విగ్రహారాధన పూర్వాపరాలు-విశిష్టత

Aug 4, 2021 - 17:52
 0
విగ్రహారాధన పూర్వాపరాలు-విశిష్టత

ఉపాసనలో విగ్రహారాధన ఐదవ వర్గంలోకి వస్తుంది. మనసు చంచలమైనది. ప్రతిక్షణం పరిభ్రవిస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి మార్గం విగ్రహారాధన. వైదికకాలం నుండి విగ్రహారాధనకు ప్రాధాన్యత ఉంది.

మనోధృతిర్ధారణా స్యాత్ సమాధిర్బ్రహ్మాణి స్థితిః|
అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి విచింతయేత్||

మనస్సు యొక్క ధృతి (స్థిరత్వం) ధారణ అనబడుతుంది. బ్రహ్మలో స్థతి పొందటం సమాధి అవుతుంది. కాని, మనసు స్థిరంగా ఉండకపోతే ఆలంబనగా విగ్రహాన్ని గ్రహించటం అవసరమౌతుంది . జ్ఞాని స్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి.

అది విగ్రహారాధన వల్లనే సాధ్యమౌతుంది. దానివల్ల మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. మనస్సులో భావం ఉత్పన్నం కావటానికి ఒక చిత్రపటం లేదా ప్రతిమ అవసరమన్న అంశాన్ని శాస్త్రీయంగా కూడా వైజ్ఞానికులు అంగీకరించారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి చేతిలో తన తల్లి, సోదరి, భార్య చిత్రపటాలు ఉన్నాయనుకుందాం. తల్లి చిత్రం చూడగానే అతనిలో ఆమె వాత్సల్యం; సోదరి చిత్రం చూడగానే స్నేహం, ఆర్ద్రత,భార్య చిత్రం చూడగానే ప్రణయభావం జాగృతం కావటం సహజం.

ఏకలవ్యుడు ఏమి చేశాడు? ధనుర్విద్య అభ్యసించటానికి ద్రోణాచార్యుని ప్రతిమను భక్తీభావంతో పూజించి ఆ ప్రతిమలో గురువును భావన చేసి, ధనుర్విద్యలో అర్జునుని మించిన విలుకాడుగా ఎదిగాడు.

ధ్రువుడు నారదుని ఉపదేశంతో శ్రీమన్నారాయణుని మూర్తిని నిర్మించి, దానిపై మనసు నిలిపి ఆరుమాసాల్లో భవత్సాక్షాత్కారం పొందాడు. కేవలం సనాతన హిందూధర్మంలోనే కాక ఇతర అనేక మతాల్లోనూ విగ్రహారాధన ఉంది. క్రైస్తవులు శిలువను పూజిస్తారు. ముసల్మానులు మక్కాలో ‘సంగే అసబద్’ ను చుంబిస్తారు. సమాధులపై పూలు చల్లుతారు. సిక్కులు గురు గ్రంథసాహెబ్ను భక్తితో ఆరాధిస్తారు.

నిర్గుణ, నిరాకార పరబ్రహ్మను ధ్యానించగలిగే స్థితిని చేరేవరకు సగుణమూర్తిని ఉపాసించటం సముచిత విధానమే.

ఉత్తమం సహజావస్థా ద్వితీయం ధ్యానధారణా
తృతీయాప్రతిమా పూజా హోమయాత్రాచతుర్థికా – శివపురాణం

అంటే, భగవంతుని తనలో ప్రత్యక్షం (ఆత్మదర్శనం)చేసుకోవడం ఉత్తమమయినది. భగవంతుని గురించిన జ్ఞానము, ధారణ దాని తరువాతవి. మూడవది భగవంతుని ప్రతిమలను పూజించడం. నాలుగవది పుణ్యక్షేత్రాలను దర్శించడం. చివరి రెండూ సామాన్య భక్తుల కోసం ఉద్దేశించినవి. పరామాత్మ అనుగ్రహం పొందడానికి విగ్రహారాధన ఒక మెట్టు వంటిది.

అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాః పరికల్పితాః – ధర్మనోపనిషత్

సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్థమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది.

ఈ విధంగా ఏర్పడిన విగ్రహారాధన డవార్యదోర్వీర్యంబుఆ మోక్షాన్ని పొందవచ్చు. దీనికి భక్తి ప్రధానం.

భక్త్యా వీణా బ్రహ్మజ్ఞానం న కదా చిదపి జాయతే – మహానారాయణోపనిషత్

పరిపూర్ణమైన భక్తి లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని (ఆత్మజ్ఞానాన్ని) ఏవిధంగానూ పొందలేము.

ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సాధనంగా వారికి ఇష్టమైన దైవ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి. అలా పూజించటం పరబ్రహ్మను పూజించినట్లే అవుతుంది. భక్తులు తఇష్టమైన మకు దేవతావిగ్రహాన్ని నిల్పుకుని ఆ విగ్రహమే ‘పరబ్రహ్మగా’ తలచి, నిశ్చలభక్తితో, శ్రద్ధాశక్తులతో, పరిపూర్ణవిశ్వాసంతో నిరంతరం పూజించితే తప్పనిసరిగా ‘ఆత్మజ్ఞానం’ పొందుతారు.

విగ్రహారాధన ద్వారా మనస్సుని నిశ్చల పరుచుకుని, (మనోనిగ్రహాన్ని పొంది) ఆ తదుపరి ‘నిర్గుణోపాసన’ ఆచరించవచ్చు. అంతేగాని, మనోనిగ్రహాన్ని పొందకుండా నిర్గుణోపాసన ద్వారా ‘ఆత్మజ్ఞానాన్ని’ తెలుసుకోవాలనుకోవటం హాస్యాస్పదం.

మనస్సుని అంటే పంచేంద్రియాలను, కామ, క్రోధాది అరిషడ్వర్గములను జయించనివాడు ‘నిర్గుణోపాసన’కు అర్హుడు కాదు. భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో “విగ్రహారాధన” చేసేవారు “పరబ్రహ్మ”ను ఆరాధించి నట్లే అవుతుందని, వీరే పరమ భాగవతోత్తములని శ్రుతులు తెలుపుతున్నాయి.

విగ్రహారాధన చేయకుండానే “పరబ్రహ్మను” ఆరాధించవచ్చు. దీనినే ‘నిర్గుణోపాసన’ అంటారు. కాని నిర్గుణోపాసన సామాన్యులకు సాద్యం కానిది. ఎందువలనంటే మన ఎదుట నిలుపుకున్న ‘దైవవిగ్రహము’ మీదనే, మన దృష్టిని, మనస్సుని తదేకంగా నిలపటం కష్టము. అటువంటప్పుడు నిరాకారుడైన ఆ “పరబ్రహ్మ” పై మన మనస్సుని ఎలా నిలుపగలం. సామాన్యులకు అది సాధ్యం కాని విషయం.

మానవునికి క్షణకాలంలోనే అనేక సంకల్పాలు శరపరంపరలుగా కలుగుతుంటాయి. అటువంటి విపరీత చంచల స్వభావమైన మనస్సును కదలక నిశ్చలంగా ఉండేటట్లు చేయడం చాల కష్టం. కాబట్టి మనస్సును “విగ్రహారాధన” అనే ప్రక్రియలో నిశ్చలపరచి, “మనోనిగ్రహాన్ని” పొందటం అత్యంతావశ్యకం.

కాబట్టి, మనస్సుని నిగ్రహించి, ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందటానికి లేక ‘పరబ్రహ్మతత్త్వాన్ని’ తెలుసుకోవటానికి ‘విగ్రహారాధన’ యే మిక్కిలి ప్రయోజనకారిగా ఉంది.

సర్వవ్యాప్తుడై సర్వభూతాలలో చిద్రూపుడైన ‘పరమాత్మ’ స్వరూపాలకు శిలా, మృత్తిక, దారుకలతో, కళావిన్యాస ప్రక్రియలతో విగ్రహాలుగా తయారు చేసి, ఆ దేవతామూర్తులను మంత్ర తంత్ర సంస్కారములచే ఆవాహన చేసి, ప్రతిష్టించి, వర్ణ, రూప నామములతో మంత్ర, తంత్ర యంత్ర విధులతో సామాన్యులైన భక్తులు పూజించి, భగవదనుగ్రహాన్ని పొందటం శాస్త్ర సంబంధమై ఉంది.

దుర్లభో మానుశోదేహః దేహీనాం క్షణభంగురః
తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనమః

జీవులలో మానవజన్మదుర్లభమైనది. కాని, క్షణ భంగురమైనది. కావున ఆ కొద్ది దుర్లభమైన “దైవ సాక్షాత్కారా”నికి వినియోగించుకోవలెను. ఇది ఉత్తమం. భగవదారాధన పూర్వకమైన విగ్రహారాధన కేవలం వైదికమైన పరలోకప్రాప్తికే కాక శారీరక, మానసికశాక్తులను పెంచుకోవడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. శాస్త్రాలలో అవ్యక్తమని చెప్పబడుతున్న ‘పరమాత్మ’ను ఆరాదిన్చాదానికిగల మార్గాలలో సులభమైంది ఈ ‘విగ్రహారాధన’.

భగవంతుడు సర్వవ్యాపి. ఆ స్వామి అన్నింటా వ్యాపించి ఉన్నాడు. కనుక మనం పూజించే విగ్రహంలో కూడ ఎందుకు లేదు? తప్పక ఉన్నాడు. అందుకే మనకు విగ్రహాన్ని చూడగానే భక్త్యావేశం కలిగి పరవశులం అవుతుంటాం! ఆ విగ్రహరూపం ముందు మన గోడును చెప్పుకుని సేదతీరుతుంటాం

విగ్రహారాధనకు ఆసక్తి, నమ్మకం చాలా ముఖ్యం. భక్తి, ప్రేమలు ప్రధానం. ఆడంబరాలతో చేసె విగ్రహారాధనలకు, అహంకారపూరితమైన భావావేశాలకు ‘పరమాత్మ’ గోచరింపడు. ప్రశాంత చిత్తంతో ఆరాధిస్తూ, నిష్కామంగా దృఢవిశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే తప్పని సరిగా సాక్షాత్కరిస్తాడు. ఆయన భక్తజన పరాధీనుడు.

విగ్రహమనగా విశేషంగా గ్రహించేది. అంటే భగవంతుని శక్తిని, గుణాలను, స్వరూపాన్ని పూర్తిచేసిగా తనలో ఇముడ్చుకొనగలిగినవే “దైవ విగ్రహాలు”. అవి దేనితో చేయబడినప్పటికీ కళావిన్యాస పూర్వకంగా ఉండి, మంత్రశక్తిచే శాస్త్రప్రకారం ప్రతిష్టించబడటం చేత, అవి “భగవంతుని” తత్త్వాన్ని ఆకర్షించుకుని, తమలో నిక్షిప్తపరచుకుని, ఆ శక్తితో అవి ప్రకాశిస్తుంటాయి. కాబట్టి వాటిని ‘అర్చామూర్తులు’ అని అన్నారు.

భగవద్గీతలో ఉదాహరించిన ప్రకారం, ఉపాసింప వీలులేని భగవత్త్వమును సామాన్య భక్తులు ఉపాసించుటకు వీలుగా విగ్రహారాధన రూపొందింది. అందరికి అందుబాటులో ఉండి, సులభసాధ్యమైనది ఈ విగ్రహారాధన.

సర్వాంతర్యామి యైన భగవంతుడు కేవలం తపః సంపన్నులకు, యోగులకే చూడ సాధ్యమవుతాడు. ఆ కారణంగా సామాన్యులకు ‘అర్చావతార విగ్రహా’లే శరణ్యమవుతున్నాయి.

విగ్రహాలలో భాగాచ్చక్తి నింపటానికి మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సాధనములు ఉన్నాయి. భగవతత్వం ప్రప్రథమంగా శబ్దంచే గ్రహింపబడుతుంది. భగవద్రాహకమగు శబ్దమేది ఉందో, అదే ఆ దైవం యొక్క మంత్రంగా నిలుస్తోంది.

నిత్య పూజా గృహముల యందు పూజావిగ్రహాలు 4 అంగుళాలు మొదలు 12అంగుళాల వరకు ఉండాలి. పూజా ప్రతిమలు రత్నాలతో తయారైనవైతే అత్యుత్తమం. ఆ తరువాత బంగారం, వెండి, రాగి లోహాలతో విడివిడిగా గాని, ఈ లోహములన్నింటిలో కలిపి గాని (పంచలోహాలు) చేయుంచుకోవటం ఉత్తమం.

రాయితో తయారైనవి మధ్యమం, చెక్కలతో తయారైనవి అధమం. దైవపటాలకన్నా విగ్రహాలు శ్రేష్ఠం. అందులోనూ పంచలోహాల విగ్రహాలు గాని, శిల, దారు, మృత్తికావిగ్రహాలు కాని, శక్త్యానుసారంగా ఉపయోగించుకోవచ్చు.

దైవవిగ్రహాలు చూడటానికి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనస్సుని ఆకట్టుకునే విధంగా, కళాత్మకంగా, సుందర మనోహరంగా తీర్చిదిద్దిఉండాలి.

ఇంట్లో ఈశాన్యభాగంలోగాని, ఉత్తర, తూర్పుభాగాలలోగాని పూజామందిరాన్ని ఏర్పరచుకోవాలి. పూజా మందిరంలో ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాలలో ఉన్నతమైన స్థలంలో గాని, ఎత్తైన పీఠంపైగాని పూజా విగ్రహాలను ప్రతిష్టించాలి. దైవవిగ్రహాలకు ఎదురుగా కూర్చుని పూజించరాదు.

సగుణ జ్ఞానహీనస్య నహినిర్గుణ వేదనమ్
నందిదర్శన హీనస్య యథా న శివదర్శనమ్

ఎలాగైతే నంది దర్శనాన్ని చేయలేనివాడు శివదర్శనాన్ని చేయలేకపోతాడో, అలాగు సగుణజ్ఞానంలేనివానికి నిర్గుణజ్ఞానం సిద్ధించదు. పెద్దఆకారంతో గర్భగుడికి బైటనున్న నందీశ్వరుని చూడజలని అశక్తుడు చీకట్లో చిన్నదిగా ఉన్న శివలింగాన్ని ఎలా చూడగలడు? అని శివపూరానం చెబుతోంది.

అందుకనే సగుణరూపంలో మనకోసం భూలోకానికి విచ్చేసి కొలువైన దైవాలను నియమనిష్ఠలతో పూజించి వారి ముందు మన లోరికలను ఉంచి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మన జన్మలను ధన్యం చేసుకుందాం.

హిందూ ధర్మం లో పధానమయినది ఏకేశ్వరభావన. ఏ దేవుని పూజించినా ఆ పూజలన్నీ ఏకేశ్వరునికే చెందుతాయన్నది ప్రతి ఒక్క హిందువు అపార నమ్మకం!

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow