"కలం" మాటున కన్నీళ్లు? : కళావెంకటరావు.యన్

Image Credits/Source : Flickr

Jun 1, 2021 - 11:13
Jun 1, 2021 - 11:14
 0
"కలం" మాటున కన్నీళ్లు? : కళావెంకటరావు.యన్

"కలం".. మాటున కన్నీళ్లు...?

*కరోనా కోరల్లో చిక్కుకొంటున్న  జర్నలిస్ట్ లు.. * జీవనోపాధి ప్రశ్నర్ధకమే..? సమాజాన్ని మార్చేయాలి..తప్పులను ప్రశ్నించాలి.. పేద ప్రజలకు న్యాయం జరగాలి..వ్యవస్థలో మార్పులు రావాలని పొద్దు పొడిచిన నుంచి చీకటి పడ్డంత వరకు గొంతు చించి...కలం సిరా     అయ్యేవరకు వ్రాసే జర్నలిస్ట్ లకు  చివరకు  మిగిలేది సిరా అపోయినా పెన్ను ..ఇంక్ తో తడిచిన జోబి తప్పా ..ఇంకేమి లేదని సంగతి తెలిసి వచ్చేవరకు జర్నలిస్ట్ బ్రతుకులు మోడులానే మిగిలిపోతాయనే సంగతి కరోనా వైరస్ కూసంత నేర్పిందనే చెప్పవచ్చు.

గత కొంత కాలంగా  కరోనా వైరస్ సోకి పిట్టల్లా రాలిపోతున్న జర్నలిస్ట్ లకు మిగిలింది తాము పనిచేసే  పేపర్ లలో తన కోసం  గొప్పగా వ్రాసే కధనాలు తప్పా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు బ్రతికున్నoత కాలం శ్రమించిన శ్రమ జీవికి ప్రభుత్వం కానీ . నాయకులు కానీ జర్నలిస్ట్ మరణాలకు శ్రద్ధాంజలి ఘటించడం తప్పా చేసేది ఏముంది..నాయకులు అందలం ఎక్కలంటే తను చేసే సేవలు ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాలంటే జర్నలిస్ట్ కావాలి అందలం ఎక్కాక  ఆ జర్నలిస్టులు ఏడ ఉన్నారో..ఈ కరోనా కాలంలో ఎలా బ్రతుకుతున్నారో...అవసరం లేదంటే మరి వ్యవస్థల కోసం పోరాడే జర్నలిస్ట్ పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచిస్తారు.

గత రెండేళ్లుగా  కరోనా వైరస్ ప్రబలుతుంటే ప్రజలు పడ్డ కష్టాలను ప్రజా ప్రతినిధులకు చూపించాలని తన కుటుంభాన్ని సైతం వదిలిపెట్టి క్షేత్ర పర్యటన చేసి కరోనా రక్కసికి బలవుతుంటే ఆ కుటుంభ కన్నీరును ఎవరు తుడుస్తారు.ప్రభుత్వం కొన్ని పత్రికల యాజమాన్యాల పై చూపించే కోపానికి  జర్నలిస్ట్ లు బలవుతున్న సంగతి ఎప్పుడు తెలుసుకొంటుంది...జర్నలిస్ట్ కు న్యాయం జరిగేది ఎప్పుడు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో   ఆర్థికంగా  కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నాలు చేయాలనే ఆలోచన పాలకుల్లో లేకపోవడం బాధాకరం.కలం వెనుక దాగివున్న జర్నలిస్ట్ కుటుంభ కన్నీటిని తుడిచే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని  

ఈ వానిని పాలకులు ప్రభుత్వానికి తెలియ పరచాలని కరోనాతో   మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబాలను ఆదుకోవాలని..బ్రతకాడానికి అష్ట కష్టాలు పడుతున్న జర్నలిస్ట్ లను ఆదుకోవాలని ఆశిద్దాం....

కళావెంకటరావు.యన్. జర్నలిస్ట్.శ్రీకాకుళం. (ఇది కాపీ మెసేజ్ కాదు ..సంపూర్ణంగా నేను వ్రాసిన నా మనోభావం మాత్రమే ) Source:- Whatsapp Forward

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow