వినాయక పత్రిలో ఔషధగుణాలు

Aug 6, 2021 - 10:33
 0
వినాయక పత్రిలో ఔషధగుణాలు

వినాయక పత్రిలో ఔషధగుణాలు

 • మాచీ పత్రి (మాసుపత్రి, మాచిపత్రి)- నేత్రవ్యాధుల నివారణ.
 • బృహతీ పత్రం అంటే నేలమునగ లేక వాకుడాకు - మూలశంక, దగ్గు, మలబద్దకం నివారణ.
 • బిల్వ పత్రం దీనిని మారేడు అని కూడా అంటారు - మధుమేహం లేక చక్కెర వ్యాధి (షుగర్ వ్యాధి) నివారణ.
 • దూర్వాయుగ్మం అంటే జంట గరిక - మూత్రసంబంధ వ్యాధుల నివారణ.
 • దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు - మానసిక రోగ నివారణ.
 • బదరీ అంటే రేగు - బాలారిష్టం నివారణ.
 • అపామార్గం అంటే ఉత్తరేణి - దంత వ్యాధులు, చర్మవ్యాధుల నివారణ.
 • తులసి - వాంతులు, నులి పురుగులు, దగ్గు నివారణ.
 • చూత పత్రం అంటే మామిడి ఆకు - అతిసారం, చర్మవ్యాధి, కాలి గోళ్ళ పగుళ్ళు.
 • కరవీరం అంటే గన్నేరు - జ్వర తీవ్రతను తగ్గిస్తుంది.
 • విష్ణు క్రాంత - మేధో వికాసం, నరాల బలహీనతల నివారణ.
 • దాడిమీ అంటే దానిమ్మ పత్రం - దగ్గు, ఉబ్బసం, అజీర్తి నివారణ.
 • మరువక పత్రం అంటే మరువం - శరీర దుర్వాసన నివారణ.
 • దేవదారు- శ్వాశకోశ వ్యాధుల నివారణ.
 • సింధువారంటే వావిలి ఆకు - బాలింత వాతం, ఒంటి నొప్పుల నివారణ.
 • జాజి - నోటి దుర్వాసన నివారణ.
 • శమీ అంటే జమ్మి- కుష్టు, అవాంఛిత రోమాల నివారణ.
 • అశ్వత్థం అంటే రావి - శ్వాశ కోశ వ్యాధుల నివారణ.
 • అర్జున(మద్ది)- వ్రణాలు తగ్గటానికి.
 • అర్క అంటే జిల్లేడు- చర్మకాంతి కోసం.
 • నింబ అంటే నిమ్మ- నులి పురుగులు, చర్మరోగాల నివారణ.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow