మద్యతరగతి మహనుబావా మెలుకొ కష్టపడి దాచిన డబ్బును కపాడుకొ ఆడంబరాలు వద్దు 

ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే, పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ. దాచిన సోమ్ము సద్వినియోగ పడితే, కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.

మద్యతరగతి మహనుబావా మెలుకొ కష్టపడి దాచిన డబ్బును కపాడుకొ ఆడంబరాలు వద్దు 

కరొనా వలన కొట్లాదిమంది ఆకలి కేకలు ఓకవైపు

కాని మరోక వైపు మాత్రం అప్పుల చేసి మరీ దేశంలొ  పెళ్లిలూ జరుగుతున్న తీరును నిన్న ఓక పెళ్లిలో జరుతున్న తంతును దగ్గరగా చూసిన తరువాత నేను మీ సురేష్ రెడ్డి పులగం కూడ ఒక మద్యతరగతి వాడిగా నా నుండి కొట్లాది మద్యతరగతి మనుషులకు మహానుభావులకు విజ్ఞప్తి,

ఏమనగా !

అయ్యలారా అమ్మ లారా మద్యతరగతి మహానుభావులారా !

కరొనా కరాలనుత్యం చేస్తున్న ఈలాంటి కాలంలొ మనిషి చూసి చూసి బయపడుతున్న ఈ రోజుల్లో  కూడ మన దేశ పెళ్లిలో బాజాలు భజంత్రీలు,  పెద్ద పెద్ద డేకరేషన్ లు , సినిమా సెట్టింగ్ లు, పాట కచేరీలు , గుర్రాలు ఏనుగులతో ఊరేగింపులు, విమానాలలో పెళ్లిలు,  వందలరకాలతో బొజనాలు వేల రకాల వంటకాలు ,  వందల రకాల మధు పానాలు, వందలు వేల రకాల సినిమా సెట్టింగులు వందలు వేల కొట్ల రూపాయలను  ఖర్చు చేస్తు చేస్తున్న ఈలాంటి పెళ్లిలు,

ఈ లాంటి విపత్కర పరిస్తులలొ , సాటి మనిషి తీనడానికి తిండి దొరక్క చేయటానిక పని  దొరక్క , ఉండడానికి నీడ దొరక్క, కట్టు కొవడానికి బట్ట దొరక్క, స్వంత ఊరు వెళ్లడానికి  దారి లేక ఉన్న చోటు ఉండడానిక గతిలేక, తిన డానికి తిండి దొరక్క ఏన్నొ బాదలు పడుతుంటే , ఈలాంటి విపత్కర పరిస్తుతులలో , ఈలాంటి వేడుకలు అవసరమా ?

శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు!

నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం కొసం

అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి!

పెళ్ళికి ముందే వీడియో షూట్లు చేయటం,

గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,

ఆర్భాటంగా మండపాలు కట్టడం,

మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం,

డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,

బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,

పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం,

దావత్ పేరుతో తాగితందనాలాడటం,కడుపు కట్టుకుని దాచిందిహారతిచేయటం మధ్యతరగతి మనిషికి అవసరమా ?

ఒకడిని చూసి ఒకడు, ఒకడ్ని మించి ఒకడు వెర్రెక్కి పోతున్నారు నేటి కాలంలో.

ఎంత తింటాడు మనిషి?

దేంట్లో దొరుకుతుంది వినోదం?

ఎలా చేయాలి వేడుక?

ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?

ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?

ఏది కడితే వస్తుంది హుందాతనం?

ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?

ఎలా పెరుగుతుంది ఆకర్షణ?

ఏ విధంగా బలపడుతుంది బంధం?

ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,

పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.

పదిమందితో పట్టెడన్నం తింటే,

మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,

కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,

సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, 

సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,

దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,

కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.

ముహూర్తం చూసి పారేసే కార్డుకి,

పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,

చెమటపడితే కారిపోయే రంగుకీ,

పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,

నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,

సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,

ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,

ఉన్నదంతా ఊడ్చిపెడితే

పదికాలాలు బతకడానికొచ్చే 

కొత్తమనిషికి

తర్వాత పెట్టేది ఏమిటి?

అప్పు చేసి ఖర్చుచేసే,

వెర్రితనం కాదు పెళ్ళంటే!

ఇంటికి దీపాన్ని తెచ్చుకునే

ఇంగితమైన పని వివాహ మంటే!

శక్తికి మించి ఎగరటం,

అప్పుచేసి ఆర్బాటం చేయటం 

ముమ్మాటికీ తప్పు.

నువ్వు అప్పులు పాలు అయుతే ఆదుకొవడానికి ఏవరూ రారు అనేది కఠోర వాస్తవం కూడ నాతొటి

మద్యతరగతి మానవుడా !

మెలుకొ మదుపు నేర్చుకో, అప్పులు మానుకొ, ఆర్భాటాలు వదులుకొ, కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి వేలకు వేలు ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు!

--
పులగం సురేష్ రెడ్డి . వెని గండ్ల [Journalist (Independent)]

Please comment here for Updates and For News/ Article Publication email:- info@mydigitalnews.in or maydigitalnews.in@gmail.com