Asha Pasham Full Video Song || Care Of Kancharapalem Video Songs || Venkatesh Maha || Rana Daggubati

ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో సేరువైనా సేదూ దూరాలే -Asha Pasham Song Lyrics Care Of Kancharapalem Movie,

Mar 5, 2021 - 21:35
Mar 5, 2021 - 21:40
 0

Asha Pasham Full Video Song Lyrics

(please put in comment section and share with your friends)

ఆశ పాశం బందీ సేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

సేరువైనా సేదూ దూరాలే

తోడౌతూనే ఈడే వైనాలే

నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో

ఆటు పోటు గుండె మాటుల్లోనా... సాగేనా...

ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో

లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో

నిండు పున్నమేళ

మబ్బు కమ్ముకొచ్చి

సిమ్మ సీకటల్లిపోతుంటే

నీ గమ్యం గందరగోళం

దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు

పల్లటిల్లిపోయి నీవుంటే

తీరేనా నీ ఆరాటం

ఏ హేతువు నుదుటి

రాతల్ని మార్చిందో

నిశితంగా తెలిసేదెలా

రేపేటౌనో తేలాలంటే.. నీ ఉనికి ఉండాలిగా..

ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా...

ఆశ పాశం బందీ సేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో

ఏ మలుపులోఏం దాగున్నదో

నీవుగా తేల్చుకో నీ శైలిలో

సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న

లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం

నీవు పెట్టుకున్ననమ్మకాలు అన్ని

పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం

నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి

ఎదురేగి సాగాలిగా

రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా

ఓ... ఆటు పోటు గుండె

మాటుల్లోన... ఉంటున్నా...

Song : Asha Pasham Movie :

Care Of Kancharapalem Banner : aruchuri Vijaya Praveena Arts Producer : Paruchuri Vijaya Praveena, MD Directed : Venkatesh Maha. Music: Sweekar Agasthi Lyrics: Vishwa Singer: Anurag Kulkarni Additional Vocals: Sweekar, Damini Programmers: Sweekar Tony, Live Rythms: Chiranjeevi Anil, Guitars: Sweekar Rec Engg: Anil Mani Mix Engg: S Chandrasekhar Mastering Engg: Shamanth Cast: Subba Rao, Radha Besse, Mohan Bhagat, Praveena Paruchuri & Others Music Label : Aditya Music.

Netizens coments as follows

1 .ఒంటరిగా ఉన్నపుడు వినాలి అనిపిస్తుంది. 2. ప్రేమ బాధలో ఉన్నపుడు వినాలి అనిపిస్తుంది. 3. ఎవ్వరి సహాయం లేనపుడు. కష్టం దెగ్గర ఉన్నపుడు వినాలు అనిపిస్తుంది 4. కుటుంబ భాధలు ఎక్కువ అయినపుడు వినాలి అనిపిస్తుంది. 5. ఉద్యోగ సమస్యాలు ఉన్నపుడు వినాలి అనిపిస్తుంది. ఇన్ని భాధలు ఈ ఒక్క పాటతో ఊరట దొరుకుతుంది.. జీవితానికి అర్ధం చెప్పారు ఒక్క పాటలో.. 

ఈ పాట రాసిన "విశ్వ " గారికి ధన్యవాదములు.. మీ జన్మ ధన్యం సార్.. ????????????

చచ్చే వాడికి కూడా బతకాలనిపిస్తుంది ఈ పాట వింటే ????

కొన్ని లక్షల మంది మనసులు ఆలోచనలు మార్చిన పాట ఈ పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి సాధించగలం (ఉత్సాహం)కలుగుతుంది ❤️

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow