తులా లగ్నము

Jul 22, 2021 - 12:59
 0

తులా లగ్నం

తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. సూర్యుడు, ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు అశుభఫలితాన్ని ఇస్తాడు. బుధుడు కారక గ్రహ ఫలితాన్ని ఇస్తాడు. గురువు అకారక గ్రహంగా అశుభఫలితాన్ని ఇస్తాడు.

సూర్యుడు :- శత్రురాశి అయిన తులా లగ్నంలో ఉన్న కారణంగా నేత్రవ్యాధికి కారకుడు ఔతాడు. సూర్యుడి లాభాధిపత్యం కారణంగా ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు ఉంటాయి. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ సంబంధం కాని, దృష్టి కాని ఉన్న ఎడల వ్యక్తి ఊగ్ర స్వభావమును కలిగి ఉంటాడు. లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో తన ఉచ్ఛ స్థానమైన మేషం మీద దృష్టి సారిస్తున్న కారణంగా వ్యక్తి సాహసం పరాక్రమం కలిగి ఉంటాడు. వివాహంలో ఆటంకాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అనుకూలం లోపిస్తుంది.

చంద్రుడు :- తులాలగ్నానికి చంద్రుడు దశమస్థానాధిపతి ఔతాడు. బాల్యం సంఘర్షణతో కూడినదిగా ఉంటుంది. యవ్వనం, వృద్ధాప్యం సుఖమయంగా ఉంటుంది. లగ్నస్థ చంద్రుడు వీరిని సద్గుణ సంపన్నుడిగానూ, విద్వాంసుడిగానూ చేయును. కల్పనా శక్తితో కూడిన అస్థిర మనస్థత్వం కల వారుగా ఉంటారు. లగ్నస్థ చంద్రుని కారణంగా తల్లితో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. తులాలగ్నానికి చంద్రూడు దశమాధిపతిగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. సప్తమ స్థానం మీద చంద్రుని పూర్ణ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి ఉద్రేక పూరిత స్వభావం కలిగి, సాహసి అయి, మహత్వకాక్ష కలిగి ఉంటారు. లగ్నస్థ చంద్రుడు శుభ గ్రహ సంబంధం దృష్టి ఉన్న ఎడల ఉత్తమ ఫలితాన్ని ఇస్తాడు.

కుజుడు :- తులాలగ్నానికి కుజుడు ద్వితీయ, సప్తమ స్థాలకు ఆధిపత్యం వహిస్తాడు. ధన స్థానమైన ద్వితీయాధిపత్యంలో ఉన్న కుజుడు లగ్నస్థుడైనందున ఆర్థిక లాభమును కలిగిస్తాడు. వ్యాపార, వర్తకాలలో సాఫల్యత కలిగిస్తాడు. స్వతంత్రముగా పని చేయుట వలన వీరికి లాభము ప్రాప్తిస్తుంది. వీరికి భాగస్వామ్యము అధిక నష్టాలను కలిగిస్తుంది.

లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావాలను చూస్తున్నాడు కనుక సుఖ భావం మీద కుజుని దృష్టి కారణంగా సోదరుల నుండి సహాయసహకారములు లభించవు. వైవాహిక జీవితంలో కష్టములు ఉంటాయి. కుజుడి దశలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

బుధుడు :- తులాలగ్నానికి బుధుడు నవమాధిపతి, ద్వాదశాధిపతిగా ఔతాడు కనుక బుధుడు తులాలగ్నానికి శుభుడు ఔతాడు. కనుక వ్యక్తికి ధార్మికత, బుద్ధి కుశలత

కలిగిస్తాడు. ఉత్తమమైన వ్యక్తుల మీద గౌరవం కలిగి ఉంటాడు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగం నుండి వీరికి సన్మానం సహకారం లభిస్తుంది. జన్మ స్థలానికి దూరంగా సుఖజీవితాన్ని సాగిస్తారు. వీరికి తల్లి తండ్రుల నుండి ప్రేమ సహకారం లభిస్తుంది. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ భావాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో సామాన్య సుఖం ఉంటుంది. సంతానం, జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పాపగ్రహ పీడితుడైనందువలన ధనలాభం, కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది.

గురువు :- తులాలగ్నానికి తృతీయ, ష్టమస్థానాధిపతిగా గురువు అకారక గ్రహమై అశుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. లగ్నస్థ గురువు కారణంగా విద్వాంసుడు, సాహసిగా ఉంటాడు. బుద్ధికుశలత వలన ధనం, గౌరవం పొందగలరు. లగ్నంలో ఉన్న గురువు క్షమాగుణం, సంతాన ప్రాప్తి, ఉన్నత విద్యను ప్రసాదిస్తాడు. గురువు లగ్నం నుండి అయిదవ, ఏడవ, తొమ్మిదవ భావముల మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి, తల్లి, తండ్రి నుండి ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది.

తులాలగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, అష్టమాధిపతి ఔతాడు. కనుక శుక్రుడు తులాలగ్నానికి కారక గ్రహం ఔతాడు. లగ్నస్థ శుక్రుడు స్వస్థానంలో ఉండి శుభుడుగా ఉన్నందున చురుకుదనం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. లగ్నస్థ శుకృడు శుభుడు అయినందున రోగ రహిత ఆరోగ్యం కలిగి ఉంటాడు. సంగీతం, సౌంద్యర్య సాధన మీద, కళలయందు ఆసక్తి కలిగి ఉంటారు. లగ్నస్థ శుక్రుడు సప్తమ భావం మీద పూర్ణ దృష్టిని సారిస్తాడు కనుక ప్రేమ వ్యహారాలు అధికంగా ఉంటాయి. ఈకారణంగా కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. విలాసాలకు, భోగాలకు అధికంగా ఖర్చు చేస్తారు.

శని :- తులాలగ్నానికి శని చతుర్ధ, పంచమ స్థానాలకు కారకత్వం వహిస్తూ ప్రముఖ కారక గ్రహం ఔతాడు. తులా లగ్నంలో ఉన్న శని కారణంగా తల్లి తండ్రుల నుండి స్నేహపూరిత సహకారం అందుకుంటారు. విద్యావంతులు ఔతారు. వృత్తి విద్యలలో విశేష సాఫల్యం సాధిస్తారు. శని దృష్టి తృతీయ, సప్తమ, దశమ స్థానాల మీద ప్రసరిస్తుంది. కరుణ స్వభావం కలిగి ఉంటారు. భూమి, వాహన సౌఖ్యం కలిగి ఉంటారు. బంధు మిత్రులతో వివాదములు అభిప్రాయ భేదాలు ఉంటాయి.

రాహువు :- తు లాల గ్నంలో ఉన్న రాహువు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. రాహువు అంత్ముర్ఖముఖ స్వభావాన్ని ఇస్తాడు కనుక వీరు తమ కార్యాలను రహస్యంగా ఉంచుతారు. లగ్నస్థ రాహువు వలన చదువులో ఆటంకాలు ఉంటాయి. రాహువు భాగ్యహీనం కలిగిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం అందదు.

కేతువు :- తులా లగ్నంలో కేతువు వ్యక్తికి సాహసం, పరిశ్రమించే గుణం ఇస్తాడు. పరిశ్రమ, సాహసం కారణంగా కఠిన కార్యాలను కూడా సాధిస్తాడు. శిక్షణలో ఆటంకములు ఉంటాయి. కేతువు ధార్మిక భావనలు కలిగిస్తాడు. పరుల సొమ్ము మీద ఆసక్తి ఉంటుంది. మనసులో అనవసర భయములు ఉంటాయి. జూదం, పందెములలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow