ఉద్యోగులకు 50%/డే బై డే , ఆప్షన్ ను కల్పించాలి : నమ్రత్

Apr 27, 2021 - 18:42
Apr 28, 2021 - 21:29
 0
ఉద్యోగులకు 50%/డే బై డే , ఆప్షన్ ను కల్పించాలి : నమ్రత్

గుంటూరు నగర పాలక సంస్థ : 50% మంది ఉద్యోగులను WFH (work from home లేదా రోజు మర్చి రోజు పని వేళలను ) ఎంపిక చేసి , ఇతరులకు ఆఫీసు సమయాలను మార్చవలిసింది గా నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ చల్ల అనురాధ గారికి వినతి పత్రం సమర్పించిన నమ్రత్  కుమార్ : త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కమీషనర్ . 

నమ్రత్ కుమార్ (మునిసిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ,AP  స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ,మరియు AP  జేఏసీ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మరియు సూపరింటెండెంట్ ). ప్రస్తుత కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తరుణం లో , ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు , వారి కుటుంభం సభ్యులు కరోనా బారిన పడి , అనారోగ్యం తో బాధపడుతున్నారు . మరికొందరైతే అకాల మరణం కూడా చెందిన పరిస్థితి. ఇంకొందరికి అయితే హాస్పిటల్ ల్లలో  బెడ్ దొరకక , దీనావస్త లో ఉన్నారు . వారి భాద వర్ణనాతీతం, అటు సొంత మనుషులా లేక ఇటు ప్రభుత్వ బాధ్యతా, లేక ప్రజల రక్షణా అంటూ తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్న పరిస్థితి. 

ఒక పక్క ప్రభుత్వం(legislature ) చాకచక్యం గ ప్రజలు నష్ట పోకుండా ,సమాజం అస్తిత్వవాన్ని కాపాడడానికి అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. కానీ అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలను  అమలు చేయడానికి (Executive)  సమర్ధ వంతంగా ఉండాలి . ప్రస్తుత పరిస్థుతులలో సిబ్బంది కి  మానసిక, ఆర్ధిక , ఆరోగ్య విషయాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నందున , పనివేళల్లో మార్పు చేసి మిగిలిన వారిని సమర్ధవంతం గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని ....అంటూ శ్రీయుత కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించారు . 

పరిస్థితిని పై పూర్తి అవగాహన ఉన్న కమిషనర్ గారు వెంటనే స్పందించి , సంబంధిత అధికారులతో మరియు DC 2 శ్రీ D.శ్రీనివాస్ గారి తో  చర్చించి తక్షణం మార్గదర్శకాలను విడుదల చేయవలసిందిగా సూచించారు . 

వినతి పత్రం సమర్పించిన వారు : సూపరింటెండెంట్ లు: రవి కిరణ్ రెడ్డి , శివన్నారాయణ , రెహ్మాన్ , మరియు అసోసియేషన్ సభ్యులు : SK  ఖాజావళీ , జి. శ్రీను , నవీన్ , తదితరులు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow