పరమ శివుని వెయ్యి నామాలు మరియు వాని అర్ధాలు

Donate : https://mydigitalnews.in/donate కొత్తగా పిల్లలకు , పేర్లకు ఓ చక్కటి మూలము . పరమాత్ముని అనుగ్రహం సిద్ధించు గాకా

Aug 4, 2021 - 11:25
Aug 4, 2021 - 11:28
 0
పరమ శివుని వెయ్యి నామాలు మరియు వాని అర్ధాలు

శ్లోకం 1

Donate:

https://mydigitalnews.in/donate 

స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,

స్థాణుః = చలనం లేనివాడు అనగా తాను చలించుటకు మరియెక స్థానంలేక అంతటా తానై విస్తరించినవాడు.

ప్రభుః = సమస్తమునకు అధిపతి,

భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,

ప్రవరః = సర్వశ్రేష్టుడు,

వరదః = వరములనిచ్చువాడు,

సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,

సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,

సర్వః = సమస్తము తానేఅయినవాడు,

సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,

భవః = శివుని రూపంలో పుట్టినవాడు,

జటీ = జడలు ధరించినవాడు,

చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,

శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,

సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,

సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.

శ్లోకం 2

హరః = సమస్త పాపములను హరించువాడు,

హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,

సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,

ప్రభుః = అధిపతి,

ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,

నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,

నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,

శాశ్వతః = నిత్యమైనవాడు

ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.

శ్లోకం 3

శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,

భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,

ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,

అగోచరః = కంటికి కనిపించనివాడు,

అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,

అభివాద్యః = నమస్కరింప తగినవాడు,

మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,

తపస్వీ = తపస్సుచేయువాడు,

భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.

శ్లోకం 4

ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః = పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,

సర్వలోక ప్రజాపతిః = సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,

మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,

మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,

వృష రూపః = పుణ్య స్వరూపుడు,

మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.

శ్లోకం 5

మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,

సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,

విశ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,

మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,

లోకపాలః = లోకములను పరిపాలించువాడు,

అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,

ప్రసాదః = అనుగ్రహించువాడు,

నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.

శ్లోకం 6

పవిత్రం = పరిశుద్ధమైన,

మహాన్ = గొప్పవాడు,

నియమః = నియమం తన స్వరూపమైనవాడు,

నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,

సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,

స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,

ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,

నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.

శ్లోకం 7

సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,

విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,

సోమః = చంద్రుని వంటివాడు,

నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,

చంద్రః = చంద్రుని వంటివాడు,

సూర్యః = సుర్యుని వంటివాడు,

శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,

కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,

గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,

వరః = శ్రేష్టుడు.

శ్లోకం 8

ఆది = మొదలు,

అంతః = చివర,

లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,

మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,

అనఘః = పాపరహితుడు,

మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,

ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,

అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,

దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.

శ్లోకం 9

సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,

మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,

ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,

పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,

యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,

యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,

మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,

మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,

మహాబలః = గొప్పశక్తి కలవాడు.

శ్లోకం 10

సువర్ణరేతాః = బంగారపు తేజస్సు కలవాడు,

సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,

సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,

బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,

దశబాహుః = పది భుజాలు కలవాడు,

అనిమిషః = రెప్పపాటు లేనివాడు,

నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,

ఉమాపతిః = పార్వతి భర్త

శ్లోకము 11

విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు

స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు

బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు

బలః = బలము కలవాడు

గణః = సమూహ స్వరూపమైనవాడు

గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు

గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు

దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు

కామః = కామము యొక్క స్వరూపము తానే అయినవాడు.

శ్లోకము 12

మంత్రవిత్ = మంత్రముల యొక్క మూలమును తెలిసినవాడు

పరమః = అందరికంటె ఉన్నతుడు

మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు

సర్వభావకరః = సమస్తమైన మనస్సులను సృష్టించినవాడు

హరః = పాపములను హరించువాడు

కమండలుధరః = కమండలమును ధరించినవాడు

ధన్వీ = ధనుస్సు ధరించినవాడు

బాణహస్తః = చేతియందు బాణము ధరించినవాడు

కపాలవాన్ = కపాలమును చేత ధరించినవాడు

శ్లోకము 13

ఆశనిః = వజ్రాయుధము

శతఘ్నీ = శతఘ్ని అను ఆయుధమును ధరించినవాడు

ఖడ్గీ = ఖడ్గమును ధరించినవాడు

పట్టసీ = పట్టము అను పేరుగల ఆయుధమును చేతియందు ధరించినవాడు

ఆయుధీ = ఆయుధము కలవాడు

మహాన్ = గొప్పవాడు

స్రువహస్తః = హోమము చేసే పరికరమును చేత ధరించినవాడు

సురూపః = మంచి రూపము కలవాడు

తేజః = తేజము యొక్క స్వరూపము తానే అయినవాడు

తేజస్కరః = తేజస్సును కలుగజేయువాడు

నిధిః = ఐశ్వర్యమునకు మూల స్థానమైనవాడు

శ్లోకము 14

ఉష్ణీషీ = శిరస్త్రాణము కలవాడు

సువక్త్రః = మంచి ముఖము కలవాడు

ఉదగ్రః = అన్నిటికంటె ముందుండువాడు

వినతః = వినయము కలవాడు

దీర్ఘః = పొడవైనవాడు

హరికేశః = ఆకర్షణీయమైన కేశములు కలవాడు

సుతీర్థః = ఉత్తమమైన నదీ ఉదక స్వరూపమైనవాడు

కృష్ణః = నల్లని ఆకర్షణీయమైన స్వరూపము కలవాడు

శ్లోకము 15

సృగాలరూపః = నక్కయొక్క ఆకారము కలవాడు

సిద్ధార్థః = అన్ని ప్రయోజనాలను సాధించినవాడు

మృడః = భక్తులను ఆనందింపజేయువాడు

సర్వశుభంకరః = సమస్తమైన శుభములను కలుగజేయువాడు

అజః = పుట్టుక లేనివాడు

బహురూపః = అనేక విధాలైన రూపములు కలవాడు

గంగాధారీ = గంగను ధరించినవాడు

కపర్దీ = జటాజూటములు కలవాడు

శ్లోకము 16

ఊర్ధ్వరేతాః = ఊర్ధ్వముఖముగా ప్రవహించు రేతస్సు కలవాడు

ఊర్ధ్వలింగః = ఊర్ధ్వమైన లింగాకారము ధరించినవాడు

ఉర్ధ్వశాయీ = ఊర్ధ్వముగా నిద్రించువాడు

నభస్థలః = ఆకాస ప్రదేశమున ఉండువాడు

త్రిజటః = మూడు జడలు ప్రధానముగా కలవాడు

చీరవాసాః = నారచీరలు ధరించువాడు

రుద్రః = శత్రువులను దుఃఖపెట్టువాడు

సేనాపతిః = సైన్యమునకు అధిపతి

విభుః = అధిపతి

శ్లోకము 17

నక్తంచరః = రాత్రులందు సంచరించువాడు

అహశ్చరః = పగటియందు సంచరించువాడు

తిగ్మమన్యుః = తీక్షణమైన కోపము కలవాడు

సువర్చసః = మంచి కాంతి కలవాడు

గజహా = గజాసురుని చంపినవాడు

దైత్యహా = రాక్షసులను చంపినవాడు

కాలః = కాలము యొక్క స్వరూపమైనవాడు

లోకథాతా = లోకములను సృష్టించినవాడు

గుణాకరః = ఉత్తమ గుణములకు గనివంటివాడు

శ్లోకము 18

సింహశార్దూలరూపః = సింహము, పెద్దపులి రూపములలో ఉన్నవాడు

వ్యాఘ్రచర్మ అంబర ఆవృతః = పెద్దపులి చర్మమును వస్త్రముగా చుట్టుకొనియున్నవాడు

కాలయోగీ = కాలమును నియంత్రించినవాడు

మహానాథః = గొప్పవాడైన అధిపతి

సర్వకామః = సమస్తమైన కోరికల స్వరూపము తానే అయినవాడు

చతుష్పథః = అనేక మార్గముల కూడలి అయినవాడు

శ్లోకము 19

నిశాచరః = రాత్రులందు సంచరించువాడు

ప్రేతచారీ = ప్రేతభూతములయందు సంచరించువాడు

భూతచారీ = సర్వప్రాణులందు సంచరించువాడు

మహేశ్వరః = గొప్పవాడైన అధిపతి

బహుభూతః = అనేక రూపములలో ఉన్నవాడు

బహుధరః = అనేకమైన వాటిని ధరించువాడు

స్వర్భానుః = రాహురూపమున ఉన్నవాడు, స్వర్గమునకు వెలుగునిచ్చువాడు

అమితః = పరిమితి లేనివాడు

అగతిః = ఒకే విధమైన నడక లేనివాడు

శ్లోకము 20

నృత్యప్రియః = నాట్యములందు ప్రీతి కలవాడు

నిత్యనర్తః = ఎల్లప్పుడు నాట్యము చేయువాడు

నర్తకః = స్వయముగా నాట్యము చేయువాడు

సర్వలాలసః = అన్నిటియందు ఆసక్తి కలవాడు

మహాఘోరతపాః = గొప్పదైన కఠినమైన తపస్సు చేయువాడు

శూరః = పౌరుషము కలవాడు

నిత్యః = శాశ్వతమైనవాడు

అనీహః = కోరికలు లేనివాడు

నిరాలయః = స్థిరమైన గృహము లేనివాడు

శ్లోకము 21

సహస్రహస్తః = అనేకమైన (వేయి) హస్తములు కలవాడు

విజయః = విజయమును సాధించువాడు

వ్యవసాయః = ఎల్లప్పుడు ప్రయత్నము చేయువాడు

అతంద్రితః = తొట్రుపాటు లేనివాడు

అమర్షణః = దుష్టత్వమును కోపగించుకొనువాడు

మర్షణాత్మా = సహనముతో కూడిన ఆత్మకలవాడు

యజ్ఞహా = దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు

కామనాశకః = మన్మథుని నశింపచేసినవాడు

శ్లోకము 22

దక్షయాగాపహారీ = దక్ష యజ్ఞమును నాశనము చేసినవాడు

సుసహః = మిక్కిలి సహనము కలవాడు

మధ్యమః = మధ్యేమార్గమున ఉండువాడు

తేజః అపహారీ = ఇతరుల తేజస్సును హరించువాడు

బలహా = ఇతరుల బలమును హరించువాడు

ముదితహా = ఎల్లప్పుడు సంతోషంతో ఉండువాడు

అర్ధః = ప్రయోజనము యొక్క రూపము ధరించువాడు

అజితః = జయింపబడనివాడు

వరః = అందరికంటే ఉత్తముడు

శ్లోకము 23

గంభీరఘోషః = గంభీరమైన కంఠధ్వని కలవాడు

గంభీరః = లోతైన స్వభావము కలవాడు

గంభీర బలవాహనః = పైకి కనిపించని బలమైన వాహనము కలవాడు

న్యగ్రోధరూపః = వటవృక్షము యొక్క రూపమైనవాడు

న్యగ్రోధః = తానే వటవృక్షమువలె వ్యాపించియుండువాడు

వృక్షకర్ణస్థితిః = చెట్టు యొక్క ఆకులపై నివసించువాడు

విభుః = సమస్తమునకు అధిపతి

శ్లోకము 24

సుతీక్షణ దశనః = మిక్కిలి పదునైన దంతములు కలవాడు

మహాకాయః = గొప్ప శరీరము కలవాడు

మహాననః = గొప్పదైన ముఖము కలవాడు

విశ్వక్సేనః = విష్ణుసేనాధిపతియైన విశ్వక్సేనుని రూపము తానే అయినవాడు

హరిః = విష్ణువే తానైనవాడు

యజ్ఞః = తానే యజ్ఞపురుషుడైనవాడు

సంయోగపీడ వాహనః = యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు

శ్లోకము 25

తీక్షణతాపః = తీక్షణమైన వేడిమి కలుగజేయువాడు

హర్యశ్వః = పచ్చని కాంతిగల గుర్రములు కలిగియున్న సూర్యునివంటివాడు

సహాయః = ఎల్లప్పుడు మనతో ఉండువాడు

కర్మకాలవిత్ = కర్మముల గురించియు, కాలముల గురించియు తెలిసినవాడు

విష్ణుప్రసాదితః = విష్ణువు యొక్క అనుగ్రహము పొందినవాడు

యజ్ఞః = యజ్ఞము యొక్క రూపము తానేఅయినవాడు

సముద్రః = సముద్రము యొక్క రూపము తానేఅయినవాడు

బడబాముఖః = సముద్ర గర్భమున ఉండు బడబాగ్ని రూపము తానే అయినవాడు

శ్లోకము 26

హుతాశన సహాయః = అగ్ని సహాయముగా కలవాడు

ప్రశాంతాత్మా = శాంతమైన ఆత్మ కలవాడు

హుతాశనః = తానే అగ్ని రూపమైయున్నవాడు

ఉగ్రతేజాః = తీవ్రమైన తేజస్సు కలవాడు

మహాతేజాః = గొప్పదైన తేజస్సు కలవాడు

జన్యః = సమస్త జంతువుల రూపము తానే అయినవాడు

విజయకాలవిత్ = విజయము పొందు కాలము తెలిసినవాడు

శ్లోకము 27

జ్యోతిషాం అయనం = నక్షత్రములకు మూలస్థానమైనవాడు

సిద్ధిః = కార్యసిద్ధి రూపము తానే అయినవాడు

సర్వవిగ్రహః = సమస్తమైన విగ్రహరూపములు తానే అయినవాడు

శిఖీ = శిఖలు కలవాడు

ముండీ = కేశరహితమైన శిరస్సు కలవాడు

జటీ = జడలు కలిగినవాడు

జ్వాలీ = అగ్నిజ్వాలా రూపమైనవాడు

మూర్తిజః = విశిష్టమైన ఆకారంతో పుట్టినవాడు

మూర్దగః = శిరస్సును పొందినవాడు

బలీ = బలము కలవాడు

శ్లోకము 28

వైష్ణవః = విష్ణుశక్తి కలిగినవాడు

ప్రజవీ = మిక్కిలి వేగము కలవాడు

తాళీ = సంగీత శాస్త్రము నందలి లయజ్ఞానము కలవాడు

ఖేళీ = మిక్కిలిగా నటించువాడు

కాలకటంకటః = యముని నియంత్రించువాడు

నక్షత్రవిగ్రహమతిః = నక్షత్రములు, గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు

గుణబుద్ధిః = మంచి గుణములను గురించి తెలిసినవాడు

లయః = తానే ప్రళయరూపమై ఉన్నవాడు

అగమః = తేలికగా పొందుటకు వీలులేనివాడు

శ్లోకము 29

ప్రజాపతిః = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు

విశ్వబాహుః = ప్రపంచమునే తన భుజములుగా కలవాడు

విభాగః = ప్రపంచం యొక్క భాగము తానే అయినవాడు

సర్వతోముఖః = అన్ని విషయములు బాగుగా తెలిసినవాడు

విమోచనః = విముక్తి కలుగజేయువాడు

సుసరణః = తేలికగా ప్రసరించువాడు

హిరణ్య కవచోద్భవః = బంగారు కవచముతో పుట్టినవాడు

శ్లోకము 30

మేఘజః = మేఘమునుండి పుట్టినవాడు

బలచారీ = బలముతో సంచరించువాడు

మహీచారీ = భూమియందు సంచరించువాడు

స్తుతః = స్తుతి చేయబడినవాడు

సర్వతూర్య వినోదీ = సమస్తమైన తూర్య వాద్యములచేత వినోదించువాడు

సర్వవాద్య పరిగ్రహః = సమస్త వాద్యములను ఉపయోగించువాడు.

