కల్మషం లేని నిరాడంబరుడు : ట్రేండింగ్ కదా నాయకుడు తొట్టెంపూడి గోపీచంద్

Jul 15, 2021 - 10:55
Jul 15, 2021 - 11:05
 0
కల్మషం లేని నిరాడంబరుడు : ట్రేండింగ్ కదా నాయకుడు  తొట్టెంపూడి గోపీచంద్

గోపీచంద్ ప్రముఖ తెలుగు నటుడు, సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. ఇతను తొలివలపు చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం,నిజం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. తర్వాత మళ్ళీ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం అతను కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు. 

జననం:  తొట్టెంపూడి గోపీచంద్ 1975 జూన్ 12 (వయస్సు 46) కాకుటూరువారి పాలెం, ప్రకాశం జిల్లా. వృత్తి:నటుడు .జీవిత భాగస్వాములు: రేష్మా .పిల్లలు: విరాట్ కృష్ణ, వియాన్: 

గోపీచంద్ ప్రకాశం జిల్లా, టంగుటూరు దగ్గర్లో ఉన్న కాకుటూరువారి పాలెంలో జన్మించాడు. ఇతని బాల్యమంతా ఒంగోలు, హైదరాబాదు లలో గడిచింది. గోపీచంద్ తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవాడు.

తండ్రి టి. కృష్ణ కూడా తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తూ పొగాకు ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తర్వాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్ళాడు. పిల్లలను చదివించడానికి చెన్నైలో ఆయనకు నచ్చిన పాఠశాల దొరక్కపోవడంతో చెన్నై నుంచి ప్రిన్సిపల్ ను రప్పించి ఒంగోలులోనే నిల్ డెస్పరాండం అనే పాఠశాల ప్రారంభించాడు.

నిల్ డెస్పరాండం అంటే ఫ్రెంచి భాషలో నిరాశ పడద్దు అని అర్థం. ఈ పాఠశాల ఇప్పటికీ ఒంగోలులో టి. కృష్ణ స్నేహితులు నిర్వహిస్తున్నారు. గోపీచంద్ ఈ పాఠశాలలో చదువుకున్నాడు. గోపీచంద్ మూడో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణ నేటి భారతం సినిమా తీశాడు.

తర్వాత పిల్లలని చెన్నై తీసుకువెళ్ళి రామకృష్ణ మిషన్ పాఠశాలలో చేర్పించాడు. తర్వాత రష్యాలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. రష్యాలో ఉండగా మరో నటుడు మాదాల రంగారావు పిల్లలు రష్యాలో వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు.

నటుడు శ్రీకాంత్ సోదరి కూతురు రేష్మా ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు విరాట్ కృష్ణ, వియాన్ ఉన్నారు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర (లు) భాష ఇతర విశేషాలు
2001 తొలి వలపు ప్రేమ్ తెలుగు
2002 జయం రఘు తెలుగు ప్రతినాయక పాత్ర
2003 నిజం దేవుడు తెలుగు ప్రతినాయక పాత్ర
జయం రఘు తమిళం ప్రతినాయక పాత్ర
2004 వర్షం భద్రన్న తెలుగు ప్రతినాయక పాత్ర
యజ్ఞం శీను తెలుగు
2005 ఆంధ్రుడు సురేంద్ర తెలుగు
2006 రణం చిన్నా తెలుగు
రారాజు కాళి తెలుగు
2007 ఒక్కడున్నాడు కిరణ్ తెలుగు
లక్ష్యం చందు తెలుగు
2008 ఒంటరి వంశీ తెలుగు
శౌర్యం విజయ్ తెలుగు
2009 శంఖం చందు తెలుగు
2010 గోలీమార్ గంగారామ్ తెలుగు
2011 వాంటెడ్ రాంబాబు తెలుగు
మొగుడు రామ్ ప్రసాద్ తెలుగు
2013 సాహసం గౌతం తెలుగు
2014 లౌక్యం వెంకటేశ్వరులు / వెంకీ తెలుగు
2015 జిల్ జై తెలుగు
సౌఖ్యం శ్రీనివాసులు/శీను తెలుగు
2017 గౌతం నంద గౌతం ఘట్టమనేని / నంద కిషోర్ తెలుగు ద్విపాత్రాబినయం
ఆక్సిజన్ మేజర్ సంజీవ్ / కృష్ణ ప్రసాద్ తెలుగు
ఆరడుగుల బుల్లెట్ తెలుగు
2018 పంతం తెలుగు
2019 చాణక్య తెలుగు

నోట్ : మార్పులు చేర్పుల  కామెంట్ చేయండి .

డొనేట్ :  ఇక్కడ నొక్కండి

___________________________________________________

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle.

My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here Donate. https://mydigitalnews.in/donate   

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow