జమ్మూ-కశ్మీర్‌కు మూడు విషయాలపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి-అమిత్ షా

Dec 27, 2020 - 12:13
 0
జమ్మూ-కశ్మీర్‌కు మూడు విషయాలపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి-అమిత్ షా

జమ్మూ కాశ్మీర్‌లో పి.ఎం-జై సెహత్ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించడం జమ్మూ-కశ్మీర్‌కు ముఖ్యమైనచారిత్రాత్మక దినంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అభివర్ణించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఈ రోజు,  వీడియో కాన్ఫరెన్సు ద్వారా పి.ఎం-జై సెహత్ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో హోంమంత్రి శ్రీ అమిత్ షా పాల్గొని,  జమ్మూ-కశ్మీర్‌కు ఈ రోజు చాలా ముఖ్యమైన మరియు పవిత్రమైన రోజనీజమ్మూ-కశ్మీర్ పౌరులందరి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందనీ శ్రీ అమిత్ షా అన్నారు. నిన్న గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్ పాయి గారి జన్మదినందీనిని భారత ప్రభుత్వం సుపరిపాలన వారోత్సవాల ప్రారంభ దినంగా  జరుపుకుంటోంది.  అటల్ జీ కి జమ్మూ-కశ్మీర్‌పై ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. 

సుపరిపాలన వారోత్సవాలలో భాగంగా ఈ రోజు ఆరోగ్య పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు.  దీనికి,  గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా లను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

Image

ఇది ప్రారంభం అయ్యాకరాబోయే రోజుల్లో జమ్మూ-కశ్మీర్ ఆరోగ్య రంగంలో సమూలమైన మార్పులను తీసుకువస్తుంది.  సుమారు 15 లక్షల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వ్యయం వరకు ఉచితముగా ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తుంది.   ప్రధాన మంత్రి ఆయుష్మాన్ యోజన పేరిట ఈ పధకం దేశవ్యాప్తంగా అమలు చేయబడిందనిఅయితే దాని ప్రయోజనం కేవలం పేద ప్రజలకు మాత్రమే అని శ్రీ షా అన్నారు.

60 కోట్ల మంది పేద ప్రజల కోసంఈ పథకం ఆరోగ్య రంగంలో దాదాపు 2 సంవత్సరాలుగా అద్భుతమైన పని చేస్తోంది.   చిన్నపెద్ద శస్త్ర చికిత్సల కోసం,  ఈ రోజు వరకు దాదాపు,  1.5 కోట్ల మందిని ఆసుపత్రులలో చేర్పించారు,   వారు పూర్తిగా కోలుకొనితిరిగి వారివారి ఇళ్ళకు వెళ్ళే వరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.

Image

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్యంతో అనుసంధానించడం ద్వారాకశ్మీర్ లోని సోదరసోదరీమణులతో పాటుజమ్మూ-కశ్మీర్ పౌరులందరికీ ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు శ్రీ అమిత్ షా తెలియజేశారు.  ఈ పథకం ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండబోయే మొదటి రాష్ట్రం జమ్మూ-కశ్మీర్. జమ్మూ-కశ్మీర్ పట్ల ప్రధానమంత్రికి గల అనుబంధం ఫలితంగానూలెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు చేసిన కృషి ఫలితంగానూ,  కశ్మీర్ లోని ప్రతి పౌరుడు రేపటి నుండి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.  ఈ పథకం కోసం జమ్మూ-కశ్మీర్‌లోని సుమారు 229 ప్రభుత్వ35 ప్రైవేటు ఆసుపత్రులను చేర్చుకున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు.  జమ్మూలో కానీ,  కశ్మీర్‌లో గానీఈ ఆసుపత్రులను సందర్శించిన వారందరికీభారత ప్రభుత్వంజమ్మూ-కశ్మీర్ పాలనా యంత్రాంగం,  వారి ఉచిత చికిత్స కోసం5 లక్షల రూపాయల వరకు అన్ని ఖర్చులను భరిస్తాయి.

Image

జమ్మూ-కశ్మీర్ ఆరోగ్య రంగంలోని మౌలిక సదుపాయాలకుఈ పధకం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందనిశ్రీ అమిత్ షా అన్నారు.  జమ్మూ-కశ్మీర్ పౌరులకు సేవ చేయడానికి కొత్త ప్రైవేట్ మరియు మంచి ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. జమ్మూ-కశ్మీర్ పౌరులుప్రత్యేక ఆరోగ్య సేవల కోసంజమ్మూ-కశ్మీర్ దాటి ప్రయాణించాల్సిన అవసరం లేని రోజు ఎంతో దూరంలో లేదనిఆయన అన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూకోవిడ్ నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాను అభినందించారు. 

జమ్మూ-కాశ్మీర్ వంటి కఠినతరమైన భౌగోళిక ప్రాంతంలో కోవిడ్ సమర్ధవంతమైన నిర్వహణ ఫలితమే జమ్మూ కాశ్మీర్‌ను కాపాడిందని శ్రీ షా అన్నారు.   పర్యాటక రంగంలో మంచి స్పందన రావడానికి కారణం జమ్మూ-కశ్మీర్ సకాలంలో కోవిడ్ నుండి రక్షించబడడమే.

ప్రధానమంత్రి సమావేశాలు నిర్వహించినప్పుడల్లాజమ్మూ-కశ్మీర్‌కు మూడు విషయాలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని నేను జమ్మూ-కశ్మీర్‌లోని నా సోదరసోదరీమణులకు చెపాదలచుకున్నాననికేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.  మొదటిది అభివృద్ధి, - అభివృద్ధి ప్రతి పేద వ్యక్తికి చేరుకోవాలిఅందరి జీవన ప్రమాణాలను పెంచడానికి మనం కృషి చేయాలి.  రెండవదిప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంజమురియాట్ప్రజాస్వామ్యంక్షేత్ర స్థాయికి చేరుకున్నట్లైతే,  అప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. భద్రత మరియు శాంతి ద్వారా మాత్రమే అభివృద్ధి సాధించవచ్చుకాబట్టి భద్రత మరియు శాంతి జమ్మూ కాశ్మీర్‌లో ఉండాలి.  ఆగష్టు5వ తేదీ తర్వాత ఈ మూడు రంగాల్లో పెద్ద మార్పు వచ్చిందని శ్రీ షా అన్నారు. అభివృద్ధిమౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా వ్యక్తిగత ప్రణాళికలు అయినాభారత ప్రభుత్వం చేపట్టిన అమలు ప్రారంభమైనాజమ్మూ-కశ్మీర్ పరిపాలన ఆగష్టు5వ తేదీ నుండి ఈ మూడు రంగాల్లో అద్భుతమైన వేగంతో పనిచేసింది.  దాదాపు ప్రతి వితంతువుకు సహాయం అందించడంప్రతి వ్యక్తికి వృద్ధాప్య పింఛను మంజూరు చేయడంప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్ ‌లు ఇవ్వడంభారత ప్రభుత్వంలోని అన్ని వ్యక్తిగత సంక్షేమ పథకాల పంపిణీతో సహా వ్యక్తిగత పథకాల ప్రయోజనాలూజమ్మూ-కశ్మీర్‌కు చాలా వేగంగాసమర్ధవంతంగా అందజేస్తున్నట్లుకేంద్ర హోంమంత్రి వివరించారు.    ప్రస్తుతందాదాపు అన్ని పథకాలు పూర్తి స్థాయిలో అమలుచేయబడిజమ్మూ-కశ్మీర్ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow