రాత్రి

రాత్రి (Night) అనగా సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు గల సమయము. రాత్రికి తెలుగు భాషలో వికృతి పదం రాతిరి. సూర్యుడు లేకపోవడం వలన చుట్టూ చీకటిగా ఉంటుంది. అందువలన రాత్రి సమయంలో పని చేసుకోవడానికి దీపాలు చాలా అవసరం. కొన్ని పువ్వులు రాత్రి సమయంలో విచ్చుకొని మంచి సుగంధాన్ని వెదజల్లుతాయి. ఉదాహరణ: రాత్రి రాణి (Night Queen). ఎడారి మొక్కలైన కాక్టస్ రాత్రి సమయంలో పుష్పిస్తాయి. రాత్రిలోని మధ్య భాగాన్ని నడిరాత్రి లేదా అర్ధరాత్రి అంటారు. మనదేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని చెబుతారు.
రాత్రి, "'రోజులో సూర్యుడు లేని సమయము.
రాత్రి"" (సినిమా), 1992 తెలుగు సినిమా.
రాత్రి రాణి"" (Night queen) సువాసనభరితమైన పువ్వుల మొక్క.
మొదటి రాత్రి"" వివాహం జరిగిన దంపతులకు మొదటి రాత్రి చాలా మధురమైనది.
మొదటి రాత్రి (సినిమా), " 1950లో విడుదలైన తెలుగు సినిమా.
మొదటి రాత్రి (సినిమా), " 1980లో విడుదలైన తెలుగు సినిమా.
ఆ రాత్రి, "" గుడిపాటి వెంకటాచలం కథా సంపుటి.
నిశ్శబ్ద రాత్రి," 2000లో విడుదలైన తెలుగు సినిమా.
పున్నమి రాత్రి, " 1985లో విడుదలైన తెలుగు సినిమా.
అమృతం కురిసిన రాత్రి" ఉత్తమ కవితాసంపుటిగా తిలక్ రచన.