మిజోరం గవర్నర్ శ్రీ కంభం పాటి హరిబాబు గారి గురించి ఆసక్తి కరమైన విషయాలు

Jul 10, 2021 - 09:30
 0
మిజోరం గవర్నర్  శ్రీ  కంభం పాటి హరిబాబు గారి గురించి ఆసక్తి కరమైన విషయాలు

మృధుస్వభావి.. బీజేపీ మాజీ అధ్యక్షులు కంభం పాటి హరిబాబు గారు మిజోరం గవర్నర్ గా నియమించబడ్డ సందర్భంగా  "మిజోరం గవర్నర్  శ్రీ  కంభం పాటి హరిబాబు గారికి మా MDN  న్యూస్ హృదయ పూర్వక శుభాకాంక్షలు.

కంభంపాటి హరిబాబు భారతీయ జనతాపార్టీ రాజకీయ నాయకుడు. అతడు భారతదేశ 16వ లోక్‌సభ సభ్యుడు. విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. అతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రశాఖ అధ్యక్షునిగా ఉన్నాడు. 2021 జులై 6 తారీఖున మిజోరాం రాష్ట్ర గవర్నరుగా నియమించబడ్డారు .

హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు . అతడు విశాఖపట్నం లోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బి.టెక్ చేసారు . తరువాత అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేసారు . తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసి 1993 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసారు . తరువాత క్రియాశీల రాజకీయాలలోనికి ప్రవేశించారు .

హరిబాబు ఆంధ్ర రాష్ట్రం కోసం జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు . ఆ ఉద్యమంలో  తెన్నేటి విశ్వనాధం, సర్దార్ గౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడు గార్లతోకలసి విద్యార్థినాయకునిగా పాల్గొన్నారు .

 1972-73 మధ్య కాలంలో ఆంధ్రవిద్యాలయం లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల యూనియన్ కు సెక్రటరీగా ఉన్నారు . 1974-75 కాలంలో లోక్నా యక్ జయప్రకాశ్ నారాయణ్ అధ్వర్యలో జరిగిన లోక్‌ సంఘర్ష సమితి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంలో అరెస్టు కాబడ్డాడు. విశాఖపట్నం సెంట్రల్ జైలు, ముషీరాబాదు జైలు లలో 6 నెలలు శిక్ష అనుభవించా\దు.  1977 లో జనతాపార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా తన సేవలనందించారు . 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసారు .

1991-1993 కాలంలో హరిబాబు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేసాడు. తరువాత 1993-2003 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగారు . 1999లో విశాఖపట్నం-1 నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డారు .

2003 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ ప్లోర్ లీడర్ గా కొనసాగాడు. మార్చి 2014 లో బి.జె.పి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు .

హరిబాబు ఎం.పి.లాడ్స్ నిధులనుపయోగించి ఆరోగ్యం, విద్య, త్రాగునీరు ల కొరకు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేసారు . దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాలకు, ఎంపి నిధులను పారదర్శకతతోఖర్చు చేసారు . ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు మరుగుదొడ్లు, ఫర్నిచర్ అందించడం, జి.వి.ఎం.సి అద్వర్యంలో లేని ప్రాంతాలలో త్రాగునీరు అందించడం ముఖ్యమైనవి.

 ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, "ఒన్ ఎం.పి- ఒన్-ఐడియా" కాంటెస్టును నిర్వహించారు .

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow