హోంమంత్రి మేకతోటి సుచరిత అసహనం: COVID 19 2021

పేషెంట్ ఆస్పత్రిలో చేరగానే వెంటనే మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి అని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాం.. పోయేటప్పుడు కూడా తీసుకు వెళ్ళం కదా అన్నారు సుచరిత.

Apr 22, 2021 - 10:59
 0

కరోనా నియంత్రణపై హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్, డాక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కరోనా పేరుతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అని తెలిపారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow