రెపో రేటు 4, రివర్స్ రెపో రేటు 3.35 ..చెల్లింపుల పరిమితి పెంపు - 2021 అమలు ?

కాంటాక్ట్‌ లెస్‌ చెల్లింపుల పరిమితి పెంపు, 2 వేలు నుంచి 5 వేల వరకు, 2021 జనవరి నుంచి అమలు,రెపో రేటు 4శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది

Dec 8, 2020 - 23:27
 0
రెపో రేటు 4, రివర్స్ రెపో రేటు 3.35 ..చెల్లింపుల పరిమితి పెంపు - 2021 అమలు ?

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్: రెపో రేటు 4శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం , వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు .

వరుసగా మూడవ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ - RBI ) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వాడకాన్ని ఊతమిచ్చే చర్యల్లో భాగంగా కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితినిపెంచాలని ప్రతిపాదించింది.

ప్రస్తుతమున్న కాంటాక్ట్ లెస్ కార్డు లావాదేవీల పరిమితిని 2 వేల రూపాయలనుంచి 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి . 24గంటలు,వారంరోజుల పాటు (24x7) ఆర్టీజీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉండేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow