తెలుగు యొక్క గొప్పధనం గూర్చి పెద్దల నోట

“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు .. అటువంటి భాష మన మాతృభాషా అయినందుకు మనం గర్వపడాలి . మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తుచేసుకుంటూ మన జీవితాల్లో భాగమైన అక్షరం గురించి ఈ చిన్న మాట.
అంటూ జాతీయ స్థాయి ఐ పీ ఎస్ శ్రీ నాగేశ్వర్ రావు గారి నోట
మన భాష మన భావాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. కావున మనం మాట్లాడే తెలుగులో పరభాషా పదాల వాడకం తగ్గిస్తే మన భావ వ్యక్తీకరణలో స్పష్టత వస్తుంది.
— M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) August 19, 2020
भाषा शुद्धि से भाव शुद्धि होता है। इसलिए शुद्ध हिंदी में भाव व्यक्तीकरण स्पष्ट होगा।
Purity of language & clarity of thought are interlinked.
ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ లో నేర్చుకోవడం మధ్య ఎంతో తేడా ఉంది. ఈ వ్యత్యాసం మరచిపోతే మనం మన అస్తిత్వాన్ని కోల్పోతాం. గుర్తింపు పోతే అన్ని పోయినట్లే గదా!
— M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) August 20, 2020
अंग्रेजी सीखना, अंग्रेजी में सीखना ऐ दोनों में बहुत अंतर है। जो इस अंतर को विस्मरण करते हैं उसके अस्तित्व का पतन अनिवार्य।
వారికి మాత్రమే సొంతమైన సామెతలు
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").
సామెతలు ఉదాహరణ
- కలిమిలేములు కావటి కుండలు.
- చెప్పకురా చెడేవు, ఉరకకురా పడేవు.
- నిజం నిలకడమీద తేలుతుంది.
- నిజమాడితే నిష్టూరం.
- అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు.
- దభ్భుపోయినవాడు పాపాన్ని పోతాడు.
- అందని పూలు దేవుని కర్పణం.
- కమ్మరి వీధిని సూదులమ్మినట్లు.
- కుడితే తేలు కుట్టకపోతే కుమ్మరి పురుగు.
- హనుమంతుని ఎదుట కుప్పిగెంతులా!.
- చల్ది కంటే ఊరగాయి ఘనం. దీనిమీద తయారయిన సామెత- ఉపన్యాసం కంటే ఉపోద్ఘాతం ఎక్కువు.
- ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు.
- ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.
- ఆతండ్రికి కొడుకు కాడా!
- ఆబుర్రలో విత్తనాలేనా?
- కందకు లేదు, చేమకు లేదు, తోటకురకు వచ్చెనా దురద! - కందకు లేని దురద బచ్చలికేమి.
- కాలు పట్టుకు లాగితే చూరు పట్టుకు వేలాడేడు - మెడపట్టుకు గెంటితే చూరు పట్టుకు వేలాడిందట.
- దొంగ చిక్కెనోయి అంటే కరిచెనోయి అన్నట్టు- కరవకురా దొంగడా!
- కాదు కాదు అంటే నాది నాది అన్నాట్ట.
- నంగివంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేశాయి అన్నాడుట.
- మెసలి బావా కడిమి వేరాయెగాని కాలయినా ఇంతే కదా.
- ఉడకక ఉడకక ఓ ఉల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపుపోదు.
- మొండికెక్కిన దాన్ని మొగుడేమి చేసి రచ్చకెక్కినా దాన్ని రాజేమిచేసు.
- వాడ వదినెలకేల వావివరసలు.
- ఇనుము విరిగితే అతకవచ్చునుగాని మనసు విరిగితే అతక కూడదు.
- కంచు మోగునట్లు కనకమ్ము మోగునా!
- పుట్టడం చావడం కొరకే, పెరుగుట విరుగుట కొరకే.
- చెరువు నిండితే కప్పలు చేరుతాయి.
- ఆవుల మళ్ళించినవాడు అర్జునుడు.
- కాని కాలానికి పయిబట్ట పక్షులెత్తుకు పోయాయి.
ఇలా ఎన్నో ఎన్నెన్నో