అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల్ని మరలా మెరుగుపరచే మహానాడు - యరపతినేని శ్రీనివాసరావు

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం_ మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్

అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల్ని మరలా మెరుగుపరచే మహానాడు - యరపతినేని శ్రీనివాసరావు

1982 ముందు 35 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెకలించటానికి అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో ఒక ప్రభంజనం లాగా అధికారంలోకి వచ్చి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో చాటిచెప్పి తెలుగు దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు.

సినిమా రంగంలో మకుటం లేని మహారాజు లాగా ఉండి, సంపాదన కూడా వదులుకొని సమాజంలోని పేద, బడుగు బలహీనవర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, కూడు,గూడు, నీడ ఇవ్వాలి, డబ్బులు ఉన్నవాడిదే రాజ్యం కాదు, పేదవాడికి కూడా రాజ్యాధికారం రావాలనే తలంపుతోనే ఆరోజు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

తెలుగుదేశం పార్టీ జెండాలో పేదవాడి గుడిసె, కర్షకుడి నాగలి, కార్మికుడి చక్రం, పసుపు రంగు, ఎరుపు రంగు శుభానికి స్ఫూర్తిక. ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ ఈరోజు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని దాదాపు 23 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండి ఎంతోమంది జీవితాల్లో వెలుగు రేఖలు నింపి సామాన్య ప్రజానీకం కళ్ళల్లో ఆనందాన్ని నింపింది తెలుగుదేశం పార్టీ.

ఆ మహనీయుడి శతవసంతాల జయంతి సందర్భంగా ఒంగోలులో జరుపుకుంటున్న "మహానాడు" కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రథసారథి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఎంతో ఉత్తేజకరంగా, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి కూడా చెప్పగల్గింది.

మూడు సంవత్సరాల వైసీపీ దుష్ట పరిపాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని జైలుకు పోయి, ఆస్తులు పోగొట్టుకుని, అవమానాలకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపింది అధినేత ప్రసంగం.

చారిత్రాత్మకమైన ఈ మహానాడు వేదికగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న సంకేతం ఈ రోజు బలంగా కూడా కార్యకర్తల నుంచి వినపడింది.

ఇదే స్ఫూర్తితో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి, ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి, అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల్ని మరలా మెరుగుపరచి,

ఈరోజు నిరుద్యోగంలో వున్న యువతకు మరలా ఉద్యోగ అవకాశాలను కల్పించి, ఆర్థిక విధానాన్ని మెరుగుపరిచి, అక్షర క్రమం లోనే కాదు మరలా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి తోనే సాధ్యం అనే దిశగా అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, గురజాల నియోజకవర్గం నుండి "మహానాడు" కి హాజరైన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, అభిమానులకు అభినందనలు తెలియజేసుకుంటూ, గురజాల నియోజకవర్గ పసుపు సైనికులందరికీ కూడా అన్న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.