తాళాలు తెరిపించండి! - శని స్వామి సేవకు అనుమతించండి-కబ్జా నుండి కాపాడండి

చిన్న శని సింగణాపూర్ గా పేరుగాంచి దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతూ పెద కాకాని గ్రామంలో 20 సంవత్సరాల క్రితం మౌనస్వామి గా కీర్తించబడిన అవధూత శ్రీశ్రీశ్రీ అంజనా నంద స్వామి గురూజీ కరకమలముల మీదుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శని సింగణాపూర్ నుండి స్వయంభువు మూర్తి ని తీసుకు వచ్చి.. కర్మ ఫల ప్రదాత అయిన శ్రీ శని భగవాన్ ఆశీస్సులు శని గ్రహ పీడితులై బాధలు అనుభవించుచున్న భక్తులకు అందజేయాలన్న సత్సంకల్పంతో, భక్తులే స్వయంగా అభిషేకము చేసుకుని అర్చించుకునే విధంగా అర్చనవిధి నిర్ణయించారు. స్వయంభువు మూర్తిగా ప్రతిష్ఠితమై భక్తుల కర్మ దోషాలను తొలగిస్తూ, వారిని అనుగ్రహిస్తున్న ఈ క్షేత్రం...

May 26, 2022 - 14:29
Aug 1, 2022 - 14:04
 0

చిన్న శని సింగణాపూర్ గా పేరుగాంచి దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతూ పెద కాకాని గ్రామంలో 20 సంవత్సరాల క్రితం మౌనస్వామి గా కీర్తించబడిన అవధూత శ్రీశ్రీశ్రీ అంజనా నంద స్వామి గురూజీ కరకమలముల మీదుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శని సింగణాపూర్ నుండి స్వయంభువు మూర్తి ని తీసుకు వచ్చి..

UPDATE on This Issue:- పోలీస్ సమక్షంలో ప్రశాంతంగా తెరుచుకున్న కాకాని శనీశ్వర స్వామి తలుపులు 

కర్మ ఫల ప్రదాత అయిన శ్రీ శని భగవాన్ ఆశీస్సులు శని గ్రహ పీడితులై బాధలు అనుభవించుచున్న భక్తులకు అందజేయాలన్న సత్సంకల్పంతో, భక్తులే స్వయంగా అభిషేకము చేసుకుని అర్చించుకునే విధంగా అర్చనవిధి నిర్ణయించారు. స్వయంభువు మూర్తిగా ప్రతిష్ఠితమై భక్తుల కర్మ దోషాలను తొలగిస్తూ, వారిని అనుగ్రహిస్తున్న ఈ క్షేత్రం.

హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ తీర్ధ స్వామి వారి అనుగ్రహముతో వారి సూచన మేరకు నవగ్రహ సహిత శని భగవాన్ మూర్తి విగ్రహ ప్రతిష్ఠ జరిపి భక్తులను సభ్యులుగా చేస్తూ "శ్రీ శనైశ్చర సేవా సంస్థాన్" ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసినారు.

అప్పటి నుండి భక్తుల సహాయ సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్న నేపథ్యంలో గురూజీ శివైక్యం చెందారు. తదుపరి భక్తులలో ఒకరైన న్యాయవాద వృత్తి నిర్వహిస్తున్న పాండు రంగారెడ్డి అను వ్యక్తి ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తూ.

భక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, చులకనగా, అవహేళనగా మాట్లాడుతూ కించపరుస్తూ వున్నారు.

ఈ మధ్యన కొన్ని నెలలుగా స్వయంభువు మూర్తికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇనుపతలుపులు పెట్టి తాళాలు వేసి భక్తులు స్వయంగా అభిషేక, అర్చనలు చేసుకోకుండా అడ్డుకుంటూ భక్తుల ను మానసికంగా హింసిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.

మరియు గురూజీ ఆదేశాన్ని లక్ష్యపెట్టకుండా తుంగలో తొక్కేసినట్లు ప్రవర్తిస్తున్నారు. హిందూ సంఘాలు, భక్తులు ఈ దుశ్చర్యను ఖండించాలని కోరుతున్నాము. 

ఇట్లు హిందూ ఐక్య పోరాట  వేదిక,

అంటూ వేడుకుంటున్న ఆలయ కమిటీ సభ్యులు .

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow