సైక్లోన్‌లకు పేర్లు ఎలా పెడతారు

హుద్‌హుద్..తిత్లీ..గజ..జల్..పైలీన్ ఇలా ఒక్కొక్క తుపానుకు ఒక్కో పేరు. అసలీ పేర్లను పెట్టేది ఎవరు ? ఎప్పట్నించి ఈ పద్ధతి అమల్లో ఉంది ? ఇంకా జాబితాలో ఉన్న పేర్ల వివరాలేంటి ?

Nov 27, 2020 - 21:09
Nov 27, 2020 - 21:34
 0
సైక్లోన్‌లకు పేర్లు  ఎలా పెడతారు

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో చోట ఎప్పుడో సారి తుపాన్లు వస్తూనే ఉంటాయి. ఎన్నో సముద్రాలు..ఎన్నో తుపాన్లు. మరి వీటన్నింటినీ గుర్తుంచుకోవాలంటే ఎలా. అందుకే తుపాన్లకు పేర్లు ( Naming of Cyclones ) పెడుతుంటారు. అట్లాంటిక్ సముద్ర ( Atlantic ocean ) ప్రాంతాల్లో వచ్చే తుపాన్లకు పేర్లు పెట్టడమనేది 1953 నుంచే అమల్లో ఉంది. ఐక్యరాజ్యసమితి  ( UNO ) అనుబంధ సంస్థ అయిన  ప్రపంచ వాతావరణ సంస్థ ఈ పేర్లు పెడుతుంది. మరి దక్షిణాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో తుపాన్లకు పేర్లు పెట్టడం 2004 నుంచే ప్రారంభమైంది. అంతకుముందు హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్లకు పేర్లు లేనేలేవు. 

మన దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను, శ్రీలంకను ఇటీవల నీలం తుఫాను ఓ కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు వచ్చిన ఈ తుఫానుకు నీలం అని పాకిస్తాన్ పేరు పెట్టింది. హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఎనిమిది దేశాలు తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి.

2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ( World Meteorological Organization ) ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు 8 పేర్ల చొప్పున సూచించాయి. మొత్తం 8 దేశాలు 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను తయారైంది. అప్పట్నించి వచ్చిన 64 తుపాన్లతో పేర్లన్నీ పూర్తయ్యాయి. 

ఈసారి 13 దేశాలు కలిసి..ఒక్కోదేశం 13 పేర్లు చొప్పున సూచించడంతో 139 పేర్లు చేరాయి జాబితాలో. ఈ కొత్త జాబితాలో ఇప్పటికే రెండు పేర్లు వాడేసారు. బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ్ ( Nisarg ), ఇండియా సూచించిన గతి ( Gati) తుపాన్లు ఇప్పటికే వచ్చి వెళ్లాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న నివర్ తుపాను పేరును ఇరాన్ సూచించింది. 

భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండులు వరుసగా తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి. ఇందులో భాగంగా ఈసారి తమిళనాడు, ఎపి, శ్రీలంకలను కుదేపిసిన సైక్లోన్‌కు పాకిస్తాన్ పేరు పెట్టింది. తుపాన్‌లకు పేర్లు పెట్టడం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది.

అయితే హిందూమహా సముద్రంలో వచ్చే తుఫాన్లకు పేర్లు పెట్టేందుకు ఒక విధానాన్ని ఆయా దేశాలు 2004లో రూపొందించాయి. ఈ విధానమే ప్రస్తుతం అమలులో ఉంది. నీలం తుఫాను కుదిపేయగా.. భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు కూడా ఆయా దేశాలు పేర్లు నిర్ణయించాయి.

తర్వాత వచ్చే తుఫానుకు శ్రీలంక మహాసేన్ అని పేరు పెట్టగా, ఆ తర్వాత దానికి థాయ్‌లాండ్ పైలిన్ అని పేరు పెట్టింది. భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు మన దేశం తరఫున కూడా అప్పుడే పలు పేర్లు క్యూలో ఉన్నాయి. లెహర్, మేఘ్, సాగర్, వాయులు ఉన్నాయి.

అలాగే పాకిస్తాన్ పెట్టిన పేర్లలో నీలోఫర్, టిట్లి, బుల్ బుల్ ఉన్నాయి. నీలం తుఫాన్ కంటే ముందు వచ్చిన తుఫాన్‌కు ముర్జాన్ అని ఓమన్ దేశం పెట్టింది. 2004 నుండి వచ్చిన పలు సైక్లోన్‌లకు మన దేశం పెట్టిన పేర్లు... అగ్ని, ఆకాశ్, బిజ్లి, జల్ ఇలా ఉన్నాయి. వచ్చే తుఫానుకు శ్రీలంక మహాసేన్‌గా నామకరణం చేసింది.

సైక్లోన్‌లకు పేర్లు ఎందుకు :-  సైక్లోన్‌లకు నీలమ్, అగ్ని, ఆకాశ్ అని ఇలా పేర్లు ఎందుకు పెడతారనే ప్రశ్న ఉదయించవచ్చు. సైక్లోన్‌కు టెక్నికల్ కోడ్‌నో లేక ఓ నెంబర్‌నో ఇవ్వడం కంటే ఇలా ప్రజల్లోకి వెళ్లే పేర్లు పెట్టడం సులభం మరియు శ్రేయస్కరం . తుఫాన్ అనేది బీభత్సాన్ని సృష్టిస్తుంది. అందుకే ప్రజల్లోకి వెళ్లే పేరు పెడితే వారిని అప్రమత్తం చేసేందుకు వీలుగా ఉంటుంది.  అలాగే ఇలా పేర్లు పెట్టడం వల్ల ఒక పర్యాయం వచ్చిన తుఫాను గురించి తెలుసుకునేందుకు ఆ పేరుతో పరిశీలిస్తే దాని వల్ల వచ్చిన లాభనష్టాల గురించి కూడా సులభంగా తెలుసుకోవచ్చ. నెంబర్ ఇవ్వడమో టెక్నికల్ కోడ్ ఇవ్వడమో చేస్తే సులభంగా ఉండదు. ఈ పేర్లు పెట్టడం కూడా ప్రపంచ వాతావరణ సంస్థ నియమావళికి లోబడే ఉంటుంది. 

బంగాళాఖాతం ( Bay of Bengal )లో ఏర్పడిన నివర్ సైక్లోన్..తూర్పుతీరం వైపుకు దూసుకొస్తోంది. తమిళనాడు తీరంతో పాటు ఏపీ,కర్నాటక రాష్ట్రాల్లోని పలు జిల్లాల్ని ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా  ఉన్న నివర్ ( Nivar )..మరి కొన్నిగంటల్లో పెను తుపానుగా మారనుంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్న తుపాను ఇవాళ అర్ధరాత్రి  తీరం దాటనుంది. 

గతి, తేజ్, మురసు, ఆగ్, వ్యామ్, ఝుర్, ప్రొబాహు, నీర్, ప్రభంజన్, ఘర్ని, అంబుద్, జలధి, వేగ పేర్లను భారత్ సూచించింది. ఇందులో గతి తుపాన్ ఇప్పటికే వచ్చి వెళ్లిపోయింది

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow