ఒక ప్రఖ్యాత అంతరిక్ష శాత్రవేత్తను గూఢచర్యం కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టిన దాష్టీకం

భారత అంతరిక్ష సంస్థ యొక్క క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన, రష్యా నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి కారకులు అయిన ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త అయిన 53 సం.ల నంబి నారాయణ్ కేరళ త్రివేండ్రమ్ లో గల ఒక చిన్న ఇంటికి పోలీసులు వచ్చారు.. .. నంబి నారాయణ్ గారు దేశ అంతరిక్ష విభాగానికి చేసిన సేవలకు గుర్తింపుగా మోడీ ప్రభుత్వం 2019లో ఈయనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. నంబి నారాయణ్ గారి పై ఈ సంఘటనలు ఆధారంగా మాధవన్ హీరోగా 'రాకెట్రీ' అనే సినిమా తయారు అవుతోంది. ఈ సందర్భంగా మొన్న ప్రధాని మోడీని నంబి నారాయణ్ మరియు హిరో మాధవన్ కలిశారు.

Jul 3, 2022 - 03:45
 0
ఒక ప్రఖ్యాత అంతరిక్ష శాత్రవేత్తను గూఢచర్యం కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టిన దాష్టీకం

ఒక ప్రఖ్యాత అంతరిక్ష శాత్రవేత్తను గూఢచర్యం కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టిన కేరళ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ప్రభుత్వాల దాష్టీకం గురించి చదవండి. ఏ విదేశ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తు ను తాకట్టు పెట్టారు? అది 30 నవంబర్ 1994. భారత అంతరిక్ష సంస్థ యొక్క క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన, రష్యా నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి కారకులు అయిన ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త అయిన 53 సం.ల నంబి నారాయణ్ కేరళ త్రివేండ్రమ్ లో గల ఒక చిన్న ఇంటికి పోలీసులు వచ్చారు.

"మా బాస్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు" అని చెప్పి పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్లి బెంచి మీద కూర్చోబెట్టారు. బాస్ ఆ రోజంతా రాలేదు. ఆ రాత్రంతా నంబి గారు అలాగే బెంచి మీద పడుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసినట్లు కేరళ కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు మర్నాడు అధికారికంగా ప్రకటించారు. ఆ వార్త వచ్చిన గంటల్లోనే మీడియాలో అతన్ని దేశద్రోహిగా అభివర్ణిస్తూ వార్తలు కధనాలు వచ్చాయి - మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలు ఏర్పాటు చేసిన హానీ ట్రాప్ లో పడి నంబి గారు పాకిస్థాన్‌కు రాకెట్ టెక్నాలజీని విక్రయించారు అని ఆరోపణలు చేశారు.

నంబి గారు మధ్యతరగతి కుటుంబంలో ఐదుగురు బాలికల తరువాత కలిగిన మొదటి అబ్బాయి. అతని తండ్రి కొబ్బరి డొక్కులు, పీచు వ్యాపారం చేసేవారు. నంబి చదువులో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండేవాడు. అతనికి ఎప్పుడూ విమానాలు మరియు ఎగిరే వస్తువుల పట్ల ఇంటరెస్ట్ ఉండేది. ఇంజనీరింగ్ చేసి ఇస్రో లో చేరాడు.

1967 లో నంబి ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థలను అధ్యయనం చేయడానికి వెళ్లి వచ్చి తిరిగి ఇస్రోలో చేరాడు. విక్రమ్ సారాభాయ్ ఇస్రో వ్యవస్థాపకుడు మరియు మొదటి ఛైర్మన్, అతని వారసుడు సతీష్ ధావన్, తరువాత భారతదేశ 11 వ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలతో కలసి ఇస్రోలో నంబి నారాయణన్ భారత అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. "నేను వీరితో ఇస్రోలో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు అంతరిక్ష సంస్థ ప్రారంభ దశలోనే ఉంది.

మాకు ఎప్పుడూ రాకెట్ వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రణాళిక లేదు. మా పేలోడ్లను ఎగరడానికి యుఎస్ మరియు ఫ్రాన్స్ నుండి రాకెట్లను ఉపయోగించాలని మేము అనుకునే వారం అని నారాయణన్ చెప్పారు." కానీ త్వరలోనే స్వదేశీ భారతీయ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో మిస్టర్ నారాయణన్ కీలక వ్యక్తి గా అయ్యారు. నంబి అరెస్టు కాబడడానికి ఒక నెల ముందు కేరళ పోలీసులు వీసా కాలపరిమితి అయిపోయింది అనే ఆరోపణలపై మాల్దీవుల మహిళ మరియం రషీదాను అరెస్ట్ చేశారు. కొన్ని వారాల తరువాత, మాల్దీవుల రాజధాని మాలే నుండి బ్యాంకు ఉద్యోగి ఫౌజియా హసన్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

వీళ్ళ ట్రాప్ లో పడే నంబి రహస్యాలను పాక్ కి అమ్మేశారు అని వార్తాపత్రికలు కధలు వండి వార్చి వడ్డించేసాయి. అతన్ని అధికారికంగా అరెస్టు చేసిన రోజు నారాయణన్ ను కోర్టులో హాజరుపరిచారు. నాకు ఏమీ తెలియదు అని నంబి గారు చెప్పినా న్యాయమూర్తి అతన్ని 11 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ కి ఇచ్చారు. భారత అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన ఆరోపణలు, అవినీతి అభియోగాల ఆరోపణలు వల్ల అతను సంపాదించుకున్న గౌరవం మరియు ఖ్యాతి మొత్తం నాశనం అయిపోయాయి. సమాజం వారి.కుటుంబాన్ని పూర్తిగా వెలివేసింది.

ఆ కుటుంబ సభ్యులు ఎక్కడకు వెళ్లినా ఛీత్కారాలు ఎదురయ్యాయి. అతన్ని మంచానికి కట్టి కొట్టి ప్రశ్నించేవారు విచారణాధికారులు. వారు అతనిని రోజులు తరబడి చిత్ర హింసలకు గురి చేశారు. అతనికి లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేసారు. అతను ఏమి చెప్పకపోవడంతో అతన్ని హై సెక్యూరిటీ జైలుకు మార్చారు.

"రాకెట్ రహస్యాలు కాగితం ద్వారా బదిలీ చేయలేము ఈ కుట్రలో కావాలని ఎవరో నన్ను ఇరికించారు" అని నంబి నారాయణన్ పోలీసులకు మొత్తుకున్నాడు. "పూర్తి క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి భారతదేశం ఇంకా ప్రయత్నిస్తున్నాది, అటువంటిప్పుడు ఇంకా తయారు కాని ఆ పరిజ్ఞానాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయగలను"? అని పోలీసులకు చెప్పి వేడుకున్నా కూడా ఏ ప్రయోజనం కలగలేదు. మొత్తానికి నంబి 50 రోజులు జైలులో గడిపారు.

ఆయన అరెస్టు కాబడ్డ ఒక నెల తరువాత సిబిఐ ఈ కేసును కేరళ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి తీసుకుంది. నంబి గారి ద్వారా సిబిఐ ఆఫీసర్ మొత్తము కధ విని ఈ కేస్ ఈ దశకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మమ్మల్ని క్షమించండి అని నంబి గారికి చెప్పాడు. దీనివల్ల 19 జనవరి 1995 న నంబి నారాయణ్ బెయిల్ పొందాడు. ఈ సంఘటన వల్ల నంబి గారి భార్య మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది.

దాదాపు పిచ్చిదాని లాగా మారిపోయింది. నంబి నారాయణన్ కాకుండా, మరో ఐదుగురుపై గూఢచర్యం మరియు రాకెట్ సాంకేతికతను పాకిస్తాన్ కు బదిలీ చేశారని ఆరోపించారు. వారిలో ఒకరు ఇస్రోలో అతని సహోద్యోగి శశికుమార్, రషీదా మరియు ఆమె స్నేహితుడు, మరో ఇద్దరు భారతీయ పురుషులు, రష్యన్ అంతరిక్ష సంస్థ ఉద్యోగి మరియు కాంట్రాక్టర్. 1996 లో విడుదల అయిన సిబిఐ చివరి నివేదిక వీరందరినీ నిర్దోషులుగా పేర్కొంది.

ఏ ఆరోపణల పై కూడా సరి అయిన ఆధారాలు లేవని అంతేకాక ఇస్రో అంతర్గత దర్యాప్తులో కూడా క్రయోజెనిక్ ఇంజిన్ల డ్రాయింగ్లు ఈయన వద్ద లేవని తేలింది. నంబి నారాయణన్ తిరిగి ఇస్రో లో బెంగళూరులో అడ్మినిస్ట్రేటర్ గా చేరాడు - కాని అతని కష్టాలు అంతం కాలేదు. CBI కేసును మూసివేసిన తరువాత కూడా కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దానిని తిరిగి తెరవడానికి ప్రయత్నించి సుప్రీంకోర్టులో సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. చివరికి 1998 లో సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వ అపీల్ ను కొట్టివేసింది.

తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించినందుకు కేరళ ప్రభుత్వంపై నారాయణన్ కేసు వేస్తే అతనికి 50 లక్షలు పరిహారం చెల్లించాలి అని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాక అక్రమ అరెస్టు, వేధింపులకు పరిహారంగా అదనంగా మరో ₹1.30 కోట్లు కేరళ ప్రభుత్వం చెల్లించింది. ఇతనిని ఈ కేసులో ఇరికించిన కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తు జరపాలని 2018 లో సుప్రీంకోర్టు ఆదేశించింది.

78 సం.ల ఈ వయసులో నంబి గారు ఈ కేసు ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన్ను ఈ కేసులో ఇరికించిన వ్యక్తులకు శిక్షి బడాలని ఆయన ఆశిస్తున్నారు.

భారత్ అంతరిక్షంలో సాధించిన విజయాలకు వెన్నెముకగా మారిన క్రయోజెనిక్ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధిని అడ్డుకోడానికి ప్రత్యర్థి అంతరిక్ష శక్తి దేశం నారాయణన్ ని ఇరికించిన కుట్రా ? లేక వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లోకి పోటీ ధరలతో భారత్ గట్టిగా ప్రవేశించడం పట్ల భయపడిన ప్రత్యర్థి దేశాల పనా? లేక ఇది పూర్తిగా భారత్‌ లోనే అంతర్గతంగా ఉన్న అవినీతి ఫలితమా? ఏమో? దీని వెనుక ఎవరు ఉన్నారు?

ఈ కుట్ర ఉద్దేశ్యం ఏమిటి అన్నది ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయింది. ముఖ్య తేదీలు: 1994 నవంబర్ - నారాయణన్ అరెస్టు 1995 జనవరిలో బెయిల్ 1996 - సీబీఐ నంబి పై ఆరోపణల తిరస్కృతి 1998 - సీబీఐ చర్యపై కేరళ ప్రభుత్వ అపీల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది 2001 - కేరళ ప్రభుత్వం నంబి నారాయణ్ కి పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018 - కేసులో నంబి గారిని ఇరికించడంపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. పై సంఘటనలు అన్ని వివరిస్తూ "రెడీ టు ఫైర్" 'హౌ ఇండియా అండ్ ఐ సర్వైవడ్ ఇస్రో స్పై కేస్' అనే పుస్తకం అరుణ్ రాం తో కలిసి రాశారు నంబి నారాయణ్ గారు.

నంబి నారాయణ్ గారు దేశ అంతరిక్ష విభాగానికి చేసిన సేవలకు గుర్తింపుగా మోడీ ప్రభుత్వం 2019లో ఈయనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. నంబి నారాయణ్ గారి పై ఈ సంఘటనలు ఆధారంగా మాధవన్ హీరోగా 'రాకెట్రీ' అనే సినిమా తయారు అవుతోంది. ఈ సందర్భంగా మొన్న ప్రధాని మోడీని నంబి నారాయణ్ మరియు హిరో మాధవన్ కలిశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow