GVR&S మహిళ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పలు ఉద్యోగ ఉపాధి అవకాశాల"గోష్టి - కుర్రం

ఈ కార్యక్రమానికి జాతీయ గణాంక కార్యాలయం, కడప ప్రాంతీయ కార్యాలయ సంచాలకులు శ్రీ ఎ. నాగ మల్లేశ్వర రావు ముఖ్య అథిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో GVR & S కళాశాల డైరెక్టర్ భువనేశ్వరి, ప్రిన్సిపాల్ సునీల్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

Mar 28, 2023 - 21:15
 0
GVR&S మహిళ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో  పలు ఉద్యోగ ఉపాధి అవకాశాల"గోష్టి - కుర్రం

కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంక కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక- GVR&S మహిళ డిగ్రీ కళాశాలలోని సమావేశమందిరంలో జిల్లాలోని పలు డిగ్రీ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులకు“అధికారిక గణాంకాల వ్యవస్థ మరియు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో గల పలు ఉద్యోగ ఉపాధి అవకాశాల"గోష్టి .

తదనంతరం క్విజ్ పోటీని నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమంలో జిల్లా లోని 7 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు,వక్తల ప్రసంగం అనంతరం మొదటి బహుమతి గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల, రెండవ బహుమతి తెనాలికి చెందిన ప్రియదర్శిని కళాశాల, మూడవ బహుమతి GVR & S మహిళ డిగ్రీ కళాశాల ల వారు విజేతలుగా నిలిచారు వారికి పోటీ పరీక్షకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు మరియు సర్టిఫికెట్ మెమొంటో ను బహుమతి గా ప్రదానం జరుగింది. ఈ కార్యక్రమానికి జాతీయ గణాంక కార్యాలయం, కడప ప్రాంతీయ కార్యాలయ సంచాలకులు శ్రీ ఎ. నాగ మల్లేశ్వర రావు ముఖ్య అథిధిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో GVR & S కళాశాల డైరెక్టర్ భువనేశ్వరి, ప్రిన్సిపాల్ సునీల్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా ఉప ప్రాంతీయ కార్యాలయ గణాంక అధికారి D. హనుమంతరావు పర్యవేక్షించారు, ఈ సందర్భంగా గుంటూరు జాతీయ గణాంకాల కార్యాలయ అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం NSSO ( జాతీయ గణాంకాల కార్యాలయం) వారు చేసే వివిధ సర్వేల ఆధారంగానే ప్రభుత్వం అమలు చేసే పథకాలను నవీకరణ చేయనన్నారు వివరాలు తెలిపిన ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం అని కేంద్ర ప్రభుత్వ సర్వేలకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow