శ్రీ మఠంలో గత శివరాత్రి సమయంలో ఏమి జరిగినది? - శ్రీనివాసులు పాలెపు VBSPP

Jan 23, 2023 - 19:28
 0
శ్రీ మఠంలో గత శివరాత్రి సమయంలో ఏమి జరిగినది? -  శ్రీనివాసులు పాలెపు VBSPP

శివరాత్రికి జరిపే కల్యాణ కార్యక్రమం మఠాధిపతి దంపతులు కర్చొని చేయుట ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయం మనకు తెలుసు. మఠాధిపతి లేరు కావున వారి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని కూర్చోబెట్టడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలని శ్రీ మఠం గురు పత్ని మారుతి మహలక్ష్మి నిర్ణయం. దాని కోసం అందరిని పిలిచారు. ఆవిడ ఆలోచన వెంకటాద్రి స్వామి అంటే భద్రయ్య స్వామి ఒప్పుకోరు.

భద్రయ్య స్వామీ అంటే వెంకటాద్రి స్వామి ఒప్పుకోరు. కావున కుటుంబ పెద్దగా మఠాధిపతి తమ్ముడు శ్రీ వీర భద్రయ్య స్వామి వారి చేత చెపిస్తే బాగుంటుందని. ఎవరు ఆయనకు మఠం తో సంబందము లేదని ఒప్పుకోలేదు. అభ్యర్థుల రేసులో లేని శ్రీ వెంకటాద్రి స్వామి కి మద్దతుగా గట్టిగా నిలిచిన వీరం బొట్లయ్య లేదా దత్తాత్రేయలలో ఒకరి ద్వారా చెపిస్తే బాగుంటుంది, మన ఆధ్వర్యంలో జరిగినటుల ఉంటుందని గురుపత్ని చెప్పినా ఒప్పుకోలేదు. వారిద్దరు గోవింద స్వామికి మద్ధతు దారులు కూడా కారు.

వారు చేయడానికి వెంకటాద్రి స్వామిని ఒప్పుకోకుండా అడ్డుపడినది ఎవరు? చివరకు ఫిట్ పర్సన్ శ్రీ శంకర బాలాజీ గారు కల్యాణం తిలకించడానికి రారండి, తీర్ధ ప్రసాదాలు తీసుకొండని అందరూ భక్తులకు ఇచ్చే రీతిలో కాకుండా కొంచెం గుడ్డిలో మెల్లలాగా ఒక తెల్ల కాగితం మీద గౌరవ ప్రదంగా ప్రత్యేక ఆహ్వానం పంపి, దాని మీద సంతకం పెట్టించుకొన్నారు.

మారుతి మహాలక్ష్మి మాత్రమే ఆ పేపర్ మీద అభ్యంతరం రాసారు, ఆ పేపర్ రికార్డేడ్ గా ఉన్నది చివరకు కల్యాణం మన ప్రొద్దుటూరు కృష్ణ స్వాముల వారి ఆధ్వర్యంలో నయనాందకరంగా జరిగింది. ఆ రోజు అక్కడ ఎవరు నిలబడి అజమాయిషీ చేసారనేది పై ఫోటో ద్వారా తెలుస్తుంది. అలానే వీడియోలు కూడా ఉన్నాయి. కుటుంబములో జీవించి ఉన్న వారిలో పెద్దవారు శ్రీ వీర భద్రయ్య స్వామి చేత చేపిస్తే బ్రహ్మానంద భరితంగా ఉండేది.

వారికి మంచి గౌరవం ఇచ్చినటుల ఉండేది. శ్రీ దత్తాత్రేయ లేదా శ్రీ వీరం బొట్లయ్య గారిలో ఒకరి ద్వారా చెపిస్తే సరిపోయేది కదా? దానివలన ఎవరికి నష్టం లేదు కదా? మరి ఎందుకు వారిని ఒప్పుకోలేదు శ్రీ వెంకటాద్రి స్వామి? ఎవరు వారికి ఆ సలహా ఇచ్చినదనేది పెద్ద ప్రశ్నగా మిగిలి పోయినది. ఈసారన్నా అలా జరగకుండా ఉంటే మంచిది. ముందు జాగ్రత్తగా అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొంటే మంచిది అనేది నా భావన.

శ్రీనివాసులు పాలెపు VBSPP - వీర బ్రహ్మేంద్రస్వామి ప్రచార పరిషత్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow