ఆ కుట్రలోంచి బయటకి రావాల .. మంత్రి కొడాలి నాని

ఆ కుట్రలోంచి బయటకి రావాల .. మంత్రి కొడాలి నాని
kodali nani three capitals

అమరావతి కుంభకోణంపై సీఐడీ విచారణ జరిగితే చంద్రబాబు అక్రమాలు బయటపడతాయని, అందుకే ఆయన అమరావతి రైతులని‌ మభ్యపెట్టి ఉద్యమాల పేరుతో హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి మేనేజ్‌ చేయడం పుట్టుకతో వచ్చిన విద్య అని పేర్కొన్న మంత్రి..చంద్రబాబు‌ బినామీలు, బినామీ ఆస్తులు అమరావతిలోనే ఉన్నాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో 9 రాజధానులు కట్టడానికి గతంలో చంద్రబాబు ప్లాన్ చేసి..ఇక్కడ పేదలు నివాసం ఉండకూడదని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతంలో లేని ఇబ్బందులు ఈ అమరావతిలోనే ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు.

పేదలకి ఇళ్లస్ధలాలు ఇవ్వకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలోంచి అమరావతి రైతులు బయటకి రావాలని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 70 రోజులకి పైగా ఇళ్ల స్ధలాల కోసం దళితులు దీక్షలు చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మందడం దీక్ష శిబిరంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..'మీరు అమరావతి ఉద్యమం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చినట్లు  ఇక్కడెవరూ పెయిడ్ ఆర్టిస్ట్‌లు లేరు. మీరు...మీ తోకపార్టీలు పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారు' అని  దుయ్యబట్టారు.

 'అమరావతిలో రాజధాని తీసేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎక్కడా చెప్పలేదు. ఈ ప్రాంతంలో సెక్రటేరియట్...హైకోర్టు మాత్రమే ఉండవు. మిగిలిన అన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు యధావిధిగా ఉంటాయి. కార్యనిర్వహక రాజధాని ఉత్తరాంధ్రలో ఉంటే తప్పేంటి? సిట్ అమరావతి కుంభకోణంపై కేసు నమోదు చేస్తే రాత్రికి రాత్రి చంద్రబాబు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇలాంటి ఆర్డర్ చంద్రబాబు తప్పితే ప్రధాని‌ కూడా తీసుకురాలేరు.  2 వేల కోట్లతో ఈ ప్రాంతంలో  జాతీయ రహదారులని అభివృద్ది చేయనున్నారు. మూడు రాజధానులు పెట్టి తీరతాం...విశాఖలో కార్యనిర్వాక రాజధాని...అమరావతిలో శాసన సభ...కర్నూలులో హైకోర్టు పెట్టి తీరతాం. సిఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 30 లక్షల మంది  పేదలకి ఇళ్ల  స్ధలాలు ఇవ్వబోతున్నారు' అని కొడాలి నాని తెలిపారు.