భారత దేశ రాజ్యాంగం గురించి ఆస‌క్తిక‌ర‌ విషయాలు

Feb 19, 2021 - 06:23
Jun 24, 2021 - 15:44
 0

* 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
* రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
* మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు చేశారు.
* రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీనికి అంబేడ్కర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రధాన కమిటీతో పాటు, కొన్ని ఉప కమిటీలు ఏర్పడ్డాయి.
* ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదే.
* రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రాయ్‌జాదా.. ఇటాలిక్‌ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు. ప్రతి పేజీనీ కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు.
* ‘భారత దేశ ప్రజలమైన మేము’ అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలుగా ఉంది.

* మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్‌ ఆఫ్‌ బారోయింగ్స్‌’ అని సరదాగా అంటారు. జపాన్‌, ఐర్లాండ్‌ ఇంగ్లండ్‌, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాల్ని తీసుకున్నాం కాబట్టే ఆ విధంగా పిలుస్తారు. రాజ్యాంగం రాయడం 1949 నవంబరు 26వ తేదీ నాటికి పూర్తయ్యింది. ఈ తేదీనే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటాం. మరో రెండు నెలల తర్వాత అంటే.. 1950, జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow