మీరు విశ్వకర్మలు కారు - వైశ్వకర్మణులు - ఆచార్య చండ్రపాటి

విష్ణు భక్తులు మేమే విష్ణువులం అనరు. వైష్ణవులం అని చెప్పుకుఃటారు. శివభక్తులు మేమే శివుళ్ళం అని అనరు. శైవులం అని చెప్పుకుంటారు.

మీరు విశ్వకర్మలు కారు - వైశ్వకర్మణులు - ఆచార్య చండ్రపాటి

దయయుంచి మేమే విశ్వకర్మలం అని ఆ పరాత్పరుని స్థానమాక్రమించి కించపరచే ప్రయత్నాలు త్యజించండి.

మీరు విశ్వకర్మలు కారు.

ఆ తండ్రికి ఉత్తరాధికారులు, అనుయాయులు, భక్తులు మాత్రమే అని గుర్తించండి.

కనుక 'వైశ్వకర్మణులు' అగుదురు.

మేము ఈ చరాచరజగత్తుకు కారకుడైన విరాడ్విశ్వకర్మ ఉత్తరాధికారులం వైశ్వకర్మణులం

అని ఎలుగెత్తి చాటండి.

ఇది వేద సమ్మతం , 

వ్యాకరణ సమ్మతం.

విష్ణు భక్తులు మేమే విష్ణువులం అనరు. 

వైష్ణవులం అని చెప్పుకుఃటారు.

శివభక్తులు మేమే శివుళ్ళం అని అనరు.

శైవులం అని చెప్పుకుంటారు.

ఎటొచ్చీ వైశ్వకర్మణులే అసలు విశ్వకర్మ ఎవరు? 

మేమే విశ్వకర్మలం అయితే, అని ఆ పరాత్పరుని తృణీకరిస్తున్నారు.

ఆ తండ్రి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. కించ పరచుచున్నారు.

నమో విశ్వకర్మణే - Professor.Chandra pati.