వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా అన్నమయ్య వ్రాసిన అమ్మవారి కీర్తన
సర్వాంగ సుందరుడు, శ్యామలాంగుడు అయిన ఆ వేంకటేశ్వరుడినే తన జాణతనములతో కొంగున కట్టుకుని అతని వక్షస్థలంలో స్థిరంగా నిలిచిపోయింది తల్లి
పల్లవి: అలమేలుమంగ నీవభినవరూపము జలజాక్షుకన్నులకు చవులిచ్చేనమ్మా
చరణం 1:
గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి పరమానంద సంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని హరుషించఁగఁ జేసితి గదమ్మా
చరణం 2:
శశికిరణములకు చలువల చూపులు విశదముగా
మీఁద వెదచల్లుచు రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు
నీ- వశము చేసుకొంటి వల్లభునోయమ్మా
చరణం 3:
రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరఁగుచు
వట్టిమాఁకులిగిరించు వలపుమాటల
విభు జట్టిగొని వురమున సతమైతివమ్మా
What's Your Reaction?






