రాష్ట్రంలో లెక్కకు మించి సంఘటన జరుగుతున్నా అత్యాచార బాధితులకు న్యాయం జరగటంలేదు - డాక్టర్ గొళ్ళమూడి
సామాజికవేత డాక్టర్ గొళ్ళమూడి రాజ సుందర బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కకు మించి అత్యాచార సంఘటన జరుగుతున్న అత్యాచార బాధితులకు న్యాయం జరగటంలేదని సామాజికవేత్త ఐడియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గొళ్ళమూడి రాజ సుందర బాబు అన్నారు. ఆదివారం గుంటూరు అంబేద్కర్ భవన్ లో ఎస్సీ ఎస్టీ చట్టాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు పెద గొట్టిపాడు గగరపర్రు బాధితులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొళ్ళమూడి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టం సక్రమంగా అమలు కావడం లేదు అనడానికి పెద గొట్టిపాడు సంఘటన పెద్ద ఉదాహరణ అని.
2018 సంవత్సరం జనవరి ఒకటో తేదీన పెద గొట్టిపాడులో దళితులపై దాడులు జరిగి ఎఫ్ఐఆర్ నమోదు అయితే తదనంతరం జరిగిన సాంఘిక బహిష్కరణ పై పోలీసుల కేసు నమోదు చేయడం లేదని విచారణ జరిపిన డిఎస్పి కూడా తన చార్జిషీట్లు లో సాంఘిక బహిష్కరణ అంశాన్ని పొందుపరచక పోవడం చట్టం అమలు నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
మరి ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం లో టిఫిన్ ప్లేట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించిన విషయంలో అడిగిన 18 మంది దళిత యువతను అక్రమంగా అన్యాయం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అవుతుందని .
ఒకపక్క అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించబోతూ మరోపక్క అంబేద్కర్ కి జరిగిన అవమానాన్ని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం దారుణమని ఇటువంటి సంఘటనలే దళితులకు స్థానం లేదు అని అర్థమవుతుందన్నారు.
గోపాలపురం యువతపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేస్తూ గవర్నమెంట్ జీవో విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డాక్టర్ గోళ్ళమూడి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐడీబీ నాయక్, ఇద్వా అధ్యక్షురాలు బి. భారతి, పెద్దగొట్టిపాడు బాధితుల కమిటీ నాయకురాలు జొన్నలగడ్డ జయభాగ్యమ్మ, పెదగొటిపాడు గగరపర్రు బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.