శ్లోకము 31

వ్యాళరూపః = సర్ప రూపమున ఉండువాడు

గుహావాసీ = గుహలో నివసించువాడు

గ్రహమాలీ = గ్రహములన్నింటిని నడిపించువాడు

తరంగవిత్ = జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు

త్రిదశః = ఎల్లప్పుడు మూడు పదులు సంవత్సరముల వయస్సు కలవాడు

కాలదృక్ = సకాలమును బాగుగా గుర్తించువాడు

కర్మ సర్వబంధ విమోచనః = కర్మముల యొక్క సమస్త బంధముల నుండి విముక్తి కలిగించువాడు

శ్లోకము 32

అసురేంద్రాణాం బంధనం = రాక్షస శ్రేష్ఠుల యొక్క బంధనరూపం అయివున్నవాడు

యుధి శత్రు వినాశనః = యుద్ధమునందు శత్రువులను నశింపజేయువాడు

సాంఖ్యప్రసాదః = ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు

దూర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయిననూ ధరించువాడు

సర్వసాధు నిషేవితః = సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు

శ్లోకము 33.

ప్రస్కందః = శత్రువులను నశింపజేయువాడు

విభాగజ్ఞః = యజ్ఞ భాగములు తెలిసినవాడు

అతుల్యః = తనతో సమానుడు లేనివాడు

యజ్ఞభాగవిత్ = యజ్ఞమునందలి భాగములు (ఆహ్వానములు) తెలిసినవాడు

సర్వవాసః = సమస్తమును ధరించువాడు

సర్వచారీ = సమస్త ప్రదేశములందు చరించువాడు

దుర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు

వాసవః = ఇంద్రుని రూపము తానై ఉన్నవాడు

అమరః = మరణము లేనివాడు

శ్లోకము 34

హైమః = బంగారు మయమైనవాడు

హేమకరః = బంగారమును చేయువాడు

యజ్ఞః = యజ్ఞపురుష రూపము తానేఅయినవాడు

సర్వధారీ = సమస్తమును ధరించువాడు

ధరోత్తమః = ప్రపంచమును ధరించువారిలో ఉత్తముడు

లోహితాక్షః = ఎర్రని వర్ణముకల కన్నులు కలవాడు

మహాక్షః = గొప్పదైన దృష్టి కలవాడు

విజయాక్షః = విజయముపై దృష్టి కలవాడు

విశారదః = బాగుగా తెలిసినవాడు

శ్లోకము 35

సంగ్రహః = మిక్కిలి గ్రహించువాడు

నిగ్రహః = ఆత్మనియంత్రణ కలిగినవాడు

కర్తా = సర్వకార్యములు చేయువాడు

సర్పచీర నివాసనః = పాము కుబుసము వస్త్రముగా ధరించువాడు

ముఖ్యః = ప్రధానమైనవాడు

అముఖ్యః = అప్రధానమైనవాడు; తనకంటె ఇతరమైన ప్రధానుడు లేనివాడు

కాహళిః = మ్రోగుచున్న వాద్యము తానే అయినవాడు

సర్వకామదః = సమస్తమైన కోరికలు ఇచ్చువాడు

శ్లోకము 36

సర్వకాల ప్రసాదః = సమస్త కాలములందు అనుగ్రహించువాడు

సుబలః = మంచి బలము కలవాడు

బలరూపభృత్ = బలమైన రూపము ధరించువాడు

సర్వకామప్రదః = సమస్తమైన కోరికలు విశేషముగ ఇచ్చువాడు

సర్వదః = సమస్తమును ఇచ్చువాడు

సర్వతోముఖః = అన్ని ప్రక్కల ముఖము కలవాడు

శ్లోకము 37

ఆకాశ నిర్విరూపః = ఆకాశమువలె రూపము లేనివాడు

నిపాతః = శీఘ్రముగా గమ్యస్థానము చేరువాడు

అవశః = ఒకరి అధీనమున లేనివాడు

ఖగః = పక్షివలె శీఘ్ర గమనము కలవాడు

రౌద్రరూపః = తీవ్రకోపముతో కూడిన రూపము కలవాడు

అంశుః = కిరణ రూపమైనవాడు

ఆదిత్యః = సూర్యుడు తానైయున్నవాడు

బహురశ్మిః = ఎక్కువ కాంతి (కిరణములు) కలవాడు

సువర్చసీ = మంచి కాంతి కలవాడు

శ్లోకము 38

వసువేగః = కిరణముల యొక్క వేగము కలవాడు

మహావేగః = గొప్ప వేగము కలవాడు

మనోవేగః = మనస్సు వంటి వేగము కలవాడు

నిశాచరః = రాత్రియందు సంచరించువాడు

సర్వవాసీ = సమస్త ప్రదేశములందు నివసించువాడు

శ్రియావాసీ = శ్రీ శోభతో నివసించువాడు

ఉపదేశకరః = ఉపదేశము చేయువాడు

అకరః = ఏమియు చేయనివాడు

శ్లోకము 39

మునిః = మౌనముగా ఉండువాడు

ఆత్మా = తానే అందరి ఆత్మ అయినవాడు

నిరాలోకః = దర్శనం లేనివాడు

సంభగ్నః = పలువిధములుగ విభజింప బడినవాడు

సహస్రదః = అనేకమైన వాటిని ఇచ్చువాడు

ప్లక్షీ = భూమి యందలి ప్లక్ష ద్వీపమున నివసించువాడు

ప్లక్షరూపః = జువ్వి చెట్టు యొక్క రూపము తానే అయినవాడు

అతిదీప్తః = మిక్కిలి ప్రకాశించువాడు

విశాంపతిః = మానవజాతి కంతటికీ అధిపతి

శ్లోకము 40

ఉన్మాదః = పిచ్చివాని వలె ఉన్నవాడు

మదనః = మన్మధరూపం తానైనవాడు

కామః = కోరికరూపము తానేఅయినవాడు

అశ్వత్థః = తానే రావిచెట్టు రూపమున ఉన్నవాడు

అర్థకరః = ప్రయోజనము సమకూర్చువాడు, సమస్త వస్తువులను సమకూర్చువాడు

యశః = కీర్తి రూపము తానే అయినవాడు

వామదేవః = ఎడమ భాగమునందు స్త్రీరూపము కలవడు

వామః = శ్రేష్టుడు

ప్రాక, దక్షిణ, ఉదజ్ఞ్ముఖః = తూర్పు, దక్షిణ, ఉత్తర ముఖములు కలవాడు

శ్లోకము 41

సిద్ధయోగీ = సిద్ధించిన యోగము కలవాడు 

మహర్షిః = ఋషులలో గొప్పవాడు 

సిద్ధార్థః = సిద్ధించిన ప్రయోజనము కలవాడు 

సిద్ధసాధకః = సిద్ధమగునట్లు సాధించువాడు 

భిక్షుః = భిక్షాటనము చేయువాడు 

భిక్షురూపః = భిక్షుకుల రూపమున ఉన్నవాడు 

విపణః = వస్తువుల క్రయవిక్రయములు చేయువాడు 

మృదుః = మెత్తనైనవాడు 

అవ్యయః = నాశము లేనివాడు 

శ్లోకము 42

మహాసేనః = గొప్ప సేన కలవాడు 

విశాఖః = కుమారస్వామి (సేనాపతి) తానే అయినవాడు 

షష్టిభాగః = కాలమును అరవై భాగములుగ విభజించినవాడు 

గవాంపతిః = గోవుల యొక్క పతి (వృషభము) తానే అయినవాడు 

వజ్రహస్తః = వజ్రాయుధము చేతియందు కలవాడు 

విస్రంభః = స్వేచ్ఛగా సంచరించువాడు 

చమూస్తంభః = సేనా సమూహమును నిరోధించువాడు 

శ్లోకము 43

వృత్తావృత్తకరః = వృత్తం (యుద్ధభూమిలో రథంతో మండలాకారం ఏర్పడటం), ఆవృత్తం (శత్రుసైన్యాన్ని నశింపజేసి ఎట్టి గాయం లేకుండా తిరిగిరావటం) రెంటిని నైపుణ్యంగా చేయువాడు 

తాలః = తాళ స్వరూపము తానే అయినవాడు 

మధుః = వసంత ఋతువు రూపము తానే అయినవాడు 

మధుకలోచనః = తుమ్మెదల వంటి నల్లని కనుపాపలు కలవాడు 

వాచస్పత్యః = వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు 

వాజసనః = శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడు (వాజసనుడు) తానే అయినవాడు 

నిత్యం ఆశ్రిత పూజితః = ఎల్లప్పుడు తనను ఆశ్రయించిన వారిచేత పూజింపబడినవాడు 

శ్లోకము 44

బ్రహ్మచారీ = వేద మార్గమునందు సంచరించువాడు 

లోకచారీ = లోకమునందు సంచరించువాడు 

సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు 

విచారవిత్ = ఆలోచనా పరిజ్ఞానము కలవాదు 

ఈశానః = ఈశానుడు (శివుడు) 

ఈశ్వరః = ఐశ్వర్యము కలవాడు 

కాలః = మృత్యురూపము తానే అయినవాడు 

నిశాచారీ = రాత్రులందు సంచరించువాడు 

పినాకభృత్ = పినాకమను పేరుగల ధనుస్సును ధరించినవాడు 

శ్లోకము 45

నిమిత్తస్థః = ప్రకృతి సన్నివేశములందు ఉండువాడు 

నిమిత్తం = ప్రకృతి సన్నివేశములు తానే అయినవాడు 

నందిః = నందిరూపము తానే అయినవాడు 

నాందీకరః = ఆనందము కలుగజేయువాడు 

హరిః = విష్ణు రూపమైనవాడు 

నందీశ్వరః = వృషభరూపము తానే అయినవాడు 

నందీ = ఆనందరూపము తానే అయినవాడు 

నందనః = ఆనందము కలుగజేయువాడు 

నందివర్ధనః = ఆనంద స్థితిని వృద్ధి చేయువాడు 

శ్లోకము 46

భగహారీ = ఐశ్వర్యమును హరించువాడు 

నిహంతా = చంపువాడు 

కాలః = కాలరూపము తానే అయినవాడు 

బ్రహ్మా = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు 

పితామహః = తానే బ్రహ్మ అయినవాడు 

చతుర్ముఖః = నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ తానే అయినవాడు 

మహాలింగః = గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు 

చారులింగః = సుందరమైన లింగాకారమున ఉన్నవాడు 

శ్లోకము 47

లింగాధ్యక్షః = లింగాకారములన్నిటికి అధిపతి 

సురాధ్యక్షః = దేవతలకు అధిపతి 

యోగాధ్యక్షః = సమస్త యోగశాస్త్రమునకు అధిపతి 

యుగావహః = సమస్త కాలమును ఆవహించియుండువాడు 

బీజాధ్యక్షః = సృష్టియొక్క మూలమునకు అధిపతి 

బీజకర్తా = సృష్టియొక్క మూలమును కలుగజేయువాడు 

అధ్యాత్మానుగతః = ఆత్మజ్ఞానమును అనుసరించినవాడు 

బలః = బలరూపము తానే అయినవాడు 

శ్లోకము 48

ఇతిహాసః = పూర్వచరిత్ర కలవాడు 

సకల్పః = సృష్టితో మొదటి నుండియు కలసియున్నవాడు 

గౌతమః = గౌతమ ఋషి తానే అయినవాడు 

నిశాకరః = చంద్రుడు తానే అయినవాడు 

దంభః = మిక్కిలి అట్టహాసము కలిగినవాడు 

అదంభః = అట్టహాసము లేనివాడు 

వైదంభః = దంభము లేనివాడు

వశ్యః = భక్తులకు అధీనుడైనవాడు

వశకరః = ఆకర్షణ గుణము కలవాడు

కలిః = కలి పురుషుడు తానే అయినవాడు

శ్లోకము 49

లోకకర్తా = లోకమును నడిపించువాడు

పశుపతిః = నరరూపములో ఉన్న జంతువులకు అధిపతి

మహాకర్తా = గొప్పవాడై లోకములను నడిపించువాడ

అనౌషధః = ఔషధములు అక్కరలేనివాడ

అక్షరం = నాశములేని

పరమం = శ్రేష్టమైన

బ్రహ్మ = జగత్తునకు మూలమైన బ్రహ్మ పదార్ధము తానే అయినవాడ

బలవాన్ = బలము కలవాడు

శక్తః = సమర్థుడైనవాడు

శ్లోకము 50

నీతిః = నియమ (ధర్మ) శాస్త్రము తానే అయినవాడు

అనీతిః = నియమము లేనివాడు

శుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు

శుద్ధః = పరిశుద్ధమైన; శుచియైనవాడు

మాన్యః = గౌరవింప తగినవాడు

గతాగతః = జరిగినది, జరుగబోవునది తానే అయినవాడు

బహుప్రసాదః = మిక్కిలి అనుగ్రహము కలవాడు

సుస్వప్నః = మంచి కలగా కనిపించువాడు

దర్పణః = ప్రకృతియొక్క ప్రతిబింబము చూపించువాడు

అమిత్రజిత్ = శత్రువులను జయించినవాడు

శ్లోకము 51

వేదకారః = వేదములను తెలియపరచినవాడు

మంత్రకారః = మంత్రములను తెలిపినవాడు

విద్వాన్ = అన్ని విషయములు తెలిసినవాడు

సమరమర్దనః = యుద్ధమునందు శత్రువులను నాశనము చేయువాడు

మహామేఘనివాసీ = గొప్పదైన మేఘమండలములో నివసించువాడు

మహాఘోరః = గొప్ప భయంకరమైనవాడు

వశీకరః = అందరను ఆకర్షించువాడు

శ్లోకము 52

అగ్నిజ్వోలః = అగ్ని యొక్క జ్వాలయే తానైనవాడు

మహాజ్వాలః = గొప్పదైన మంట యొక్క ఆకారము తానైనవాడు

అతిధూమ్రః = మిక్కిలి ధూమ్రవర్ణము (నలుపు, ఎరుపు కలసియున్న రంగు) పొగవర్ణములో ఉన్నవాడు

హుతః = అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యము తానైనవాడు

హవిః = హోమము చేయుటకు ఉపయోగింపబడు ద్రవ్యము తానైనవాడు

వృషభః = వాహనమగు ఎద్దు రూపము తానైనవాడు

శంకరః = సుఖమును కలుగజేయువాడు

నిత్యంవర్చస్వీ = ఎల్లప్పుడు వర్చస్సు కలవాడు

ధూమకేతనః = ధూమవర్ణము కల జెండా కలవాడు

శ్లోకము 53

నీలః = నల్లనైనవాడు

అంగలుబ్ధః = మన్మథుని యందు ఆసక్తి కలవాడు

శోభనః = శుభములను కలుగజేయువాడు

నిరవగ్రహః = ప్రతిబంధములు లేనివాడు

స్వస్తిదః = శుభములను ఇచ్చువాడు

స్వస్తిభావః = శుభమైన భావములు కలవాడు

భాగీ = యజ్ఞభాగములను కలిగినవాడు

భాగకరః = విభాగములు చేయువాడు

లఘుః = తేలిక అయినవాడు.

శ్లోకము 54

ఉత్సంగః = అందరకును ఒడియై ఉండువాడు

మహాంగః = గొప్పనైన అవయవములు కలవాడు

మహాగర్భపరాయణః = తన గర్భస్థులను జాగ్రత్తగా చూచుకొనువాడు

కృష్ణవర్ణః = నల్లని వర్ణము కలవాడు

సువర్ణః = బంగారు వర్ణము కలవాడు; బంగారం తానే అయినవాడు

సర్వదేహినాం ఇంద్రియం = సమస్త ప్రాణులకు ప్రధానమైన అవయవము వంటివాడు

శ్లోకము 55

మహాపాదః = విస్తారమైన పాదములు కలవాడు

మహాహస్తః = గొప్పనైన చేతులు కలవాడు

మహాకాయః = గొప్ప శరీరము కలవాడు

మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు

మహమూర్ధాః = గొప్ప శిరస్సు కలవాడు

మహామాత్రః = గొప్ప పరిమాణము కలవాడు

మహానేత్రః = గొప్పవైన నేత్రములు కలవాడు

నిశాలయః = రాత్రి నివాసముగా కలవాడు

శ్లోకము 56

మహాంతకః = గొప్పవాడైన నాశకుడు

మహాకర్ణః = గొప్పవైన చెవులు కలవాడు

మహోష్ణః = గొప్ప వృషభము కలవాడు

మహాహనుః = గొప్ప దవడలు కలవాడు

మహానాసః = గొప్ప ముక్కు కలవాడు

మహాకంబుః = గొప్ప శంఖము వంటివాడు

మహాగ్రీవః = గొప్ప ముఖము కలవాడు

శ్మశానభాక్ = స్మశానములో ఉండువాడు

శ్లోకము 57

మహావక్షాః = గొప్పదైన వక్షస్థలము కలవాడు

మహోరస్కః = గొప్పదైన హృదయము కలవాడు

అంతరాత్మా = ఆత్మ యొక్క లోపలి భాగము అయినవాడు

మృగాలయః = సామాన్య జంతువులకు నిలయమైనవాడు

లంబనః = అందరకును పట్టుకొమ్మ అయినవాడు

లంబితోష్ఠః = నోరు తెరచి ఉన్నవాడు; వ్రేలాడుచున్న పెదవులు కలవాడు

మహామాయః = గొప్ప మాయ కలిగినవాడు

పయోనిధిః = సముద్రుని వంటివాడు

శ్లోకము 58

మహాదంతః = గొప్పవైన దంతములు కలవాడు

మహాదంష్ట్రః = గొప్పవైన కోరలు కలవాడు

మహాజిహ్వః = గొప్పదైన నాలుక కలవాడు

మహాముఖః = గొప్పదైన ముఖము కలవాడు

మహానఖః = గొప్పవైన గోళ్ళు కలవాడు

మహారోమః = గొప్పవైన వెండ్రుకలు కలవాడు

మహాకేశః = గొప్పవైన తలవెండ్రుకలు కలవాడు

మహాజటః = గొప్పవైన జడలు కలవాడు

శ్లోకము 59

ప్రసన్నః = అనుగ్రహించువాడు

ప్రసాదః = అనుగ్రహరూపము కలవాడు

ప్రత్యయః = విశ్వాసము తానే అయినవాడు

గిరిసాధనః = కొండలను సాధించువాడు

స్నేహనః = స్నేహము కలవాడు

అస్నేహనః = శత్రుత్వము తానే అయినవాడు

అజితః = జయింపబడనివాడు

మహామునిః = గొప్ప మౌనము కలవాడు

శ్లోకము 60

వృక్షాకారః = వృక్షము యొక్క ఆకారము కలవాడు

వృక్షకేతుః = వృక్షము తన జెండాగా కలిగినవాడు

అనలః = అగ్ని ఆకారము తానే అయినవాడు

వాయువాహనః = వాయువు వాహనముగ కలవాడు

గండలీ = గుహలో నివసించువాడు

మేరుధామా = బంగారు కొండ నివాసముగా కలవాడు

దేవాధిపతిః = దేవతలకు అధిపతి అయినవాడు

శ్లోకము 61

అధర్వ శీర్షః = అధర్వణ వేదము శిరస్సుగా కలవాడు

సామాస్యః = సామ వేదము ముఖముగా కలవాడు

ఋక్సహస్రామితేక్షణః = ఋగ్వేదమును పరిమితిలేని కన్నులుగా కలవాడు

యజుఃపాదభుజః = యజుర్వేదము పాదములు, భుజములుగా కలవాడు

గుహ్యః = రహస్యమైనవాడు

ప్రకాశః = అందరకును వెలుగు రూపమున బహిరంగమైనవాడు

జంగమః = కదలిక కలిగినవాడు

శ్లోకము 62

అమోఘార్థః = వ్యర్ధము కాని ప్రయోజనము కలవాడు

ప్రసాదః = అనుగ్రహించువాడు

అభిగమ్యః = అందరికి సులభముగా పొందతగినవాడు

సుదర్శనః = అందరకు సులభముగా (దర్శనము) కనిపించువాడు

ఉపకారప్రియః = ఉపకారము చేయుటయందు ప్రీతి కలవాడు

సర్వః = సమస్తమునందు వ్యాపించియుండువాడు

కనకః = బంగారము తానే అయినవాడు

కాంచనచ్ఛవిః = బంగారపు కాంతి కలవాడు

శ్లోకము 63

నాభిః = ప్రపంచమునకు నాభిస్థానము వంటివాడు

నందికరః = ఆనందము కలుగజేయువాడు

భావః = అందరి మనస్సు తానైనవాడు

పుష్కరః = అన్ని నదులను పవిత్రము చేయువాడు

స్థపతిః = దేవాలయ నిర్మాణశాస్త్రము తెలిసినవాడు

స్థిరః = స్థిరమైనవాడు

ద్వాదశః = ద్వాదశ రూపములు కలవాడు

త్రాసనః = భయమును కలుగజేయువాడు

ఆద్యః = ఆదియైనవాడు

యజ్ఞః = యజ్ఞపురుషుడు తానే అయినవాడు

యజ్ఞసమాహితః = యజ్ఞము అనే కర్మతో కూడియుండువాడు

శ్లోకము 64

నక్తం = రాత్రి రూపమైనవాడు

కలిః = కలి పురుషుడు తానే అయినవాడు

కాలః = కాలపురుషుని రూపము తానే అయినవాడు

మకరః = మొసలి రూపము తానే అయినవాడు

కాలపూజితః = కాలము (కాలుని) చేత పూజింపబడినవాడు

సగణః = గణములతో కూడినవాడు

గణకారః = సైన్య సమూహములను సృష్టిచేయువాడు

భూతవాహనసారథిః = ప్రాణుల యొక్క వాహనములను నడిపించువాడు

శ్లోకము 65

భస్మాశయః = భస్మము (బూడిద) ను ఎల్లప్పుడు ధరించువాడు

భస్మగోప్తా = భస్మమును ధరించిన వారిని రక్షించువాడు

భస్మభూతః = భస్మరూపమును ధరించినవాడు

తరుః = జీవులను తరింపజేయువాడు

గుణః = మంచి గుణము కలవాడు

లోకపాలః = లోకములను పరిపాలించువాడు

లోకః = తానే లోకములైనవాడు

మహాత్మా = ఆత్మస్వరూపం తానే అయినవాడు; గొప్పదైన ఆత్మ కలవాడు

సర్వపూజితః = అందరిచే పూజింపబడువాడు

శ్లోకము 66

శుక్లః = శుద్ధ స్వరూపము తానే అయినవాడు

త్రిశుక్లః = త్రికరణములచే శుద్ధుడు

సంపన్నః = సంపూర్ణ సంపదలచే కూడియున్నవాడు

శుచిః = శుచియైనవాడు; అగ్ని రూపములో ఉన్నవాడు

భూత నిషేవితః = ప్రాణుల చేత సేవింపబడినవాడు

ఆశ్రమస్థః = ఆశ్రమమున నివసించువాడు

క్రియావస్థః = కర్మలతోను వాటి పరిస్థితులతోను కూడియున్నవాడు

విశ్వకర్మమతిః = ప్రపంచమందలి కర్మములను గురించి బాగుగా తెలిసినవాడు

వరః = శ్రేష్ఠుడు.

శ్లోకము 67

విశాలశాఖః = అనేకమైన విజ్ఞాన శాస్త్ర శాఖలు తెలిసినవాడు

తామ్రోష్ఠః = తామ్ర+ఓష్ఠ అనగా ఎర్రనైన పెదవులు కలవాడు

అంబుజాలః = సముద్ర రూపమైనవాడు

సునిశ్చలః = మిక్కిలి చలనము లేకుండ ఉండువాడు

కపిలః = నల్లనివాడు

కపిశః = వానరరూపము అనగా నలుపు, పసుపు వర్ణములు కూడియున్నవాడు

శుక్లః = తెల్లనైనవాడు

ఆయుః = మానవుల ఆయువు రూపము తానే అయినవాడు

పరః = ఉత్కృష్టమైనవాడు

అపరః = తనతో సమానమైన ఇతరులు లేనివాడు

శ్లోకము 68

గంధర్వః = దేవతలలో గంధర్వులను ఒక జాతికి చెందినవాడు

అదితిః = అదితి సంతానమైనవాడు

తార్ క్ష్యః = గరుడుని రూపము తానే అయినవాడు

సువిజ్ఞేయః = బాగుగా తెలియదగినవాడు

సుశారదః = మంచి పండితుడు

పరశ్వధాయుధః = పరశువు (గండ్ర గొడ్డలి) ఆయుధంగా కలవాడు

దేవః = దేవుడైనవాడు

అనుకారీ = అనుసరించి పోవువాడు

సుబాంధవః = మంచి బంధువైనవాడు

శ్లోకము 69

తుంబవీణః = పెద్దదైన వీణ కలవాడు

మహాక్రోధః = మిక్కిలి కోపం కలవాడు

ఊర్ధ్వరేతా = ఊర్ధ్వముగా ప్రవహించు రేతస్సు కలవాడు

జలేశయః = జలమునందు శయనించువాడు

ఉగ్రః = తీక్షణమైనవాడు

వంశకరః = వంశమును వృద్ధిచేయువాడు

వంశః = తానే వంశమును ఏర్పాటు చేసినవాడు

వంశనాదః = వెదురులోని నాదం తానే అయినవాడు

అనిందితః = నింద లేనివాడు

శ్లోకము 70

సర్వాంగరూపః = సమస్త అవయవ రూపము కలవాడు

మాయావీ = మాయ చేయువాడు

సుహృదః = మంచి స్నేహితుడు

అనిలః = వాయు రూపమైనవాడు

అనలః = అగ్ని రూపమైనవాడు

బంధనః = బంధించువాడు

బంధకర్తా = బంధమును కలుజేయువాడు

సుబంధ విమోచనః = బాగుగా బంధముల నుండి విముక్తి కలిగించువాడు

శ్లోకము 71

సయజ్ఞారిః = యజ్ఞశత్రువుతో కూడియుండువాడు

సకామారిః = మన్మధుని శత్రువుతో కూడియుండువాడు

మహాదంష్ట్రః = గొప్ప దంతములు కలవాడు

మహాయుధః = గొప్పదైన ఆయుధము కలవాడు

బహుధా నిందితః = అనేక విధముల నిందింపబడినవాడు

సర్వః = సమస్తము తానే అయినవాడు

శంకరః = సుఖమును కలుగజేయువాడు

చంద్రశేఖరః = చంద్రుని శిరస్సునందు కలవాడు

శ్లోకము 72

అమరేశః = దేవతలకు అధిపతి అయినవాడు

మహాదేవః = దేవతలలో గొప్పవాడు

విశ్వదేవః = ప్రపంచమునకు దేవుడు

సురారిహా = దేవతల శత్రువులను చంపినవాడు

అహిర్భుధ్న్యః = నాగాభరణం కలవాడు

అనిలాభః = గాలివంటి వాడు

చేకితానః = సర్వజ్ఞుడు; అత్యంత జ్ఞానయుక్తుడు

హరిః = తానే విష్ణురూపమైనవాడు

శ్లోకము 73

అజైకపాత్ = విష్ణువు ముఖ్యమైన పాదముగా కలవాడు

కాపాలీ = కపాలమును ధరించినవాడు

త్రిశంకుః = త్రిశంకువను రాజు తానే అయినవాడు

అజితః = జయింపబడనివాడు

శివః = భద్రమైనవాడు

ధన్వంతరిః = దేవ వైద్యుడైన ధన్వంతరి యొక్క రూపం తానే అయినవాడు

ధూమకేతుః = గణపతి తానైనవాడు

స్కందః = కుమారస్వామి తానైనవాడు

వైశ్రవణః = కుబేరుడు తానే అయినవాడు

శ్లోకము 74

ధాతా = బ్రహ్మ తానే అయినవాడు

శక్రః = ఇంద్రుడు తానే అయినవాడు

విష్ణుః = విష్ణువు తానే అయినవాడు

మిత్రః = సూర్యుడు తానే అయినవాడు

త్వష్టా = బ్రహ్మ తానే అయినవాడు

ధ్రువః = ధ్రువుడు తానే అయినవాడు

ధరః = ప్రపంచమును ధరించినవాడు

ప్రభావః = గొప్ప పుట్టుక కలవాడు

సర్వగః = అన్నింటియందు ఉండువాడు

వాయుః = వాయు రూపము తానే అయినవాడు

అర్యమా, సవితా = సూర్యుని రూపము తానే అయినవాడు

రవిః = సూర్యుడు తానే అయినవాడు

శ్లోకము 75

ఉషంగుః = ఉషస్సును కలుగజేయు సూర్యుని రూపము తానే అయినవాడు

విధాతా = బ్రహ్మ తానే అయినవాడు

మాంధాతా = సృష్టికి ఆదియందు గల మాంధాత అనే రాజు తానే అయినవాడు

భూతభావనః = ప్రాణుల యొక్క క్షేమమును గూర్చి ఆలోచించువాడు

విభుః = అధిపతి అయినవాడు

వర్ణవిభావీ = వర్ణముల యొక్క విశేషములను గూర్చి భావించువాడు

సర్వకామగుణావహః = సమస్తమైన కోరికల గుణములను ఆవహించి యుండువాడు

శ్లోకము 76

పద్మనాభః = పద్మము నాభియందు గల విష్ణువు తానే అయినవాడు

మహాగర్భ = గొప్పదైన గర్భము కలవాడు

చంద్రవక్తః = చంద్రునివంటి ముఖము కలవాడు

అనిలః = వాయువు తానే అయినవాడు

అనలః = అగ్ని రూపము తానే అయినవాడు

బలవాన్ = మిక్కిలి బలము కలవాడు

ఉపశాంతః = మిక్కిలిగా శాంతించువాడు

పురాణః = ప్రాచీనుడు

పుణ్యచంచురీ = పుణ్యము చేత ప్రసిద్ధమైన వాడు.

శ్లోకము 77

కురుకర్తా = కురుక్షేత్రమును సృష్టించినవాడు,

కురువాసీ = కురు భూముల యందు నివసించువాడు

కురుభూతః = కురు భూములందు పుట్టినవాడు

గుణౌషధః = మంచి గుణములు ఔషధములుగా కలవాడు

సర్వాశయః = సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు

గర్భచారీ = సమస్త గర్భములందు సంచరించువాడు

సర్వేషాం ప్రాణీనాం పతిః = సమస్తమైన ప్రాణులకు అధిపతి అయినవాడు.

శ్లోకము 78

దేవదేవః = దేవతలకు దేవుడైనవాడు

సుఖాసక్తః = సుఖమునందు ఆసక్తి కలవాడు

సదసత్ సర్వరత్నవిత్ = మంచి చెండు అను సమస్తమైన రత్నముల యొక్క జ్ఞానము కలవాడు

కైలాసగిరివాసీ = కైలాస పర్వతమునందు నివసించువాడు

హిమవత్ గిరి సంశ్రయః = హిమవత్ పర్వతమునందు నివసించువాడు.

శ్లోకము 79

కూలహారీ = ప్రవాహరూపములో నదుల దరులను కూల్చువాడు

కులకర్తా = పుష్కరము మొదలైన పెద్ద సరస్సులను నిర్మించువాడు.

బహువిద్యః = అనేకమైన విద్యలు కలవాడు

బహుప్రదః = అనేకములు ఇచ్చువాడు

వణిజః వ్యాపారమునకు మూలపురుషుడు

వర్ధకీ = వృద్ధి పొందినవాడు

వృక్షః = వృక్షము తానే అయినవాడు

వకుళః = పొగడ చెట్టు తానే అయినవాడు

చందనచ్ఛదః = చందనము యొక్క మైపూత కలవాడు.

శ్లోకము 80

సారగ్రీవః = బలముతో కూడిన కంఠము కలవాడు

మహాశత్రుః = గొప్పవారైన శత్రువులు కలవాడు

అలోలః = ఆసక్తి లేనివాడు

మహౌషధః = గొప్ప ఔషధము వంటివాడు

సిద్ధార్థకారీ = అర్థసిద్ధిని కలుగజేయువాడు

సిద్ధార్థః = ప్రయోజనముల సిద్ధిని పొందినవాడు

ఛందో వ్యాకరణోత్తరః = ఛందస్సు, వ్యాకరణములను బాగుగా పఠించినవాడు.

శ్లోకము 81

సింహనాదః = సింహము వంటి కంథధ్వని కలవాడు

సింహదంష్ట్రః = సింహము యొక్క దంతముల వంటి దంతములు కలవాడు

సింహగః = సింహమును అతన అధీనమున నడిపించువాడు

సింహవాహనః = సింహము వాహనముగా కలవాడు

ప్రభావాత్మా = ప్రభావము కలిగిన ఆత్మ కలవాడు

జగత్కాలః = ప్రపంచము యొక్క కాలము తానే అయినవాడు

కాలః = కాల స్వరూపుడు

లోకహితః = లోకమునకు ఇష్టుడైనవాడు

తరుః = వృక్షరూపము తానే అయినవాడు.

శ్లోకము 82

సారంగః = ప్రచండ దీప్తిమంతుడు

నవచక్రాంగః = నూతనమైన రథమువంటివాడు

కేతుమాలీ = విజయధ్వజముల సమూహము కలవాడు

సభావనః = భావనతో కూడియున్నవాడు

భూతాలయః = సమస్త ప్రాణులకు నిలయమైనవాడు

భూతపతిః = సమస్త ప్రాణులకు అధిపతి

అహోరాత్రం అనిందితః = రాత్రింబవళ్ళు అంతయు నింద లేనివాడు.

శ్లోకము 83

వర్ధితః = బాగుగా అభివృద్ధి చెందినవాడు

సర్వభూతానాం = సమస్త ప్రాణులకు

నిలయః = స్థానమైనవాడు

విభుః = అధిపతి

భవః = పుట్టుక స్థానమైనవాడు

అమోఘః = వ్యర్థము లేనివాడు

సంయతః = నియమ బద్ధుడైనవాడు

అశ్వః = గుఱ్ఱము వలె వేగము కలవాడు

భోజనః = బాగుగా భుజించువాడు

ప్రాణధారణః = సమస్త ప్రాణములను ధరించువాడు.

శ్లోకము 84

ధృతిమాన్ = ధైర్యము కలవాడు

మతిమాన్ = బుద్ధిమంతుడు

దక్షః = సమర్ధుడు

సత్కృతః = బాగుగా సత్కరింపబడినవాడు

యుగాధిపః = యుగమునకు అధిపతి

గోపాలీ = గోవులను రక్షించువాడు

గోపతిః = వృషభము వంటివాడు

గ్రామః = జననివాసముల యొక్క సమూహము తానే అయినవాడు

గోచర్మవసనః = గోవు యొక్క చర్మమును ధరించువాడు

హరిః = విష్ణువు యొక్క రూపము తానే అయినవాడు

శ్లోకము 85

హిరణ్యబాహుః = బంగారు భుజములు కలవాడు

గుహాపాలః = గుహలను రక్షించువాడు

ప్రవేశకః = గుహలను ప్రవేశించువాడు

ప్రకృష్టారిః = తీవ్రమైన శత్రువులు కలవాడు

మహాహర్షః = గొప్ప సంతోషము కలవాడు

జితకామః = కామమును జయించినవాడు

జితేంద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడు.

శ్లోకము 86

గాంధారః = గాంధారము (సంగీతము) తానే అయినవాడు

సువాసః = మంచి వస్త్రములు కలవాడు

తపస్సక్తః = తపస్సునందు లగ్నమైనవాడు

రతిః = కామిని యొక్క ఆకారము తానే అయినవాడు

నరః = సామాన్య మానవరూపము తానే అయినవాడు

మహాగీతః = గొప్ప గానము కలవాడు

మహానృత్యః = గొప్ప నాట్యము చేయువాడు

అప్సరసోగణసేవితః = అప్సరసల సమూహము చేత సేవింపబడినవాడు

శ్లోకము 87

మహాకేతుః = గొప్ప ధ్వజ చిహ్నము కలవాడు

మహాధాతుః = గొప్ప శరీర ధాతువు యొక్క బలము కలవాడు

అనేకసానుచరః = అనేకమైన కొండ చరియలందు సంచరించువాడు

చలః = సంచలనము కలవాడు

ఆవేదనీయః = తెలిసికొనదగినవాడు

ఆవేశః = తీవ్రత కలవాడు

సర్వగంధ సుఖావహః = సమస్త సుగంధముల యొక్క సుఖమును కలిగినవాడు.

శ్లోకము 88

తోరణః = ప్రపంచమునకు ముఖద్వారము వంటివాడు

తారణః = తరింపజేయువాడు

వాతః = వాయువు రూపమైనవాడు

పరిధీపతి ఖేచరః = సరిహద్దులను రక్షించు దేవతలకు అధిపతి

సంయోగః = స్త్రీ పురుష సంయోగమే తానైనవాడు

వర్ధనః = వృద్ధిచేయువాడు

వృద్ధః = పెద్దవాడు

అతివృద్ధః = మిక్కిలి పెద్దవాడు

గుణాధికః = మంచి గుణములచేత అధికుడు.

శ్లోకము 89

నిత్యః = ఎల్లకాలములయందు

ఆత్మా = అందరి ఆత్మల రూపము తానే అయినవాడు

సహాయః = సహాయముగా ఉండువాడు

దేవాసురపతిః = దేవతలకు, రాక్షసులకు అధిపతి అయినవాడు

పతిః = సమస్తమునకు అధిపతి అయినవాడు

యుక్తః = తగినవాడు

యుక్తబాహుః = సరియైన బాహువులు కలవాడు

దేవః = దేవుడైనవాడు

దివి సుపర్వణః = స్వర్గమునందలి దేవతలలోని వాడు

శ్లోకము 90

ఆషాఢః = అన్నిటిని సహించు శక్తిని భక్తులకు ప్రసాదించువాడు

సుషాఢః = గొప్ప సహనశీలుడు

ధ్రువః = ధ్రువ నక్షత్రము తానైనవాడు

హరిణః లేడి యొక్క రూపము తానైనవాడు

హరః = సమస్తమును హరించువాడు

ఆవర్తమానేభ్యః = పునర్జన్మ మెత్తువారికి

వపుః = శరీర రూపము తానే అయినవాడు

వసుశ్రేష్ఠః = అష్ట వసువులలో శ్రేష్ఠుడైనవాడు

మహాపథః = గొప్పదైన మార్గము తానే అయినవాడు.

శ్లోకము 91

శిరోహారీ = (దక్షుని) శిరస్సును ఖండించినవాడు

సర్వలక్షణ లక్షితః = సమస్తమైన మంచి లక్షణముల చేత గుర్తింపబడినవాడు

అక్షః = సృష్టి చక్రమునకు ఇరుసు వంటివాడు

రథయోగీ = రథమును కూర్చువాడు

సర్వయోగీ = సమస్తమును సమకూర్చువాడు

మహాబలః = గొప్ప బలము కలవాడు.

శ్లోకము 92

సమామ్నాయః = వేదముతో సమానమైనవాడు

అసమామ్నాయః = వేదములకు అతీతుడు

సీరదేవః = భూమిని పంటలు పండుటకు అనువుగా చేయువాడు

మహారథః = రథకులలో గొప్పవాడు

నిర్జీవః = నిర్జీవమైన వస్తువుల ఆకారము తానైనవాడు

జీవనః = ఉత్తమ జీవనము కలవాడు

మంత్రః = మంత్ర స్వరూపుడు

శుభాక్షః = శుభమైన దృష్టి కలవాడు

బహు కర్కశః = మిక్కిలి కఠినమైనవాడు.

శ్లోకము 93

రత్నప్రభూతః = రత్నములను సృష్టించినవాడు

రక్తాంగః = ఎఱుపు రంగు శరీరము కలవాడు

మహార్ణవ నిపానవిత్ = గొప్పదైన సముద్రపు నీటిని త్రాగుటలో నేర్పరి

మూలం = సృష్టికి మూలమైనవాడు

విశాలః = అతి విస్తారమైనవాడు

అమృతః = అమృత స్వరూపము తానైనవాడు

వ్యక్తావ్యక్తః = కనిపించి, కనిపించనివాడు

తపోనిధిః = తపస్సుకు స్థానమైనవాడు

శ్లోకము 94

ఆరోహణః = ఉన్నతస్థితికి పోవువాడు

అధిరోహః = ఆరోహించిన వాడు

శీలధారీ = సత్ప్రవర్తన కలిగినవాడు

మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు

సేనాకల్పః = సేనను సృష్టి చేయువాడు

మహాకల్పః = గొప్పదైన సృష్టి చేసినవాడు

యోగః = యోగము తానైనవాడు

యోగకరః = యోగమును సృష్టించినవాడు

హరిః = విష్ణువు తానైనవాడు.

శ్లోకము 95

యుగరూపః = యుగముల రూపము తానైనవాడు

మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు

మహానాగహనః = గొప్పవాడైన గజాసురుని చంపినవాడు

అవధః = వధింపబడనివాడు

న్యాయ నిర్వహణః = న్యాయమును నిర్వహించువాడు

పాదః = పూజ్యుడు

పండితః = పండితుడు

అచలోపమః = పర్వతముతో సమానుడు.

శ్లోకము 96

బహుమాలః = అనేకమైన మాలలు ధరించినవాడు

మహామాలః = గొప్పవైన మాలలు కలవాడు

శశీ = చంద్రుడు తానైనవాడు

హరిసులోచనః = మంచి నేత్రములు కలవాడు

విస్తారః = మిక్కిలి వ్యాపించినవాడు

లవణః = ఉప్పు తానైనవాడు

కూపః = నూయి తానైనవాడు

త్రియుగః = గడిచిన మూడు యుగములు తానైనవాడు

సఫలోదయః = సిద్ధించిన ఫలముతో కూడియున్నవాడు.

శ్లోకము 97

త్రినేత్రః = మూడు కన్నులు కలవాడు

విషణ్ణాంగః = సర్వదా నిరాకారుడు

మణివిద్ధః = మణుల చేత ప్రకాశించువాడు

జటాధరః = జడలను ధరించినవాడు

బిందుః = అనుస్వారము రూపము తానైనవాడు

విసర్గః = విసర్గ రూపము తానైనవాడు

సుముఖః = మంచి ముఖము కలవాడు

శరః = బాణరూపము తానైనవాడు

సర్వాయుధః = సమస్తమైన ఆయుధముల రూపము తానైనవాడు

సహః = సహనము కలవాడు.

శ్లోకము 98

నివేదనః = అన్నిటిని ఇచ్చువాడు

సుఖాజాతః = సుఖములను కలుగజేయువాడు

సుగంధారః = మంచి సంగీత జ్ఞానం కలిగినవాడు

మహాధనుః = గొప్పదైన ధనుస్సు కలవాడు

గంధపాలీ = మంచి సువాసనను కలుగజేయువాడు

భగవాన్ = భగవంతుడు

సర్వకర్మణామ్ = సమస్త కర్మలకు

ఉత్థానః = ఫలశ్రుతి కలుగజేయువాడు.

శ్లోకము 99

మంథానః = సమస్త సృష్ఠిని మధించువాడు

బహుళః = సమస్తమందు ఉన్నవాడు

వాయుః = వాయు రూపమై ఉన్నవాడు

సకలః = సమస్తమైన వాడు

సర్వలోచనః సమస్తమైన కన్నులు కలవాడు

తలః = సమర్థత కలిగినవాడు

తాలః సంగీతము నందు తాళరూపము తానైనవాడు

కరస్థాలీ = చేతియందు పాత్ర కలవాడు

ఊర్ధ్వ సంవహనః = పైకి తీసుకొని పోవువాడు

మహాన్ = గొప్పవాడు.

శ్లోకము 100

ఛత్రం = సృష్టి కంతటికి గొడుగు వంటివాడు

సుచ్ఛత్ర విఖ్యాతః = మంచి ఛత్రముతో ప్రసిద్ధి చెందినవాడు

లోకః = లోకము తానే అయినవాడు

సర్వాశ్రయక్రమః = సమస్తమునకు తానే ఆశ్రయింపదగిన వరుసలో ఉన్నవాడు

ముండః = క్షురకర్మచే తలవెంట్రుకలు తీయబడినవాడు

విరూపః = వికారమైన స్వరూపము కలవాడు

వికృతః = వికృతమైన రూపము కలవాడు

దండీ = దండము కలవాడు

కుండీ = పాత్ర కలిగియున్నవాడు

వికుర్వణః = వికృతముగా చేయువాడు.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow