పెద కాకాని శివాలయం లో మాంసాహార వంటలు - 24 గంటలు గడచినా పట్టించుకోని DC - అనిల్ బెహరా

షరీఫ్ అనే వ్యక్తి కి శ్రీ బరామారంభ మల్లికార్జున కాంటీన్ మరియు మెస్ ను వేలం పాట ద్వారా అప్పగింత . 24 గంటలు గడచినా కేసు నమోదు చేయక పోవడం పై పలు అనుమానాలు . అన్య మతస్థుల చేతికి హిందూ దేవాలయాల అన్నదానం, ప్రసాదాలు , వగైరాలు అప్పగింత పై తీవ్ర నిరసన తెలియ చేసిన హిందూ సాంగ నాయకులు . ఈ సమస్య పై స్థానిక పెదకాకాని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన హిందూ సంఘాలు (లక్ష్మీ రామానుజ దాశి ) .

Apr 8, 2022 - 16:27
Apr 8, 2022 - 17:34
 0
పెద కాకాని శివాలయం లో మాంసాహార వంటలు - 24 గంటలు గడచినా పట్టించుకోని DC - అనిల్ బెహరా
Non veg in Peda kakani sivalayam temple

పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయ ఆవరణలో క్యాంటీన్ నిర్వాహకులు మాంసాహారం వండడంతో భక్తులు, ఆలయ అధికారుల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనను ఓ భక్తుడు తన మొబైల్ కెమెరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

క్యాంటీన్‌లో భక్తులకు టిఫిన్, టీ, అన్నదాన ప్రసాదాలు అందజేసేవారని, అయితే క్యాంటీన్‌లో నాన్ వెజ్ ఫుడ్స్ వండారని, ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని సమాచారం. ఆర్డర్ రావడంతో క్యాంటీన్ యజమాని క్యాంటీన్‌లో నాన్ వెజ్ వండినట్లు సమాచారం.

అయితే ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, హిందూ నాయకులూ, బీజేపీ కార్యకర్తలు , హుటాహుటిన ది  08-04-2022 న శివాలయానికి చేరుకుని , విచారణ చేపట్టి , ఆలయ ప్రస్తుత DC  ఇంచార్జి అయిన  శ్రీ చంద్ర శేఖర రెడ్డి గారిని ప్రశ్నించారు . కాగా డీసీ గారి సమాధానాలు హిందూ సంఘాల , బీజేపీ నాయకుల్ని  సంతృప్తి పరచలేక పోవడంతో DC మాటలపై నిరసన వ్యక్తం చేసారు . పూర్తీ వివరాలు ఈ  క్రింది వీడియో లో చూడగలరు .

పాటిబండ్ల రామకృష్ణ మాటలలో (బీజేపీ జిల్లా అధ్యక్షులు )

అనిల్ బెహరా మాటలలో (హైందవ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ )

ఆలయ సిభంధి అన్య మతస్థుడు కాంట్రాక్టర్ గా  ఉన్న బోర్డు ను తొలగించే ప్రయత్నం 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow