శ్యామా ప్రసాద్ ముఖర్జీ : నివాళులు: సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీ నారాయణ

Jun 24, 2021 - 06:21
 0
శ్యామా ప్రసాద్ ముఖర్జీ : నివాళులు: సంచలన వ్యాఖ్యలు చేసిన  కన్నా లక్ష్మీ నారాయణ

గుంటూరు: 23-06-2021: శ్యామా ప్రసాద్ ముఖర్జీ  (6 జూలై 1901 - 23 జూన్ 1953) ఒక గొప్ప భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది మరియు విద్యావేత్త, ఆయన ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రిగా పనిచేశారు.

నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తూ,నెహ్రూ-లియాఖత్ ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన ముఖర్జీ నెహ్రూ మంత్రివర్గానికి రాజీనామా చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహాయంతో,భారతీయ జనసంఘాన్ని 1951 లో స్థాపించారు.నాటి జన సంఘే నేటి భారతీయ జనతాపార్టీ.

దేశానికి తల మానికంగా ఉన్న అందాల కాశ్మీర్ లో దేశ విచ్ఛిన్న శక్తులు వేర్పాటువాదులుగా మారి మాది కూడా స్వతంత్ర దేశము ఇక్కడ మాకు ఒక ప్రత్యేక జండా , ప్రత్యేక రాజ్యాంగం , మేమే ఇక్కడ వేరోక ప్రధానమంత్రి ని నియమించుకొని పరిపాలన కొన సాగిస్తాము అన్నప్పుడు .

నాటి కుహనా లౌకికవాద పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి పొతే శ్రీ ముకర్జీ గారు "ఏక్ దేశ్ మే దో విదాన్, దో ప్రధాన్ , దో నిశాన్ , నహి చలేంగే " అన్న నినాదంతో కాశ్మీర్ కు వెళ్తే అక్కడ ఆయన్ని భందించి జైలో ఉంచి చిత్రహింస కు గురిచేసి అత్యంత హేయంగా ప్రవర్తించిన సంస్కారం అప్పటి పాలకులది,

ఇంతటి తతంగం తరువాత జూన్ 23 తేది 1953 వ సంవత్సరం లో అనుమానాస్పద రీతిలో మహానుభావుడు దేశం కోసం ఆత్మ బలిదానం చేసాడు.

స్వాతంత్రం తరువాత స్వార్ధ పాలకుల,దేశవిచ్చిన్నకర శక్తు లకు వ్యతిరేకంగా ఏన్నో పోరాటాలకి స్పూర్తి డాక్టర్ శామాప్రసాద్ ముఖర్జీ. భరత మాత ముద్దు బిడ్డ నీలి ఆకాశంలో తార జువ్వలా వెలుగుతూ ఉన్నాడు, ఈ రోజును మనమందరం బలిదాన దివస్ గా జరుపుకుంటున్నాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow