నౌకా దళ దినం నాడు భార‌తీయ నౌకా ద‌ళానికి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Dec 5, 2020 - 04:33
 0
నౌకా దళ దినం నాడు భార‌తీయ నౌకా ద‌ళానికి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి
ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబర్ 4 వ రోజు న నౌకా ద‌ళ దినం సంద‌ర్భం లో భార‌తీయ నౌకా ద‌ళ సిబ్బంది కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.


“మ‌న నౌక ద‌ళానికి చెందిన ధైర్యశాలి సిబ్బంది అందరికీ, వారి కుటుంబాల‌కు కూడా ఇవే నౌకా ద‌ళ దిన శుభాకాంక్ష‌లు.  భార‌తీయ నౌకా ద‌ళం మ‌న కోస్తా తీరాలను నిర్భ‌యం గా ప‌రిర‌క్షించడం తో పాటు ఆప‌త్కాలాల్లో మాన‌వీయ సాయాన్ని కూడా అందిస్తోంది.  శతాబ్దాల నాటి భార‌త‌దేశ స‌ముద్ర సంబంధిత సుసంప‌న్న సంప్ర‌దాయాన్ని కూడా ఈ సంద‌ర్భం లో మనం స్మ‌రించుకొందాం” అని ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

భారత దేశములో నౌకాదళ దినోత్సవం ప్రతి  సంవత్సరం డిసెంబరు 4 వ తేదీన జరుపుతారు. దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం, భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. 17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లే "భారత నావికా పితామహుడి"గా భావిస్తారు.

భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో, ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు.ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది, విమాన వాహక నౌక, పెద్ద రవాణా ఓడ, 15 యుద్ధనౌకలు, 8 గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, 24 కొర్వెట్టెలు, 13 సంప్రదాయ జలాంతర్గాములు, 1 అణు దాడి జలాంతర్గామి, 30 పెట్రోల్ ఓడలు, వివిధ సహాయక నౌకలు మొదలైనవి భారత నావికాదళంలో భాగం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow