ఎస్తోనియ, ప‌రాగ్వే, డొమినిక‌న్ రిప‌బ్లిక్ ల‌లో మూడు భార‌తీయ మిశన్ లను తెరవడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Dec 31, 2020 - 08:54
 0
ఎస్తోనియ, ప‌రాగ్వే, డొమినిక‌న్ రిప‌బ్లిక్ ల‌లో మూడు భార‌తీయ మిశన్ లను తెరవడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి
modi approved three indian missions at abroad

ఎస్తోనియ, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్ లలో 2021వ సంవత్సరం లో మూడు భారతీయ మిశన్ లను తెరవడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజున ఆమోదం తెలిపింది. (*ఎస్తోనియ, ప‌రాగ్వే, డొమినిక‌న్ రిప‌బ్లిక్ ల‌లో మూడు భార‌తీయ మిశన్ లను తెరవడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి)

అమలుకు సంబంధించిన వ్యూహం:

ఈ దేశాలలో భారతీయ మిశన్ లను ఏర్పాటు చేస్తే భారతదేశ దౌత్య పరిధి ని పెంచుకోవచ్చు. భారతదేశ దౌత్యపరమైన సంబంధాల పాదముద్ర ను విస్తరించడంలోను, రాజకీయ సంబంధాలను గాఢతరం గా మార్చుకోవడంలోను, ద్వైపాక్షిక వ్యాపారాన్ని, పెట్టుబడి ని, ఆర్థిక బంధాలను వృద్ధి పరచుకోవడంలో ఈ పరిణామం సహాయకారి కావడంతో పాటు ప్రజా సంబంధాలను దృఢతరంగా మార్చుకొనేందుకు మార్గాన్ని సుగమం చేయనుంది. అంతేకాదు, బహుపక్షీయ వేదికలలో రాజకీయ సంపర్కాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతదేశం యొక్క విదేశీ విధానం ఉద్దేశ్యాలకు సమర్ధన ను సమీకరించడంలో కూడా తోడ్పాటు అందగలదు.

ఈ దేశాల లో భారతీయ మిశన్ లు అక్కడి భారతీయ సముదాయాన్ని, వారి ప్రయోజనాలను రక్షించడం లో ఉత్తమమైన పద్ధతి లో సహాయాన్ని అందించగలుగుతాయి.

ఉద్దేశ్యం:


మన విదేశీ విధానం తాలూకు ఉద్దేశ్యం మిత్ర దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా భారతదేశ వృద్ధికి, అభివృద్ధికి ఒక అనుకూల వాతావరణాన్ని నిర్మించడమే. ప్రస్తుత కాలంలో యావత్తు ప్రపంచం లో భారతీయ మిశన్ లు, పోస్టు లు భాగస్వామ్య దేశాల తో మన సంబంధాలకు వాహకాల వలె పని చేస్తున్నాయి.

ఈ మూడు కొత్త ఇండియన్ మిశన్స్ ను తెరవాలన్న నిర్ణయం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లేదా వృద్ధి, అభివృద్ధి పరంగా మన జాతీయ ప్రాథమ్యాన్ని దక్కించుకొనే దిశ లో ముందంజ వేసేటటువంటి నిర్ణయంగా ఉంటుందని చెప్పాలి. భారతదేశ దౌత్య సంబంధమైన ఉనికి ని వృద్ధి చేసుకోవడం ఇతర అంశాలతో పాటు భారతదేశ కంపెనీలకు బజారు అందుబాటు ను సమకూర్చగలదు; అంతే కాకుండా భారతదేశ వస్తువు ల, సేవ ల ఎగుమతులను కూడా ప్రోత్సహించగలుగుతుంది. ఇదిఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించాలనే మన లక్ష్యానికి తగినట్లుగా దేశీయ ఉత్పత్తిపెంచడమే కాక, ఉపాధి ని అధికం చేయడంలో కూడా ప్రత్యక్ష ప్రభావాన్నిప్రసరింపచేస్తుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow