విశ్వకర్మ జాతీయ ఉగాది పురస్కారములు - 2022 - శ్రీ విశ్వకర్మ పీఠం- NN మల్లేశ్వర రావు

Sriviswakarmapeetam.in

Mar 21, 2022 - 13:51
May 5, 2022 - 06:03
 0
విశ్వకర్మ జాతీయ ఉగాది పురస్కారములు - 2022 - శ్రీ విశ్వకర్మ పీఠం- NN మల్లేశ్వర రావు
Sriviswakarmapeetam.in

MDN / GNT /2212202: లోక కల్యాణార్థం తలపెట్టిన చండీ హోమం, మరియు విశ్వ కర్మ జాతీయ పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన , రిజిస్టర్డ్ చారిటబుల్ ట్రస్ట్ వారు విశ్వకర్మ జాతీయులలో పంచ వృత్తుల లో , సామజిక, రాజకీయ, సేవా , సాహిత్య , సాంకేతిక , ఆధ్యాత్మిక, తదితర రంగాలలో విశిష్ట అనుభవం గడించిన వారిని గుర్తించి ఇచ్చే పురస్కారాలు. ఈ కార్యక్రమం లో భాగంగా ది 02-04-2022 నాడు , స్థానిక గుంటూరు - చుట్టుకుంట సెంటర్ నందు గల శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వేదికగా శ్రీ నంది పాటి నాగ మల్లేశ్వర రావు సిద్ధాంతి - ప్రముఖ జ్యోతిష్య , వాస్తు శాస్త్ర నిపుణులు , మరియు శ్రీ విశ్వకర్మపీఠం పీఠాధిపతులు , గారి అద్వర్యం లో మరియు శ్రీ విశ్వ కర్మ పీఠం కమిటీ

1 )బ్రహ్మశ్రీ గన్నె వాసు దేవరావు గారు 
2 )బ్రహ్మశ్రీ చిర్రావూరి సుదీర్ గారు 
3 )బ్రహ్మశ్రీ కందేపు వెంకటరావు గారు 
4 )బ్రహ్మశ్రీ మేడిది సత్యనారాయణ గారు 
5 )బ్రహ్మశ్రీ డోల శరత్ గారు 
6 )బ్రహ్మశ్రీ కాజ భరద్వాజ గారు 
7 )బ్రహ్మశ్రీ క్రిష్ణపురపు బార్గవ గారు 
8 )బ్రహ్మశ్రీ కొమ్మూరి రావణ బ్రహ్మ గారు 
9 ) వేద బ్రహ్మశ్రీ ఆచార్య తామాడ మొహన రావు శర్మ గారు 
10) బ్రహ్మశ్రీ వంగవోలు హనుమంతరావు గారు 
11 )బ్రహ్మశ్రీ మేడూరి శివరామ బ్రహ్మం గారు 
12 )బ్రహ్మశ్రీ శ్రీగిరి పూర్ణచంద్రరావు గారు 
13 )బ్రహ్మశ్రీ శేఖర్ గారు

వారి పర్య వేక్షణలో,

విశ్వకర్మ జాతీయ ఉగాది పురస్కారములు - 2022 ,

కార్యక్రమము జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభము అగును,

ఈ కార్య క్రమము లో పాల్గొను ముఖ్య, విశిష్ట మరియు ప్రత్యేక, అతిధులు 

చిలకలూరి పెట ,నాడెండ్ల మండలం ,గణపవర గ్రామం ..అది పరాశక్తిక్షేత్ర  పీఠాధి పతులు . పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ నిత్యవిద్యానంద భారతీ స్వాములవారు.

హరిహరక్షేత్రం పీటాధిపతులు శ్రీ శ్రీ శ్రీ ప్రణవానంద  భారతీ స్వామిజి గారు 

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ  వారి 8 వ తరం ముని మనువడు శ్రీ నుస్సమ్ వీరం బొట్లయ్య గారు బ్రహ్మం గారి మటం .కందిమల్లయ పల్లె ,కడప జిల్ల

బ్రహ్మ శ్రీ పావులూరి హనుమంతరావు గారు,

బ్రహ్మశ్రీ కల్లూరి శ్రీ వాణి గారు 

పెనుగంచిప్రోలు ..రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ మహిళా అధ్యక్షురాలు 

బ్రహ్మశ్రీ కర్రి వేణు మాధవ్ గారు 

రాష్ట్ర స్వర్ణ కార మరియు బీసీ .సెల్  అద్యక్షులు 

బ్రహ్మశ్రీ నందిపాటి .రవీంద్ర గారు వాస్తుజ్యోతిష విద్వాంసులు ..పిడుగురాళ్ల .

పంచ వృత్తులు 

కమ్మరపు పని: :బ్రహ్మశ్రీ మంచి పుల్లయ్యచారి గారు 

ధారు పని(వడ్రంగి) :బ్రహ్మశ్రీ కొమ్మూరి రావణ బ్రహ్మ గారు 

కంచరపు పని (కాంస్స్యకారులు) బ్రహ్మశ్రీ రమేశ్ గారు 

శిల్పపు పని (శిల్పశాస్త్రం ): వేద బ్రహ్మశ్రీ ఆచార్య తామాడ మోహనరావు శర్మ స్థపతి గారు బెంగళూరు మరియు  గుంటురు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కొల్లూరు మృత్యుంజయా చారి గారు 

బంగారపు పని: బ్రహ్మశ్రీ మానేపల్లి వెంకట భద్రాచారి గారు మరియు జగ్గయ్యపేట వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వెల్లంకి భద్రం గారు ...

శ్రీ నంది పాటి నాగ మల్లేశ్వర రావు గారి మాటల్లో :-  ఓం శ్రీ గురుభ్యోనమః హర హర మహాదేవ శంభో శంకర

ఆత్మ బంధువులందరికి మన విశ్వకర్మ పీఠం యొక్క నమస్సుమాంజలి తెలియచేస్తూ, మన ఈ విశ్వకర్మ పీఠం ప్రతి ఒక్కరి జీవితము నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని, శ్రీమత్‌ విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కరుణ, దయ కృప మన అందరి పై ఉండాలని స్వామి వారిని వేడుకొంటూ. మన ఆచారాలను పాటిస్తూ సుఖసంతోషాలతో గడుపుతూ పదిమందికి మార్గదర్శంగా వుండాలని కోరుకుంటూ.

పీఠం గురించి

ఈ రోజున మనం గమనిస్తూ వుంటే ప్రతి ఒక్కరు వారి వారి గృహ జీవనాన్ని బట్టి వారి వారి వృత్తి ధర్మాన్ని బట్టి, ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్ల వాని దగ్గర నుండి వృద్ధాప్యములో వున్న వారి వరకు, వారి వారి జీవితాలను గమనించుకొని వారి జీవన ప్రయాణం సంతోషంగా వున్నమా, లేమా అని ఒక్కసారి వారు ఆలోచిస్తే ప్రతి ఒక్కరి నుండి ఒకటే సమాధానం, లేదు, లేదు అని తెలుస్తుంది, కారణం ఏమైవుంటుంది అని వారి వారి జీవితాలను, జాతకాలను పరిశీలించి పరిశోధన చేస్తే, ప్రతి ఒక్కరి సమస్యకు నిగూఢమైన మన శాస్త్రాలలో, మరియు మన వేదములలో చక్కని పరిహార మార్గములు మన మహర్షులు ద్వారా తెలియచేయబడినవి. వాటిని పరిశీలించి, పరిశోధన చేసి లోక కళ్యాణము కొరకు మరుగున పడిన మన హిందూ ధర్మ ఆచారాలు మరియు పరిహార మార్గాలను మన శ్రీ విశ్వకర్మ పీఠం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రస్తుత కాలమానములో కలియుగ ధర్మాన్ని అనుసరించి కలిమాయచే, ప్రతి ఒక్కరి లో నేను, నాది, నాకొరకు, నాకేంటి, అనే స్వార్ధపూరిత అవలక్షణములు ప్రవేశించడం వలన కలిమాయ చే అనేక ఉపద్రవాలు చవి చూడాల్సివస్తుంది. ఇలా మన జీవనం నడుస్తూ వుంటే భవిష్యత్‌ తరాలకు మనమేమీ సమాధానమివ్వగలము?? ప్రతి ఒక్కరూ పూర్వకాలములో వున్న సంతోషం, కలుపుగోలుతనము, ప్రేమ, ఆప్యాయతలు, అభిమానములు నేటి కాలములో కనిపిస్తున్నాయా ? ఒక్కసారి ఆలోచించండి.

ఈ కలియుగములో ప్రొద్దున నిద్ర లేచిన మొదలు, రాత్రి పడుకోబోయెంత వరకు ధనము లేనిదే మనకు పనులు ఏమి జరగటంలేదు. మరి ఆ ధన సంపాదన విధానము లో మనం నడుస్తున్న విధివిధానాలు ఎలా వున్నాయి. ? నీతి, ధర్మం, న్యాయం అనే పదాలు మరుగున పడి, అధర్మం, అన్యాయం, మోసం, దగా, కుట్రలు వైపు మన ఆలోచనా జీవన పయనం నడుస్తుంది. వీటికి మనమందరి జీవితాలు బలి కావలసిందేనా????

ఈ అన్యాయాలకు, మోసాలకు, కొంతమంది అమాయక ప్రజలు బక్కో సారి తమ ప్రాణాలు సైతం తీసుకొంటున్నారు. మనం ఎంతో పుణ్యం చేసుకొంటేనే, మనకు ఆ భగవంతుడు ఈ మానవ జన్మ ను ప్రసాదిస్తే మరి మానవ జన్మను పొందిన మనం చేయాల్సిన విధి విధానాలను, ధర్మాలను ప్రక్కన పెట్టి, తాత్కాలికమైన సుఖసంతోషాల కొరకు ప్రాకులాడుతూ, అధర్మ మార్గాన నడుస్తూ, మానవుడు తన జీవితాన్ని, తనను నమ్ముకొన్న వారి జీవితాలను సైతం ఎన్నో బాధలకు గురి చేస్తూ తన ఆయుష్‌ ప్రమాణాన్ని సైతం తగ్గించుకొంటున్నాడు.

కావున మనలో తప్పనిసరిగా మార్పు రావాలి, మనందరి బాగోగుల కోసం మన శ్రీ విశ్వకర్మ పీఠం అను నిత్యం కఠోర శ్రమ చేస్తూ , పరిశోధనలు చేస్తూ, ప్రయోగాలు నిర్వహిస్తూ విశ్వమానవాళి జనజీవితం గాడి తప్పకుండా కష్టాలు రాకుండా, స్వలాభం లేకుండా ధర్మ మార్గమైన మన పూర్వీకులు ప్రసాదించిన ఆరోగ్య సూత్రాలను, సత్‌ సంబంధాలతో కూడిన ఆత్మీయ సమావేశాలు మరియు అధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడినది.

మన సనాతన హైందవ ధర్మం లో వున్న అంశములు వాటి విలువలు, ప్రస్తుత కాలమానములో వున్న యువతకు తెలియచెప్పే వారు లేరు, తెలుసుకునేవారు లేరు, ఇరువురికీ అంత తీరిక లేకపోవడం, కారణం ఉమ్మడి కుటుంభాలు లేకపోవడం, మరియు ఇంకొక కారణం మనకు వున్న సమయమంతా అతి కోరికల కొరకు ధన సంపాదించుటకే సరిపోతుంది. అవునా, కాదా ??? ఇది మన చాలా బాధ పడవలసిన విషయం.

పూర్వకాలములో ఉమ్మడి కుటుంభాలలో ఒకరికి ఒకరు సఖ్యత, అన్యోనత, ప్రేమాభిమానాలతో జీవించటం, పెద్ద వారిని గౌరవించడం, వారు చెప్పిన మంచి విషయాలు వినడం, నేర్దుకోవడం జరిగేవి.

కానీ ప్రస్తుత కాలములో చిన్న చిన్న కుటుంభాలుగా ఏర్పడటం వలన భార్య భర్తలు ఇరువురు సంపాదనకు సమయం కేటాయించడం వలన, తమ తమ పిల్లలకు చిన్నతనమునుండే బకరికి ఒకరు ప్రేమాభిమానాలు, అన్యోనతలు చూపాలి అని, ఇతరులను గౌరవించాలి అని, కోరికలను అదుపులో ఉంచుకోవాలి అని, ఇతరులకు మోసం, అన్యాయం కలిగేలా చేయకూడదు అని, మన స్వార్ధం కోసం మోసపూరిత మాటలు చెప్పకూడదని, ఆడవారిని గౌరవించాలి అనే మంచి మాటలు చెప్పి, వారి జీవన మార్గపు విలువలు పెరిగేలా, మన హిందూ సాంప్రదాయాలు తెలిసేలా వారికి మార్గదర్శకం చేయలేక పోతున్నారు. కారణం సమయమంతా సంపాదించటానికే సరిపోతుంది.

అందుకే ఈ కలికాలములో ఇప్పటి యువతలో పెద్దల ఎడల నిర్లక్ష్యం మాటలు, అసహనం, ఆవేశం మాటలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం పెరిగిపోతుంది. సమాజము లో నేర ప్రవృత్తి పెరిగి వారి జీవనం అల్లకల్లోలం అవుతుంది. కారణం మనమే, మనం మన ఆచారాలను, విలువలను ఆచరించక, తెలియక విడనాడి వాటిని దూరం చేసుకొంటున్నాము.

మనల్ని చూసి మన పిల్లలు కూడా మన ఆచారాలను విడనాడుతున్నారు. అందుకే మనం పాటించి మన పిల్లలకు మంచి చెడ్డలు, మంచి మాటలు నేర్పేది ఎప్పుడు ??. వారు చెడు మార్గాన పయనిస్తూ, మనం చెప్పినా వినక, మన కళ్ళముందే నష్టపోతునప్పుడు, వాటిని చూసి బాధపడుచున్నాము కదా!

కావున మన తప్పులని తెలుసుకొని, సరిదిద్దుకొని, ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ మానవ జన్మను, 100 సం. జీవితాన్ని మన ఆచారాలను పాటిస్తూ సుఖసంతోషాలతో గడుపుతూ పదిమందికి మార్గదర్శంగా వుండాలని కోరుకుంటూన్నము.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow