ఉపనిషత్తుల గురించి క్లుప్తంగా - శ్రీ చిద్విలాసానంద/ఆనంద్ నాథ్

Upanishads Explained in Telugu by Sri Anand Nath Ji Aghori, Sri Chidhvilasananda

Apr 22, 2024 - 14:00
Apr 22, 2024 - 14:17
 0

సనాతన ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి 1 సంహితలు,  2 బ్రాహ్మణాలు , 3 అరణ్యకాలు, 4 ఉపనిషత్తులు.

ఉప +ని + షత్ :

ఉప అంటే సమీపంగా,

ని అంటే కింద,

షత అంటే కూర్చునుట

ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి.

  1. సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
  2. బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
  3. అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
  4. ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక గురు దేవులు/  ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.

దశోపనిషత్తులు గురించి ఇక్కచదవండి 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow