పోలీస్ సమక్షంలో ప్రశాంతంగా తెరుచుకున్న కాకాని శనీశ్వర స్వామి తలుపులు

ఆనందోత్సాహాలలో భక్తులు, స్వయంగా అభిషేకం చేసుకోవడం చాల అదృష్టం గ భావిస్తున్న భక్తులు, కబ్జా / అనైతిక ప్రవర్తనను తప్పు బట్టిన హిందూ ఐక్య పోరాట వేదిక ప్రతినిధి - హైందవ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ శ్రీ అనిల్ బెహరా

నిన్నటి అనగా "తాళాలు తెరిపించండి! - శని స్వామి సేవకు అనుమతించండి-కబ్జా నుండి కాపాడండి" అంటూ జరిగిన ఆందోళనకు పోలీస్ వారి సత్వర స్పందనతో ప్రశాంతం గా  శని త్రయోదశి పూజలు జరిగాయి . 

(kakani shani temple opened successfully under police supervision)

ఆనందోత్సాహాలలో భక్తులు, స్వయంగా అభిషేకం చేసుకోవడం చాల అదృష్టం గ భావిస్తున్న భక్తులు,  పోలీస్ సమక్షంలో ప్రశాంతంగా తెరుచుకున్న కాకాని శనీశ్వర స్వామి తలుపులు -  కబ్జా మరియు అనైతిక ప్రవర్తనను తప్పు బట్టిన  హిందూ ఐక్య పోరాట వేదిక ప్రతినిధి - హైందవ  డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ శ్రీ అనిల్ బెహరా .

ఈ క్రింది వీడియో లో వారి(అనిల్ బెహరా) మాటల్లో నే వినండి. 

చిన్న శని సింగణాపూర్ గా పేరుగాంచి దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతూ పెద కాకాని గ్రామంలో 20 సంవత్సరాల క్రితం మౌనస్వామి గా కీర్తించబడిన అవధూత శ్రీశ్రీశ్రీ అంజనా నంద స్వామి గురూజీ కరకమలముల మీదుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శని సింగణాపూర్ నుండి స్వయంభువు మూర్తి ని తీసుకు వచ్చి..

కర్మ ఫల ప్రదాత అయిన శ్రీ శని భగవాన్ ఆశీస్సులు శని గ్రహ పీడితులై బాధలు అనుభవించుచున్న భక్తులకు అందజేయాలన్న సత్సంకల్పంతో, భక్తులే స్వయంగా అభిషేకము చేసుకుని అర్చించుకునే విధంగా అర్చనవిధి నిర్ణయించారు.

స్వయంభువు మూర్తిగా ప్రతిష్ఠితమై భక్తుల కర్మ దోషాలను తొలగిస్తూ, వారిని అనుగ్రహిస్తున్న ఈ క్షేత్రం...