము గాయత్రీ ఛందస్సులో అగ్ని దేవుని కొరకు ఉంటుంది.

ఇప్పుడు అగ్నిదేవునికి గాయత్రి అని చందస్సు పేరుతో పిలిస్తే ఎలా ఉంటుంది.?

ఇదే గాయత్రీ ఛందస్సుతో చాలా దేవతలకు మంత్రములు , వర్ణనా కలదు. మరి ఆ దేవతలందరి పేర్లను విడిచిపెట్టి అందరి దేవతలను కూడా గాయత్రి అనే పిలువ వచ్చునా?

వేదములో ప్రతి ఒక్క మంత్రమునకు కూడా ద్రష్ట్రార ఋషి , ఛందస్సు , మరియు దేవత పేరు కూడా చెప్పి దాని తర్వాత మంత్రము రాస్తారు.

ఉదాహరణకు ఋగ్వేదంలో మూడవ కాండము 62వ సూక్తము పదవ మంత్రములో ఈ యొక్క అనగా అందరుకూడా మాయా బోధకుల ప్రభావంతో గాయత్రి మంత్రం అని పిలువబడే సవితా మంత్రము కనబడుతుంది.

ఇక్కడ అతి స్పష్టంగా ఏమని వ్రాసి ఉందంటే!

 ఈ మంత్రము విశ్వామిత్ర ఋషి ధర్శనం చేసుకున్నాడని నిచ్రుత్ గాయత్రీ ఛందస్సు లో ఈ 23అక్షరాలు గల మంత్రము ఉందని, ఆ మంత్రానికి అధిదేవత సవిత అనే స్పష్టంగా రాసి ఉంటుంది.

ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే గాయత్రి అనేది ఛందస్సు అని మాత్రమే వేదములు పేర్కొంటున్నాయి. దేవత అని ఎక్కడా కూడా చెప్పబడలేదు అంతేకాదు ఏ పురాణము గాని ఆగమము గాని శిల్ప శాస్త్రము లో కూడా గాయత్రి దేవతగా ధ్యాన శ్లోకము గాని వర్ణన గాని లేదు.

మనం ఒకసారి ఆ మంత్రమును చూద్దాం.

మంత్రము : -

తత్సవితుర్వరేణ్యమ్|

 భర్గోదేవస్య ధీమహి|

 ధియో యో నః ప్రచోదయాత్||

          ( ఋగ్వేదం 3:62:10)              (యజుర్వేదం3:35,22:1,30:3)

          (సామవేదము : 1,462వ సామము)

దీనికి సాయణాచార్యుల భాష్యము ఇలా ఉంది.

యః సవితా దేవః = ఏ సవితృ అనేదేవుడు.  

అస్మాకం. =   మాయొక్క,   

ధియః   =   కర్మమలను లేక ధర్మాదుల కొరకు బుద్ధిని

ప్రచోదయాత్.  =  ప్రేరేపించుచున్నాడో

తత్.  =  ఆ సవితృ దేవుడుని

వరేణ్యం  =  అందరికీ ఉపాస్యుడై(జ్ఞేయముగా స్వీకరించబడిన)

భర్గ  =   భర్గమనే పేరుగల తేజస్సు(అనగా పరబ్రహ్మాత్మకము స్వయం జ్యోతి యైన తేజస్సు)

ధీమహి  =  ధ్యానము చేయచున్నాను.

భావము :-

                ఏ సవితృ దేవుడు మాయెక్క కర్మలను అథవా  ధర్మాదుల కొరకు బుద్ధి ప్రేరేపించుచున్నాడో ఆ సవితృ దేవుడి,అనగా సర్వాంతర్యామి అయిఉండి ప్రేరకుడైన జగత్సృష్టికర్తయైన  పరమేశ్వరుడు అందరికీ ఉపాసకుడై(జ్ఞేయముగా స్వీకరించబడిన) భర్గమనే తేజస్సు అనగా పరబ్రహ్మాత్మకము స్వయం జ్యోతి యైన తేజస్సును ధ్యానించుచున్నాను.

సాయణాచార్యుల భాష్యములో కూడా గాయత్రి దేవత అని చెప్పలేదు. సవితృ దేవుడనే చెప్పాడు. ఇంకో విధంగా విశ్లేషించే సమయంలో  వేదపండితులు ఆచార్యులు చండ్రపాటి గురువుగారి వారి వివరణ ప్రకారం - 

" గానము త్రాణము అనే రెండు పదముల కలయిక గాయత్రి. అనగా ఆ మంత్రము గానము చేసిన వారికి కాపాడును అని అర్థము.

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి

వాగ్వై గాయత్రి

వాక్కు అనగా గాయత్రి

మంచి మాటే గాయత్రీ

గాయత్రి వాక్కు అనగా వాణి అవుతుంది.

వాక్కు నకు పతి వాచస్పతి

||వాచస్పతిo విశ్వకర్మాణ మూతయే||

అని వేదం తెల్పుతుంది.   

ఈ మంత్రాన్ని దర్శించుకున్న ఋషి విశ్వామిత్ర మహర్షి.

ఇతను ఈ మంత్రము నకు " గాయత్రీ ఛందస్సు లో నిర్మితమైన ఈ మంత్రానికి అది దేవుడు సవితా దేవత.

ఋషి విశ్వామిత్రుడు అని చెప్పాడు. సవితా మంత్రము సావిత్రము అవుతుంది. త్వష్ట విశ్వకర్మ సావిత్రి యొక్క పతి అని వైఖానస ఆగమం చెబుతున్నది. ఋగ్వేదములో 2400 పై చిలుకు గాయత్రీ (ఛందో) మంత్రములు కలవు. 'తత్ సవితుర్ వరేణ్యం'  అనునది సవితా అను పురుష దేవతకు సంబంధించినది. 

కనుక సావిత్రమ్ లేదా సావిత్రీ మంత్రము.

పంచ శిరస్క గాయత్రీ యను స్త్రీ దేవతకు 'తత్ సవితుః' అను మంత్రమునకు సంబంధము లేదు.

పంచశిరస్క స్త్రీ దేవత ఏ వేదములోనూ  ఏ శిల్పశాస్త్రగ్రంథములోనూ లేదు. ఉన్నచో ఏ వేదములో ఎక్కడ సంఖ్యా సహిత వివరణ ఇవ్వగలరు అని మనవి. మంత్రద్రష్ట విశ్వామిత్ర ఋషి  నాది సవితా మంత్రమో అని ఋగ్వేదములో 10/62/10 మంత్రముగా దర్శించుకున్నారు.

దయానందులవారు అందులో 24 అక్షరములు లేవు, 23 అక్షరములే కలవు ఇది నిచృత్ గాయత్రీ ఛందస్సుచతుర్వింశత్యక్షరా గాయత్రీ కాదు అని కాశీ విద్వత్సభలో నిరూపించారు/నిర్ణయించారు.

ఋగ్వేదమునకు సమగ్రభాష్యము వ్రాసిన సాయణాచార్యులవారు యద్వా యద్వా అనుచూ 6,7 విధములుగా వ్యాఖ్యానమొనర్చిరి.తత్వార్థం తెలుసు కొనుటకు మంచి వైయాకరణి యైన వేదాంత అధ్యాపకునికి పాఠం చెప్పుటకు ఒక్క గంట చాలు.మంచి విద్యార్థి అయినచో 5 నిముషములు చాలు.

ప్రస్తుతం తిరుమల లో అమలులో ఉన్న వైఖానసాగమము లో ౼

"త్వష్టా౼ప్లోతా వస్త్రోత్తరీయాది సంచయః స్థానే హేమాభ శ్శుక పించాంబరధర చతుర్భుజః కలశాక్షమాలా పాణిర్జటాధరో హంసవాహనో రూపాధ్యక్షర భీజస్సావిత్రీపతి రిజిజ్జాతః కమండలుధ్వజో హుంకారవ స్తష్టా....త్సష్టారం రూపజాతం నిధిజం ప్లోతాధపతి మితి."

ఇందులో త్వష్టృ దేవుని వర్ణన విశేషాలు వర్ణిస్తూ అతనికి సావిత్రి దేవి పతి అని చెప్పారు. త్వష్టృ అనగా విశ్వకర్మయే అని భాష్యకారులు చెబుతున్నారు. పురుషసూక్తము కూడా " విశ్వకర్మణ స్సమవర్తతాధి తస్య త్వష్టా విదధ ద్రూపమేతి ..."అని చెబుతూ త్వష్టృవు విశ్వకర్మయే అథవా విశ్వకర్మావతారమే త్వష్టృ అని చెబుచున్నది.జగతి పితృత్వవమును వైఖానసాగమము వాచ్యముగనేనిర్ణయిస్తున్నది.

తైత్తిరీయ బ్రాహ్మణము 1/5/12/5

గాయత్రీ ఛందస్సు ప్రజాపతి  రథం యొక్క  ముందర చక్రములలో ఒకటి అని చెప్పింది.

మరియొక కథ ప్రకారం 

గాయత్రీ, త్రిష్టుప్, జగతి చందస్సు లకు దేవతలు సొమమును తీసుకురమ్మని చెప్పిరి అందుకు జగతి ,త్రిష్టుప్ చందస్సులు తీసుకుని రాలేదు కానీ గాయత్రీ ఛందస్సు మాత్రం తెచ్చినది.

కనుక గాయత్రి చందస్సు అంటే దేవతలకు ఇష్టం అయిందని చెబుతారు.

ఛందసాం అహం గాయత్రి అని గీతాచార్యుడు చెప్పడము భగవద్గీత చదివే వాళ్ళకు  తెలిసి ఉంటుంది కానీ భగవద్గీతను అనగా అందలి శ్లోకములను గీతకారుడు అయిన శ్రీకృష్ణుడు గాయత్రీ ఛందస్సు లో చెప్పలేదు .

శతపథ ఆరణ్యకము బృహదారణ్యకములలో  ఒక సందర్భం లో ఉల్లేఖించించిన ప్రకారం  దేవాసుర సంగ్రామంలో  గాయత్రిని దేవతలు విశ్వకర్మా అని అసురులు దాభీ అని సంబోధన చేశారంట . దేవతలు మరియు అసురులు అనగా వేరే ఎవరూ కాదు ప్రజాపతి యొక్క సంతానమే అని శాస్త్రం చెబుతున్నది.దైవాసురములు అనగా మనుషులలో ఉన్నటువంటి మంచి గుణమే దైవము ,చెడ్డ గుణమే ఆసురము అని ఇంకొక కథనం.

అందరూ కూడా ఈవిధంగా మాట్లాడేందుకు భయమో మరియు ఇతర కారణముల నుండి మాట్లాడే సాహసం చేయరు. ఎందుకనగా ఆ మంత్రం యొక్క మహిమ పై ఉండే భయము అయ్యుండొచ్చు. "

వైశ్వకర్మణ తత్వానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే ఇటువంటి విషయములు ఆధార స్తంభముగా నిలబడతాయి.

వేదములలో చాలా దేవతలకు దృష్టార ఋషులైన వివిధ ఋషులు వివిధ ఛందస్సులలో స్తుతి చేసినారు.

కానీ ఏ దేవుని మంత్రమునకు కూడా ద్రష్ట్రార ఋషులు దర్శించుకున్న మంత్రములను వ్రాయుటకు ఉపయోగించిన ఛందస్సు పేరుతో ఈ మంత్రం అనుష్టుప్మంత్రము అని తృష్టుప్ మంత్రమని జగతి మంత్రం అని చెప్పలేదు.

జనులకు నిత్యము అవసరమైనటువంటి  అగ్నిదేవునికి సంబంధించిన ఋగ్వేదం లో గల ప్రథమమంత్రము కూడా గాయత్రీ ఛందస్సు లోనే ఉన్నది కానీ ఆ మంత్రానికి గాయత్రి మంత్రం అని ఎందుకో చెప్పలేదు.

మంత్రద్రష్టలు, జనకులు అయినటువంటి విశ్వామిత్రుడే సవితా మంత్రము అని చెప్పెను. మనము విశ్వామిత్రునికి వ్యతిరేకముగా ఈ మంత్రము యొక్క ఛందస్సు అయినటువంటి గాయత్రి అనే నామముతో పిలుస్తూ ఆఋషి వాక్యమునకు వ్యతిరేకముగా పిలుచుట న్యాయమేనా.? 

మనకేమి అధికాము కలదు.?

ఇదంతా ఇలా ఉండని

గానము చేసిన త్రాణము చేయును కనుక గాయత్రి అని పేరుతో గుర్తిస్తున్నారు  అనుకుంటే.

చాలా కష్టపడి దశావతారములు ఎత్తిన విష్ణువు యొక్క సూక్తములు రక్షణ చేయవా?

పాపాన్ని హరించే శక్తి ఉన్నటువంటి రుద్ర సూక్తములు రక్షణ ఇవ్వలేవా?

బ్రహ్మ సూక్తములు అనగా వేదములలో కనిపించవు.

సవిత యొక్క మంత్రము కనుక సావిత్రము అని చెప్పవచ్చు కానీ గాయత్రి అని ఎలా చెబుతున్నారో అనేది అతిశయమే.

ఇంతటి వేద వీరు లైనటువంటి వేద విజ్ఞానుల అజ్ఞానులకు అర్థం కాకుండా జల్పము చేస్తున్నారు అని అనుకుంటే విశ్వకర్మ సూక్తం ఋగ్వేదములో 10వ మండలం 82వ సూక్తము లో ఏడవ మంత్రము -

 " న తం విధాత ....... "  అని గానము చేసినచో రక్షణ ఇవ్వదంటారా?

వేదములు యొక్క రహస్యములు అయినటువంటి , వైశ్వకర్మణ సాహిత్యం, విజ్ఞానము భూస్థాపితం అయినది శాస్త్రబద్ధంగా తర్కబద్ధంగా పరిశోధించి  బయటకు తీసుకొని రావలెను.

గాయత్రీ ఛందస్సు యొక్క మంత్రములు చాలా ఉన్నవి. మీకు అర్ధమయ్యేటట్లు చెప్పమంటే సులభంగా ఒకే ఒక మాట అది ఏంటంటే. ఈ మంత్రము ద్రష్ట్రార ఋషి ఆయినటువంటి విశ్వామిత్రుడు చెప్పినట్లుగా సవిత్రుడు పురుషుడు . మీరు ఆరాధిస్తున్నటువంటి గాయత్రి అనే దేవత స్త్రీ రూపము.

ఇప్పుడు మీరే తీర్మానం చేయండి ఏది సరైన నిర్ణయం అని.

ఇంకా అసలు నిజం తెలుసుకోవాలంటే సవితా మంత్రం  సావిత్రము అనగా త్వష్టృబ్రహ్మ (త్వష్టవిశ్వకర్మ)యే. 

ఈ విషయానికి సూత్రమైన వైదిక ఆధారములను ఇస్తాను చూడండి.

" దేవస్త్వష్టా సవితా విశ్వరూపః పుపూషప్రజాః

పురుదా జజానః|

ఇమాచ విశ్వాభువనానయస్య మహద్ దేవనామ సురత్వమేకం|| "

              ( ఋగ్వేదం -3/55/19)

భావః :-

త్వష్టవిశ్వకర్మ పరమాత్మ ఎల్లా జీవుల హృదయములలో ఆత్మ రూపముగా సమస్త విశ్వమునందు సర్వాంతర్యామి గా ఉన్నారు. ఇతనే సవితారూపంలో అందరి బుద్ధులను ప్రేరేపించు తున్నాడు. ఇతనే విశ్వరూపుడు ఈతనే దేవ , యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మానవ ప్రాణి పక్షి క్రిమికీటకాదులున్ను పుట్టించి పోషణ చేయుచున్నాడు.

ఈ సమస్త జగమంతయు విశ్వకర్మ యై ఉన్నది.

పైన చెప్పిన ఋగ్వేద మంత్రం ప్రకారము స్పష్టముగా పరమాత్మ విశ్వకర్మ సవితా దేవత అని తెలుపుచున్నది

ఇంకొక ఉదాహరణ చూద్దాం.

" గర్భానునౌ జనితా దంపతీ కః దేవాః త్వష్టా సవితా విశ్వరూపః|

నకిరస్య ప్రమినంతి వ్రతాని వేద 

నావస్య పృథివీ ఉపద్యౌః|| "

         ( ఋగ్వేదం 10వ మండలం 10/5)

భావః :-

దేవాది దేవుడు సమస్త విశ్వ సృష్టికర్త సకల రూపకర్త అయినటువంటి త్వష్ట విశ్వకర్మ ప్రజాపతి యు సవితృడై సమస్తమునకూ ప్రేరకుడై ఉద్దీపనము చేసి  సమస్త రూపములను ధరించి త్వష్టవిశ్వకర్మ పరమాత్ముడే మనల్ని దంపతులుగా చేసెను.

 అతనియొక్క కార్యములలో లోపములు ఉండవు. మన సంబంధం ద్యావా పృథ్వి లకు తెలుస్తుంది. ఈ మంత్రము కూడా త్వష్టవిశ్వకర్మయే సవితాదేవుడు అని చెబుతున్నది.

ఈ సవిత దేవుడి గురించి చాలా సూక్తములు మంత్రములు వేదములలో మనము చూడవచ్చు. సవితా దేవుడిని వేదము విశ్వకర్మ అనియు పరమాత్మ సృష్టికర్త అనియు కొనియాడుతున్నది. చివరకి తెలిసినది ఏమిటంటే సవిత అనే దేవుడు పురుషుడు.

మీరందరూ ఈ సవితా దేవుడికి స్త్రీ రూపాన్ని ఇచ్చి,  ఈ సవితా మంత్రమును ఉపయోగించి ధ్యానము జపము తపములు చేస్తున్నారు, జరిపిస్తున్నారు .

ఒక పురుష దేవుడికి మీరు స్త్రీ రూపంగా వర్ణిస్తూ పొగుడుతూ ఉంటే ఆ దేవత సంతృప్తి పొందుతుందా?

ఉదాహరణకి నువ్వు ఒక పురుషుడు అయితే నేను నిన్ను స్త్రీగా స్త్రీ లక్షణములతో చక్కగా వర్ణిస్తూ పొగుడుతూ ఉంటే మీకు కోపం వస్తుంది కదా. తర్వాత మీ నుంచి నేను ఏవైనా నాకు అనుకూల కార్యక్రమములు చేసుకోనగలనా?

 సవితా దేవుడు త్వష్టప్రజాపతి యొక్క అంశయే.

 ప్రస్తుత కాలంలో వైశ్వకర్మణ సమాజమును  ప్రస్తుతకాలంలో కొంతమంది కనిపిస్తున్న ఈ విధమైన అవైదికులుగా రూపాంతరము జరిగేందుకు కారణభూతులు అయినటువంటి వైశ్వకర్మణేతర కొందరు స్వార్థపూరిత దృష్టశక్తులు చేసినటువంటి కుతంత్రములలో పుట్టినదియే గాయత్రి అనే స్త్రీస్వరూప దేవత.

సవితా అని వేదము లో వర్ణింపబడిన త్వష్టవిశ్వకర్మ కు పూజ చేయుటకు అభద్రత భయంతో ఇచ్చగింపక ఈ విధమైన సారస్వత్య దోషమునకు పాల్పడ్డారు.

వారు కల్పించిన అసత్యమునకు పాపమునకు మనం ఎందుకు ప్రోత్సాహము చేయవలెను?

వైదిక దేవతలను ప్రజలకు దూరం చేసి  కల్పిత అసత్య పురాణములను ప్రచారం చేయడం ద్వారా సమాజంలో సరైన స్థానమును పూజ్యత పొందేందుకు అదే సమయంలో వైదికులు పూజ్యులు అయినటువంటి విశ్వబ్రాహ్మణుల చరిత్రను 

హీనమైనదిగా ప్రతిపాదన చేయుటకు చేసినటువంటి ఒక కుతంత్రమే గాయత్రీ అనే స్త్రీదేవతాసృష్టి.

వీళ్లు ఇంత బ్రహ్మహత్యా సమానమైన నీచపాపకృత్యానికి దిగజారడానికి ప్రధాన కారణం ఏమిటంటే వైదిక సాహిత్యమంతా వైశ్వకర్మణులదే  అవ్వడం. ఇందులో బహిర్గత రహస్యం ఏమిటంటే అస్పృశ్యులు అని వీరలచే సృష్టించబడిన ఇండ్ల లోనే పుట్టి  వారిని అస్పృశ్యులుగా గుర్తింప జేసీ సమాజము నుంచి నిమ్న స్థానమునకు త్రోసిపుచ్చి వారి యొక్క స్వజనులకు మోసం చేసినటువంటి వంచిత బుద్ధి గల కపట స్వార్థపూరిత జనులనే ఒక ప్రత్యేక వర్గం యొక్క సృష్టియే గాయత్రి.

ఇకనైనా వైదిక సత్యము ఏదియో అదియే మనము తెలుసుకుని వైదిక జీవనమును ప్రారంభించుదాం.

ఇకపై సవితా రూపమైన త్వష్టవిశ్వకర్మను ధ్యానము చేయుచు ఆ మంత్రమును సవితామంత్రము గానే జపించవలెను అని తెలుసుకోండి.

ఈ అంశమును గిట్టనివాళ్లు,దీన్ని వ్యతిరేకించే వర్గం వాళ్ళు ఎవరైనా సరే మీకు ఆక్షేపణలు ఉన్నచో బహిరంగ వేదికను గానీ మీకు అనుకూలంగా ఉండే టివి మధ్యమంలో డిబేట్ గానీ ఏర్పాటు చేయండి మేము మా యొక్క పండితులు, గురువులు తో పాటుగా వచ్చి వేదముల ఆధారముగా మీయొక్క సందేహములను నివృత్తి చేయగలము.

పనికిరాని అడ్డమైన కామెంట్లను దయచేసి పెట్టకండి.

ఏ ప్రశ్నలైనా ఈవ్యాసములోనుంచే అడగాలి.

ఇట్లు మీ యొక్క ప్రియమైన 

వేద బ్రహ్మశ్రీ ఆచార్య టి మోహన్ రావు శర్మ,

స్థపతి, వేదధ్యాయి, శిల్ప శాస్త్ర పండితులు ,శిల్ప శాస్త్ర ఉపన్యాసకులు,జ్యోతిష్య విద్వాన్, నాడీ జ్యోతిష్యులు,వాస్తు శాస్త్ర నిపుణులు సంఖ్యా శాస్త్ర నిపుణులు పురోహిత ఆధ్వర్యులు. బెంగళూరు . 9341265719.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow