RRB NTPC Jobs: డిసెంబర్‌లో ప్రిపరేషన్‌కు సమయం ఉంది కాబట్టి పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే రైల్వేలో ఉద్యోగం సంపాదించొచ్చు.
RRB NTPC Exam Syllabus | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్- R RB ఎన్‌టీపీసీ - అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ త్వరలో జరగనుంది. డిసెంబర్ 15 నుంచి ఈ పరీక్షలు జరిగే అవకాశముంది. ఎన్‌టీపీసీ పరీక్షలకు పుస్తకాలేంటో తెలుసుకోండి.

ప్రిపరేషన్‌కు సమయం ఉంది కాబట్టి పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే రైల్వేలో ఉద్యోగం సంపాదించొచ్చు.
ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష తేదీలను వెల్లడించలేదు. (ఈ ఎగ్జామ్స్ డిసెంబర్‌లో జరగొచ్చన్న వార్తలొస్తున్నాయి). ఎన్‌టీపీసీ కింద కమర్షియల్ అప్రెంటీస్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సీనియర్ టైమ్ కీపర్, లోకోపైలట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, లైన్‌మెన్, గూడ్స్ గార్డ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్‌ఆర్‌బీ. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారంతా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రిలిమ్స్- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెయిన్స్- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
ట్రాఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టులకు యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫైనల్ సెలెక్షన్ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఆర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించాలి.
జనరల్ సైన్స్ కోసం 6 నుంచి 10 తరగతి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ NCERT పుస్తకాలు చదవాలి.
జనరల్ అవేర్నెస్ కోసం జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. NCERT హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, పొలిటికల్ సైన్స్ పుస్తకాలు చదవాలి. రీజనింగ్‌లో క్లాసిఫికేషన్, నెంబర్, ఆల్ఫబెట్ సిరీస్, అనాలజీ, డిస్టెన్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ లాంటి అంశాలు చదవాలి. వీటిపై పట్టు సాధించిన తర్వాత statements and assumptions సీటింగ్ అరేంజ్మెంట్స్, puzzels లాంటివి చదవాలి.
ఆర్థమెటిక్ కోసం హై-స్కూల్ లెవెల్ గణితం పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. డిసెంబర్ 15 నుంచి పరీక్షలు జరగొచ్చని వార్తలు వస్తుండటంతో త్వరలోనే ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.