శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, వ్రత కథలు

sathyanarayana swami vratham telugu

Nov 14, 2020 - 12:01
Jul 20, 2021 - 09:19
 1
శ్రీ సత్యనారాయణ స్వామి  వ్రతం, వ్రత కథలు
sathyanarayana swami vratham telugu

సత్యనారాయణ వ్రతంఅన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ.ఈ వ్రతాన్ని  విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం పొందగలరని హిందువుల విశ్వాసం. వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది.

వ్రత సామాగ్రి

  • పసుపు
  • కుంకుమ
  • తమలపాకులు
  • పోకచెక్కలు
  • అరటిపళ్ళు
  • నారికేళములు (కొబ్బరికాయలు)
  • మంటపం అలంకరణకు తువ్వాళ్ళు
  • మామిడి ఆకులు
  • దీపసామాగ్రి
  • పూజా సామాగ్రి
  • బియ్యం
  • కలశం
  • పంచామృతాలు
  • సత్యనారాయణ స్వామి ప్రసాదం
  • చిల్లర నాణెములు

వ్రత విశిష్టత, విధానము

ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును.

మాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభ దినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ద ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించ వచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను.

వ్రతమురోజు విధిగా చేయవలిసిన పనులు

ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్ధింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యా వందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత...
స్వామికి పూజ చేయవలెను.

పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్దికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల ముగ్గులు పెట్టవలెను. ఆ ముగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు.

కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.

పూజాక్రమము

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవ గ్రహములను, ఇంద్రాద్యష్టదిక్సాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన

చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్టించి పూజచేయవలెను.

నాలుగు వర్ణముల వారికి పూజావిధానము

బ్రాహ్మణ - క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక - పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశద్ధలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను.

శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్తాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే  !
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః !
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్‌ కామాంశ్చదేహిమే !!

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం!  కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్‌ !!

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

  1. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
  2. మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
  3. వామనాయ నమః, శ్రీధరాయ నమః,
  4. బుషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
  5. దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
  6. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
  7. అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
  8. అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
  9. అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
  10. ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః

యతళ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా! 

తయోః సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగళమ్‌ !! 

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః !

యేషా మిందీవర శ్యామో హృదయస్లో జనార్ధనః  !!

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం .!

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ !!

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే !

శరణ్యే త్రంబికే దేవి నారాయణి నమోస్తుతే !!

  • శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
  • ఉమామహేశ్వరాభ్యాం నమః
  • వాణీ హిరణ్యగర్చాభ్యాం నమః
  • శచీపురందరాభ్యం నమః  !
  • అరుంధతీ వశిష్టాభ్యాం నమః
  • శ్రీ సీతారామాభ్యాం నమః
  • నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
  • అయం ముహూర్తస్సుముహోర్తస్తు !!

ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః !
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే !!

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యా మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్చువస్సువరోమ్‌

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే, శోభ్నే, ముహూర్తే,

శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్థక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈళాన్వ (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే

కళ్ల /గంగా/గోదావర్వోర్యద్యదోశో (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి)

అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత బుతువు) బుతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే.

ఏవం గుణ విశేషణ విషిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్‌ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య

అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్టైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ధ్యర్థం,

ధన,కనక,వస్తు వాహనాది సమ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్థం, సర్వాపదా నివారణార్ధం,

సకల కార్యవిఘ్ననివారణార్థం

సత్సంతాన సిధ్యర్థం,

పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ దేవతా ప్రీత్యర్థం యావ ద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే
 

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః 

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః !

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా 

బుగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః !!

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాణ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

   నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు !


ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః 

 కలశోదకేన పూజా ద్రవ్యాణి దైెవమాత్మానంచ సంప్రోక్ష్య !!

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం : ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమతశ్రస్తవం ! జ్యేస్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్‌  !!

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః

పాదయోః పాద్యం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్హ్యం సమర్పయామి

శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి
( (అక్షతలు వేయవలెను నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః

వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి
(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్‌ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

  • ఓం సుముఖాయ నమః,
  • ఏకదంతాయ నమః,
  • కపిలాయ నమః,
  • గజకర్ణికాయ నమః ,
  • లంబోదరాయ నమః,
  • వికటాయ నమః,
  • విఘ్నరాజాయ నమః,
  • గణాధిపాయ నమః,
  • ధూమకేతవే నమః,
  • గణాధ్యక్షాయ నమః,
  • ఫాలచంద్రాయ నమః,
  • గజాననాయ నమః,
  • వక్రతుండాయ నమః,
  • శూర్చకర్ణాయ నమః,
  • హేరంబాయ నమః,
  • స్కందపూర్వజాయ నమః,
  • ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః
  • మహాగణాదిపతియే నమః

నానా విధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్చువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)


తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్‌ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం !

జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్‌ !!

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

  [పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.]

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

పంచలోకపాలక పూజ

ఆచమ్య, పూర్వోక్తెవంగుణ విశేషణ విషిష్టాయాం శుభతిథౌ,

శ్రీ సత్యనారాయణ వ్రతాంగత్వేన గణ పత్యాది పంచలోక పాలక పూజాం , ఆదిత్యాది నవగ్రహ పూజాం, ఇంద్రాద్యష్టదిక్పాలక పూజాం చ కరిష్యే..

ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం ,జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత ఆ న శృన్  వ  న్నూతి భిస్సీదసాదనమ్‌.

సాంగం సాయుధం సవాహనం సశక్తిం

పత్నీపుత్రపరివారసమేతం

గణపతిం లోక పాలక మావాహయామి,

స్థాపయామి, పుజయామి.

ఓం బ్రహ్మదేవానాం,పదవీః కవీనా మృషి ర్విప్రాణాం మహిషో మృగాణాం, శ్వేనో గృధ్రాణాగం స్వధితిర్వనానాగం సోమః పవిత్ర మత్యేతి రేభన్‌, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బ్రహ్మాణం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పుజయామి.

ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేథా నిదధే పదం, సమూఢ మస్యపాగం సురే. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం విష్ణుం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పుజయామి.

ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీడుషమూయ తవ్యసే, వోచేమ శంతమగం హృదే, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం రుద్రం లోక పాలక మావాహయామి,స్థాపయామి, పుజయామి.

ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సాచతుష్పదీ, అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమేవ్యోమన్‌. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గౌరీం లోక పాలిక మావాహయామి, స్థాపయామి,పుజయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాభ్యోనమః, ద్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్హ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్‌ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూప మషఘ్రాపయామి,దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాప్రసాద సిద్ధిరస్తు.

నవగ్రహ పూజ

సూర్య

అసత్యేనేత్యస్య మంత్రస్య హిరణ్యస్తూప బుషిః సవితా దేవతా, త్రిష్టు పృంద, యజమానస్య ధి దేవతా ప్రత్యధి దేవతా సహిత సూర్యగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే సూర్యగ్రహా రాధనే వినియోగః

శ్లో//వేదీ మధ్యే లలితకమలే కర్ణికాయాం రథస్థ
స్పష్తాశ్వోర్కోరుణరుచివపుస్స్పప్తరజ్ఞ్డు ర్థిబాహుః

గోత్రే రమ్యే బహువిధగుణే కాశ్యపాఖ్యే ప్రసూతః
కాళింగాఖ్యే విషయజనితః ప్రాజ్ముఖః పద్మహస్తః

శ్లో//పద్మాసనః పదమకరో ద్విబాహుః 
పద్మద్యుతి స్పప్తతురంగవాహః
దివాకరో లోకవపుః కిరీటి;
మయి ప్రసాదం విధదాతు దేవః

మం. అసత్యేన రజసా వర్తమానో, నివేశయన్న మృతం మర్త్యం చ,

హిరణ్యేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్‌ . ఓం భూర్భువస్సువః సూర్యగ్ర హేహాగచ్చ, సూర్యగ్రహం, రక్తవర్ణం, రక్త గంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచ్భత్ర ధ్వజపతకాది శోభితం, దివ్యరథసమారూఢాం, మేరుం ప్రదక్షిణీకుర్వాణం, ప్రాజ్ముఖం, పద్మాసనస్థం,ద్విభుజం, సుప్తాశ్వం, సప్తరజ్జుం, కళింగ దేశాధిపతిం, కాశ్యపగోత్రం, ప్రభవసంవత్సరే మాఘమాసే శుక్లపక్షే, సప్తమ్యాం, భానువాసరే అశ్వినీనక్షత్ర జాతం, సింహరాశ్యధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్మీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మి న్నదికరణే వర్తులాకారమండలే స్థాపయామి పూజయామి.

మం.

ఓం అగ్నిం దూతం వృణీమహే, హోతారం విశ్వవేదసం, అస్యయజ్ఞస్య సుక్రతుమ్‌. సూర్యగ్రహాధిదేవతాం అగ్నిం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పఠ్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య దక్షిణతః అగ్ని మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం కద్రుదాయ ప్రచేతసే మీధుషమూయ తవ్యసే, వోచేమ శంతమగం హృదే. సూర్యగ్రహ ప్రత్యధి దేవతాం రుద్రం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్ర మావాహయామి, స్థాపయామి, పూజయామి.


చంద్ర

ఆప్యాయ స్వేతస్య మంత్రస్య గౌతమబుషిః చంద్రో దేవతా గాయత్రీ ఛంద, యజమానస్యాధిదేవతా ప్రత్యధిదేవతాసహిత చం ద్రగ్రహప్రసాదసిద్ధర్థ్యే చందరగ్రహారాధనే వినియోగః .

శ్లో// ఆగ్నేయభాగే సరథోదశా శ్వశ్చాత్రేయజో యామునదేశజశ్చ, ! ప్రత్యజ్ముఖస్థ శృతురశ్రపీఠే గదాధరాంగో హిమవత్స్యభావః !!
శ్వేతాంబర శ్య్వేత్వపుః కిరీటి, శ్వేతద్యుతి ర్దండధరో ద్విబాహుః !!!! చంద్రో మృతాత్మా వరదః కిరిటీ , శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః !!!!!

ఓం అప్యాయస్వ సమేతు తే విశ్వత స్పోమవృష్టియం, భవవాజస్య సంగధే, ఓం భూర్భువస్సువః చంద్రగ్రహేహా గచ్చ. చంద్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేతమాల్యాంబరధరం, శ్వేతచ్భత్ర ద్వజపతాకాదిశోభితం, దివ్యరథసమారూఢం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం దశాశ్వరథవాహనం , ప్రత్యజ్మఖం, ద్విభుజం దండధరం, యామునదేశాధిపతిం, కిరీటినం సుఖాసీనం, పత్నీ పుత్ర పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహస్యాగ్నేయదిగ్భాగే, సమచతురశ్రమండలే స్థాపిత రజతప్రతిమారూపేణ చంద్రగ్రహ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం ఆపో మే సోమో అబ్రవీ దంతర్విశ్వాని భేషజ, అగ్నించ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేషజీః చంద్రగ్రహాధి దేవతాః సాంగాః సాయుధాః సవాహనాః సశక్తీః పుత్రపరివారసమేతాః చంద్రగ్రహస్య దక్షిణతః అపః మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ, అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమేవ్యోమన్‌. చంద్రగ్రహ ప్రత్యధి దేవతాం, సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పుత్రపరివారసమేతం చంద్రగ్రహస్యోత్తరతః గౌరీ మావాహయామి, స్థాపయామి,
పూజయామి.

అంగారక

అగ్నిర్మూర్ధేత్యస్య మంత్రస్య విరూప బుషిః అంగారక గ్రహో దేవతా, త్రిష్టు పృందః, యజమానస్య  ధిదేవతాప్రత్యధి దేవతా సహితాంగారక గరహ ప్రసాద సిద్ధ్యర్థే అంగారకగ్రహారాధనే వినియోగః

శ్లో// యామ్మ్యే గదాశ్మతి ధరష్ప శూలీ 
ప్వరప్రదో యామ్యుముఖో తిరక్తః
కుజ స్త్వ్వనంతీవిషయ స్త్రికోణ
స్తస్మిన్‌ భరద్వాజకులే ప్రసూతః
రక్తాంబరో రక్తవవుః కిరీటి చతుర్భుజో
మేషగమో గదాభృత్‌,
ధరాసుత శృక్తిధరశ్చ శూలీ సదా మమ స్యా ద్వరదః ప్రశాంతః

ఓం అగ్ని ర్మూర్డా దివః కకుత్పతిః పృథివ్యా ఆయం,అపాగం రేతాగంసిజిన్వతి, ఓం భూర్భువస్సువః అంగారకగ్ర హేహాగచ్చ, అంగారకగ్రహం, రక్తవర్ణం, రక్త గంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచృత్ర ధ్వజపతకాది శోభితం, దివ్యరథసమారూధాం, మేరుం
ప్రదక్షిణీకుర్వాణం,మేషవాహనం, దక్షిణాభిముఖం, చతుర్భుజం, గదాశులశక్తిధరం, అవంతీ దేశాధిపతిం, భారద్వాజసగోత్రం, రాక్షసనామసంవత్సరే ఆషాడమాసే శుక్లపక్షే దశమ్యాం భౌమవాసరే అనూరాధానక్షత్రజాతం, మేష వృష్పిక రాశ్యాధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్రపరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్ణ మస్మిన్నధికరణే, సూర్య గ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణకారమండలే స్థాపితతామ ప్రతిమారూపేణ అంగారకగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం స్యోనా పృథివి భవా నృక్షరా నివెశినీ, యచ్చాన శృర్మ సప్రధాః, అంగారక గ్రహస్య దక్షిణతః  పృథివీ దక్షిణతః పృథివీ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓమ్‌ క్షేత్రస్య పతినా వయుగం. హితం నేవ జయామసి, గా మశ్వం పోషయిత్నాా సనోమృదాతీ దృశే, అంగారకగ్రహప్రత్యధిదేవతాం, క్షేత్రపాలకం, సాంగం సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీపుత్రపరివారసమేతం, అంగారక గ్రహస్యోత్తరతః క్షేతపాలక మావాహయామి స్థాపయామి పుజయామి.

బుధ

ఉహృుధ్యస్వే త్యస్య మంత్రస్య, ప్రస్మణ్వ బుషిః, బుధగ్రహో దేవతా, త్రిష్టష్టందః యజమానస్యాధిదేవతా, ప్రత్యధిదేవతాసహిత బుధ గ్రహప్రసాదసిద్యర్థే బుధగ్రహారాధనే వినియోగః .

శ్లో//ఉడజ్ముఖో మాగధదెశజాత శ్చాత్రేయగోత్ర శృరమండలస్థః    సఖడ్గ చర్మోరుగదాధరోజ్జ స్త్రీశానభాగే వరదస్సు పీతః
 పీత్రాంబర పీతవపుః కిరిటీ చతుర్భుజో దండ ధరశ్చ సౌమ్యః   చర్మాసిధృక్పోమసుత్‌ స్సుమెరు స్సింహాధిరుఢో వరదో బుధశ్చ

ఓం ఉద్యుధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగం సృజాథామ యంచ, పునః కృణ్వగ్గ్‌ స్య్యాపితరం యువాన మన్వాతాగంసీ త్వయి తంతు మేతం , ఓం భూ ర్భువ స్సువః బుధగ్రహేహాగచ్చః బుధగ్రహం, పీతవర్దం ,పీతగంధం, పీతపుష్పం ,పీతమాల్యాంబరధరం, పీతచ్చత్ర
ధ్వజపతకాడి శోభితం, దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణికుర్వాణం సింహవాహనం, ఉదజ్ముఖం, మగధదేశాధిపతిం, చతుర్భుజం, ఖద్గచర్మాంబరధరం ఆత్రేయసగోత్రం, అంగీరసనామసంవత్సరే మార్గశిరమాసే శుక్షపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రా నక్షత్ర జాతం, మిథున కన్యా రాశ్యాధి పతిం కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్రపరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్టమస్మి న్నధికరణే సూర్యగ్రహస్య ఈశాన్యదిగ్భాగే బాణాకారమండరే, స్థాపితకాంస్యప్రతిఅమా రూపేణ బుధగ్రహ మావాహయామి స్థాపయామి
పూజయామి.

ఓం ఇదం విష్ణు ర్విచక్రమే, త్రేధా నిదధే పదం - సమూఢ ముస్యపాగంసురే, బుధగ్రహాధిదేవతాం,   విష్ణుం, సాంగాం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీపుత్రపరివారసమేతం, బుధగ్రహస్య   దక్షిణతః విష్ణు మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓమ్‌ సహస్రశీర్జా పురుషు, సహస్రాక్ష స్పహస్రపాత్‌, స భూమిం విశ్వతోవృత్వా,
అత్యతిష్టద్దశాంగులమ్‌, బుదగ్రహప్రత్యధిదేవతాం నారాయణం, సాంగాం సాయుధం సవాహనం
సశక్తిం పఠ్నీపుత్రపరివారసమేతం బుధగ్రహస్యోత్తరతః నారాయణ మావాహయామి, స్థాపయామి,
పూజయామి.

బృహస్పతి

బృహస్పతే అతియదర్యేత్యస్య మంత్రస్య, గృత్స్నమదబుషి, బృహస్పతి గ్రహోదేవతా, త్రిష్టుష్ఫందః,  యజమానస్య అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహప్రసాదసిద్యర్థే బృహస్పతి గ్రహారాధనే వినియోగః

శ్లో//సౌమ్యే సుదీర్లే చతురశ్రపీఠే రథేజ్ఞరాః పూర్వముఖస్వభావః
దండాక్షమా లాజలపాత్రదారీ సింధాఖ్యదేశే వరద స్సుజీవః
పీతాంబరః పీతవపుః కిరీటి చతుర్చ్భుజో దేవగురుః ప్రశాంతః
 

తథాసిదండం చ కమండలుం చ తథాక్ష సూత్రం వరదో స్తు మహ్యమ్‌.

ఓమ్‌ బృహస్పతె అతియదర్యో అర్హాద్యుమద్విభాతిక్రతుమజ్ఞనేషు, యద్దీదయచ్చవసర్త ప్రజాత తదస్మాను ద్రవిణం ధేహి చిత్రమ్‌ / ఓం భూ ర్ఫువ స్సువః బృహస్పతి గ్రహేహగచ్చ, బృహస్పతి గ్రహం, పీతవర్ణం,పీతగంధం, పీతపుష్పం,పీతమాల్యాంబరధరం, పీతచ్చత్ర ధ్వజపతకాడి శోభితం, దివ్యరథసమారూథఢం మేరుం ప్రదక్షిణికుర్వాణం , పూర్వాభిముఖం,పద్మాసనస్థం, చతుర్భుజం, దండాక్షమాలా ధారిణిం, సింధు ద్వీపదేశాధిపతిం, అంగీరసగోత్రం, అంగీరసనామసంవత్సరే వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం గురువాసరే ఉత్తరా నక్షత్రజాతం, ధనుర్శీనరాశ్యధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్ర పరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్టమస్మి న్నదికరణే సూర్య గ్రహస్యోత్తరదిగ్భాగే దీర్ణచతురస్రమండలే స్థాపిత త్రపుప్రతిమా రూపేణ బృహస్పతిగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమత స్సురచో వేన ఆవః, సబుధ్నియా ఉపమా అస్యవిష్టా స్పతశ్చ యోని మసత శ్చ వివః, బృహస్పతి గ్రహాధి దేవతాం బ్రహ్మాణం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మణ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం ఇంద్రం వో విశ్వత స్పరి హవామహే జనేభ్యః, అస్మాక మస్తు కేవలః, బృహస్పతి గ్రహ ప్రత్యధిదేవతాం, ఇంద్రం, సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య ఉత్తరతః ఇంద్ర మావాహయామి, స్థాపయామి, పూజయామి.

శుక్ర

శుక్రం తే అన్యదిత్యస్య మంత్రస్య, భరద్వాజ బుషి, శుకగ్రహో దేవతా, త్రిష్టుష్పందః, యజమానస్యాధిదేవతా ప్రత్యధిదేవతా సహితశుక్షగ్రహ ప్రసాదసిద్యర్థే శుక్రగ్రహారాధనే వినియోగః .

శ్లో//ప్రాచ్యాం భృగు ర్ఫ్భోజకటప్రదేశ స్స భార్గవః పూర్వముఖ స్వభావః
స పంచకోణేశ రథాధిరూఢో దండాక్ష మాలా వరదోంబు పాత్రః
శ్వేతాంబరః శ్వేతవపు: కిరీటి చతుర్భుజో దైత్యగురుః ప్రశాంతః
తథాసిదండం చ కమండలుం చ తథాక్షసూత్రం వరదో స్తు మహ్యమ్‌

ఓం శుక్రం తే అన్య ద్యజతం తే అన్య ద్విషురూపే అహనీ ద్యారివాసి, విశ్వా హి మాయా అవసి
 

స్వధా వో భద్రా తే పూష న్నిహ రాతి రస్తు.

ఓం భూ ర్ఫువ స్సువః శుక్ర గ్రహేహచ్చ, శుక్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వెతపుష్పం, శ్వెతమాల్యాంబరధరం, శ్వేతచృత్రధ్వజపతకాదిశోభితం, దివ్యరథసమారూధఢం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం, దండాక్షమాలా జటావల్మలదారిణం, కాంభోజ దేశాదిపతిం భార్గవసగోత్రం, పార్థివసంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే అష్టమ్యాం భృగువాసరే,

స్వాతీ నక్షత్రజాతం తులా వృషభరాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం, గరహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్యప్రాగ్భాగే పంచకోణాకార మండలె స్టాపిత సీస ప్రతిమారూపేణ శుక్ర గ్రహ మావాహ యామి స్థాపయామి పూజయామి.

ఓమ్‌ ఇంధ్రాణీ మాసు నారిషు సుపల్నీ మహ మశ్రవం,నహ్యస్యా అపరం చ న జరసా మరతే పతిః. శుక్రగ్రహాధిదేవతా మింద్రాణీం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పల్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం ఇంద్ర మరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబస్సుతస్య, తవ ప్రణీతీ తవ శూర శర్మన్నా వివాసంతి కవయ స్సుయజ్ఞాః . శుక్రగ్రహ ప్రత్యిదేవతాం ఇంద్రమరుత్వంతం సాంగాం  సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్రమరుత్వంత మావాహయామి, స్థాపయామి, పూజయామి.

శనైశ్చర

శమగ్ని రగ్నిభి రిత్యస్య మంత్రస్య, ఇళింబిషిబుషి, శనైశ్చరగ్రహో దేవతా, ఉష్టిక్కందః, యజమానస్యాధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహ ప్రసాద సిద్ధ్యర్థె శనైశ్చర గ్రహారాధనే వినియోగః .

శ్లో// చాపసానో గృధ్రరథ స్సువీలః ప్రత్యుజ్ముఖః కాశ్యపజర్‌ు ప్రతీచ్యాం   సశూలచాపేషువరప్రదశ్చ సౌరాష్ట్రదేశే ప్రభవశ్చ సౌరీ

నీలద్యుతి ర్నీలవపుః కిరీటీ

గృధ్రస్థితి శ్చాపకరో ధనుష్మాన్‌ 

చతుర్భుజ స్ఫూర్యసుతః

ప్రశాంత స్పచాస్తు మహ్యం వరమందగామీ.

ఓం శమగ్ని రగ్నిభి స్మర చృన్న స్తపతు సూర్యః, శంవాతో వా త్వరపా అపణ్రిధః, ఓమ్‌ భూ ర్భువ  స్సువః, శనైశ్చర గ్రహేహచ్చ, శనైశ్చరగ్రహం, నీలవర్ణం, నీలగందం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలచ్చత్రధ్వజపతాకాదిశోభితం, దివ్యరథసమారూధఢం,మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, చాపాసనస్థం, ప్రత్యజ్మఖం, గృధ్రరథం, చతుర్భుజం శూలాయుధధరం, సౌరావ్‌ట్రదేశాధిపతిం, కాశ్యపసగోత్రం, విభవనామసంవత్సరే, పౌష్యమాసే శుక్లపక్షే, నవామ్యం స్థిరవాసరే భరణీనక్షత్రజాతం మకరకుంభరాశయాధిపతిం, కిరీటినం, సుఖాసీనం,
పత్నీపుత్రపరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్ణ మస్మి న్నదికరణే సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధునురాకాం మండలే స్థాపితాయః ప్రతిరూపేణ శనైశ్చరగరహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం యమామ సోమగం సునుత యమాయ జుహుతా హవిః, యమగం హ యజ్ఞోగచ్చ త్యగ్నిదూతో అరం కృతః . శనైశ్చర్య గ్రహాధిదేవతాం యమం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం ప్రజాపతే న త్వదేతా న్యన్యో విశ్వాజాతాని పరి తా బభూవ, యత్కామాస్తే జహుమస్తన్నో అస్తు వయుగ్గ్‌ స్యామ పతయో రయీణామ్‌. శనైశ్చర గ్రహప్రత్యధి దేవతాం ప్రజాపతిం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పల్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్యోత్తరతః ప్రజాపతి మావాహయామి, స్థాపయామి, పూజయామి.

రాహు

కయానిశ్చిత్రేత్యస్య మంత్రస్య, వామదేవ బుషిః రాహుగ్రహో దేవతా, గాయత్రీ చృందః యజమానస్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహప్రసాదసిద్యర్ధే రాహుగ్రహారాధనే వినియోగః .

శ్లో//పైఠరీనసో బర్బరదేశజాత శ్మూర్చాసన స్పింహగత స్వభావః
యామ్యాననో నైర్‌ బుతిది క్కరాళో వరప్రద శ్శూల సచర్మఖద్గః
నీలాంబరో నీలవవుః కిరీటీ కరాళవక్రః కరవాలశూలీ

చతుర్భుజ శృర్మదరశ్చ రాహుస్సింహాధిరూఢో వరదో స్తు మహ్యమ్‌.

ఓం కయాన శ్చిత్ర అభువ దూతీ సదా వృధఃఅ స్పఖా, కయా శచిష్టయావృతా.

ఓం భూ ర్భువ  స్సువః రాహుగ్రహేహాగచ్చ, రాహుగ్రహం, నీలవర్ణం, నీలగందం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలచృత్రధ్వజపతాకాదిశోభితం, దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, నైర్‌ బుతి ముఖం, శూర్చాసనస్థం చతుర్భుజం కరాళవక్తం ఖద్గచర్మధరం
 

పైఠీనసగోత్రం బర్బరదేశాదిపతిం రాక్షసనామసంవత్సరే భాద్రపదమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం భానువాసరే విశాఖా నక్షత్రజాతం సింహ రాశ్యాధి పతిం కిరీటినం సుఖాసీనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గరహమందలే ప్రవిష్ట మస్మి న్నదికరణే సూర్యగ్రహన్య నైఋతి దిగ్బాగే శూర్చాకార మండలే స్థాపిత లోహప్రతిమారూపేణ రాహుగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం ఆయుం గౌః పృళశ్ని రక్రమీ దసద న్మాతరం పునః, పితరం చ ప్రియంత్సువః, రాహు గ్రహాధిదేవతాం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పఠ్నీపుత్రపరివారసమేతం రాహుగ్రహస్య దక్షిణతః గా మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం నమో అస్తు సర్పేభ్యో యే కేచ పృథివీ మను, యేంతరిక్షేయే దివి తేభ్య స్సర్చేభ్యో నమః .రాహుగ్రహప్రత్యాధిదేవతా సాంగాన్‌ సాయుధాన్‌ సవాహనాన్‌ సశక్తి పత్నీపుత్రపరివారసమేతాన్‌ రాహుగ్రహస్య ఉత్తరతః సర్పా నావాహయామి, స్థాపయామి, పూజయామి.

కేతు

కేతుం కృణవన్నిత్యస్య మంత్రస్య, మధుచ్చంద బుషిః కేతుగణో దేవతా గాయత్రీ చృందః,
యజమానస్యాధిదేవతా ప్రత్యధిదేవతాసహిత కేతుగణ ప్రసాద సిద్ద్యర్ధే కేతుగణారాధనే వినియోగః .

శ్లో//ధ్వజాసనో జైమిని గోత్రజోంర్వేదేషు దేశేషు విచిత్రవర్దః
యామ్యాననో వాయుదిషః ప్రఖడ్గచర్మాసిభి శ్చాష్టసుతశ్చ కేతుః
ధూమైో ద్విబాహు ర్వరదో గదాభృద్ధృద్రాసనస్థో వికృతాననశ్చ
కిరీటకేయూర విభూష్తాంగ స్సచాస్తు మె కేతుగణః ప్రశాంతః

ఓం కేతుం కృణ్వ న్నకేతవే పేషో మర్యా అపేషసే, సముషద్భి రజాయథాః, ఓం భూ ర్ఫువ స్సువః కేతుగణేహాగచ్చ . కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం, చిత్రపుష్పం, చిత్రమాల్యాంబరధరం, చిత్రచృత్రధ్వజపతకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుమ ప్రదక్షిణీ కుర్వాణం ధ్వజాసనస్థం దక్షిణాఖిముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహు గదాధారం జైమిని గోత్రం రాక్షస నామ సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యా మిందువాసరే రేవతీనక్షత్రజాతం కర్కాటక రాశ్యాధిపతిం సింహాసనాసీనం గ్రహమండలే ప్రవిష్ట మస్మి న్నధికరణే సూర్యగ్రహస్య వాయువ్యదిగ్బాగే ధ్వజాకార మండలే స్థాపిత పంచలోహప్రతిమా రూపేణ కేతుగుణ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం సచితచిత్రం చితయంత మస్మే చిత్రక్షత చిత్రతమం వయీఓధాం,చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్దృణతే దువస్వ.కెతుగణాధిదేవతాం చిత్రగుప్తం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పల్నీపుత్రపరివారసమేతం కేతుగణస్య దక్షిణతః చిత్రగుపత మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం బ్రహ్మదేవానాం పదవీః కవీనా మృషి ర్విప్రాణాం మహిషో మృగాణాం, శ్యేనో గృధ్రాణాగం స్వధితి ర్వనానాగం సోమః పవిత్ర మత్యేతి రేభన్‌.కేతుగణప్రత్యధిదేవతాం బ్రహ్మణం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగణస్యోత్తరతః బ్రహ్మాణ
మావాహయామి, స్థాపయామి, పూజయామి.

అధిదేవతా ప్రత్యధిదేవతాసహితాదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః, ద్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమృయామి,పాద్యం సమృయామి, అర్హ్యం సమృయామి, ఆచమనీయం సమ్రయామి, స్నానం సమృయామి, శుద్దాచమనీయం సమ్రయామి, వస్త్రం సమర్ప  యామి, యజ్ఞోపవీతం సమ్రయామి, గంధం సమ్రయామి,అక్షతాన్‌ సమ్పయామి, పుష్పాణి సమ్పయామి, ధూప మాఘ్రాప యామి, దీపం దర్శయామి.నైవేద్యం సమృయామి, తాంబూలం సమ్రయామి, మంత్రపుష్పం సమృ్పయామి.

అధిదేవతా ప్రత్యధిదేవతాసహితాదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాదసిద్ధి రస్తు.


ఇంద్రాద్యష్టదిక్సాలక పూజ

ఓం ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః, అస్మాకమస్తు కేవలః,

సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం

పత్నీపుత్ర పరివార సమేతం

ఇంద్ర దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం; అస్యయజ్ఞస్య సుక్రతుమ్‌.సాంగాం  సాయుధాం సవాహనం సశక్తిం పల్నీపుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓం యమాయ సోమగం సునుత యమాయ జుహుతాహవిః, యమగం హయజ్డో గచ్చ త్యగ్నిదూ తో అరంకృతః,

సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం

పత్నీపుత్ర పరివార సమేతం

యమం దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓమ్‌ మూషుణః పరా పరానిరృతి ర్రుహణా వధీత్‌, పదీష్ట తృష్టయూ సహ, సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం పలత్నీపుత్ర పరివార సమేతం నిర్‌ బుతిం దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓం ఇమం మే వరుణ శ్రుధీ హవ మద్యా చ మృడయ, త్వామవస్యురాచకే. సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం వరుణం దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓం తవవాయ వృతస్పతే త్వష్టుర్దామాత రద్భుత, ఆవాంస్యా వృణీమహే. సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం వాయుం దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓం సోమో ధేనుగం సోమో అర్వంత మాశుగం సోమో వీరం కర్మణ్యం దదాతు, సాదన్యం వితథ్యగం సభేయం పితు శృవణం యో దదాశదస్మె. సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం కుబేరం దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓం తమీశానం జగతస్తస్థుషప్పతిం ధియం జిన్న్వమవసే హూమహేవయం, పూషానో యథా వేదసామ సద్వృధే రక్షితాపాయు రదబ్ద స్ప్వస్తయే. సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార ఈశానం ఇంద్రం దిక్పాలక మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఇంద్రాద్యష్టదిక్పాలకదేవతాభ్యోనమః ధ్యాయామి,అవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్హ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నపయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్‌ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి,తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.

ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతాప్రసాద సిద్ధిరస్తు.

ప్రాణప్రతిష్టపన మంత్రము

పంచామృత శోధనమ్‌

(సత్యనారాయణ ప్రతిమన తమలపాకుపై ఉంచి ఈ క్రింది విధముగా పంచామృతములతో
శోధనము చేయవలెను. )

ఆప్యాయ స్వేతి క్షీరమ్‌, ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్పోమ వృష్టియం, భవావాజస్య సంగధే.

1. దధిక్రావ్‌ ణ్లో ఇతి దధి, దధిక్రావ్‌ శ్లో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః, సురభినో ముఖాకార త్రణ  ఆయూగంపషి తారిషత్‌.

2. శుక్రమసీత్యాజ్యం; శుక్ర మసి జ్యోతి రసి తేజోసి దేవో వస్సవితోత్సునా
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రళ్ళిభిః.

3. మధు వాతా బుతాయతే ఇతి మధు; మధు వాతా బుతాయతే మధు క్షరంతి సింధవః . మాధ్వీ ర్న స్సంత్వోషధీః, మధు నక్త ముతోషసి మధుమ త్చార్ధివగం రజః, మధు దౌరస్తునః పితా, మధుమాన్నో వనస్పతి ర్మధుమాగం అస్తు సూర్యః, మాధ్వీ ర్ధావో భవంతు నః.

4. స్వాదుః పవస్వ దివ్యాయ జన్ననే స్వాదు రింద్రాయ సుహవేతు నామ్మే, స్వాదు ర్మిత్రాయ వరుణాయ వాయవే - బృహస్పతయే మధుమాగం అధాభ్యః .

తాశ్ళర్క్మరాభవం స్తచ్చర్మరాణాగం శర్కరత్వం వజ్రో వైశర్మరాః పశురగ్నిర్యచ్భర్మరాభి రగ్నిం పరిమినోతి వజ్రేణై వాస్మెపశూన్‌ పరిగృహ్హాతి తస్మాద్వజేణ పశవః పరిగృహీతాస్తస్మాత్‌ స్టేయాన స్తేయ సోనోప హరతి. అత్ర సప్తాభిః పశుకామస్య. (ఇతి శర్మరా)

5. యాఃఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చపుప్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగ్‌ హసః ( ఇతి ఫలోదకం = పండ్లరసం, లేక కొబ్బరినీళ్ళు )

ఇతి పంచామృతస్నానం.

అపోహిష్టితి శుద్దోదకస్నానం, అపోహిష్టామయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే, యో వశ్శివతమోరస స్తస్యభాజయతేహనః ఉశతీరివ మాతరః, తస్మా అరంగ మామవో యస్యక్షయాయ జిన్వథ, అపో జనయథా చ నః .

ప్రాణప్రతిష్థాపన

ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్టాపన మహామంత్రస్య, బ్రహ్మవిష్ణు మహేశ్వరా బుషయః, బుగ్యజుస్సామాథర్వణాని ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరా దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః క్రోం కీలకం, శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్టా సిద్ధ్యర్తే జపే వినియోగః హ్రూం అంగుష్టాభ్యాం నమః, హ్రీం
తర్జినీభ్యాం నమః, హూం మధ్యమాభ్యాం నమః, హైం అనామికాభ్యాం నమః, హ్రౌం కనిష్టికాభ్యాం నమః, హః కరతలకరపృష్థాభ్యాం నమః, హైం హృదయాయ నమః, హ్రీం హిరసే స్వాహా, హ్రూం శిఖాయై వషట్‌, హైం కవచాయ హుం, హ్రౌం నేత్రత్రయాయ వౌషట్‌. హః అస్తాయ ఫట్‌, ఓం భూర్భువ స్సువ రోమితి దిగ్భంధః.

ధ్యానమ్‌

శ్లో // శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం !

 విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం  !!

లద్ష్మ్మకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం !!! 

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్‌.!!!!

ఓం హ్రాం హ్రీం కోో యం రం లం వం శం షం సం హం ళం క్షం  శ్రీ సత్యనారాయణ సర్వేంద్రియాణి వాజ్మనశ్చక్షుశృోత జాహ్వాఘ్రాణా ఇహైవాగత్య సుఖం చిరం తిష్టంతు స్వాహా,

ఓం అసునీ తే పున రస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధేహి భోగం జ్యో కృశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయా న స్సస్తి / అమృతం వై ప్రాణాః అమృత మాషః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే.సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపరివారసమేతం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామిన మావాహయామి, స్థాపయామి, పూజయామి.

(సమాప్తం)

శ్రీ సత్యనారాయణ పూజ

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్పమాణ్రితః ! మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః !!

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా!!! బుగ్వేదోథ యజుర్వేద సృామవేదోహ్యథర్వణః !!!!

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే వైవ గోదావరి సరస్వతి ! నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు!!

ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః!!! కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య!!!!

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా, పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.)


ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో // థ్యాయే తృత్యం గుణాతీతం గుణత్రయసమన్వితం, 
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్‌
పీతాంబరం నీలవర్దం శ్రీవత్సపదభూషితమ్‌
గీవిందం గోకులానందమ్‌ బ్రహ్మా దైర్యభిపూ జితమ్‌


శ్రీ రమా సత్యనారాయణస్వామినే నమః ధ్యాయామి.

(పుష్పము వేయవలెను).


ఆవాహనం:

ఓం సహస్రశీర్‌ షా పురుషు, సహస్రాక్ష స్పహస్రపాత్‌, స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ట ద్ద్హశాంగులమ్‌.

శ్లో // జ్యోతి శాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృద్ద్యానగమ్యం!!
సాంగం శక్తిం సాయుధం భక్తసేవ్యం సర్వాకారం విష్ణు మావాహయామి.!!!!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ఆవాహయామి.

(పుష్పము వేయవలెను).


ఆసనం:

ఓంపురుష ఏవేదగం సర్వం, య దూతం యచ్చ భవ్యం, ! 
ఉతామృతత్వ స్యేశానః యదన్నేనాతి రోహతి. !!


శ్లో// కల్పద్రుమూలే మణివేదిమధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం !
 విచిత్ర వస్తావృత మచ్యుత ప్రభో - గృహాణ లక్ష్మీ ధరణీ సమన్విత !!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః రత్న సింహాసనం సమర్పయామి.

(అక్షతలు వేయవలెను.)


పాద్యం:

ఏతావా నస్య మహిమా, అతో జ్యాయాగ్‌ శృపూరుషు, పాదోస్య విశ్వభూతాని, త్రిపాదస్యామృతం దివి.

శ్లో// నారాయణ నమోస్తుతే నరకార్ణవతారక ! పాద్యం గృహేణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధ్థయ !!

శ్రీ రమా సత్యనారాయణ అవామినే నమః,!!! పాదయోః పాద్యం సమర్పయామి. !!!!

(నీరు చల్లవలెను.)

అర్హ్యం:

త్రిపాదూర్ధ్య ఉదైత్స్పురుషు, పాదో స్యేహాభవాత్సున:,తతోవిష్వజ్‌ వ్యక్రామత్‌, సాశనానశనే అభి.

శ్లో // వ్యక్తావ్యక్తస్వరూపాయ హృషీకపతయే నమః ! మయా నివేదితో భక్త్యా హ్యర్హ్యోయం ప్రతిగృహ్యతామ్‌ !!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, !!! హస్తయో రర్హ్యం సమర్పయామి. !!!!

(నీరు చల్లవలెను.)

ఆచమనం:

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.

తస్మా ద్విరా డజాయత, విరాజో అధిపూరుషు, స జాతో అత్యరిచ్యత, పశ్చా ద్భూమి మథో పురః.

శ్లో// మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం!  శుభం తదిదం కల్పితం దేవ సమ్య గాచమ్యతాం విభో !!
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

స్నానం:

యత్స్పురుషేణ హవిషా, దేవా యజ్ఞ మతన్వత, వసంతో అస్యాసీదాజ్యం, గ్రీష్మ ఇధ్మ శృర ద్ధవిః.

శ్లో // తీర్టోదకైః కాంచనకుంభసంసైై స్సువాసితైర్దేవ కృషారసార్డెః !
మయార్చితం స్నానవిధిం గృహాణ పాదాబ్దనిఘ్ట్యాతనదీప్రవాహ !!


శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, స్నానం సమర్పయామి. 
(నీరు చల్లవలెను.)
శుదోదకస్నానం:

అపోహిష్టామయోభువ స్తాన ఊర్జే దధా తన:, మహేరణాయ చక్షసే, యో వశ్శివతమోరస స్తస్యభాజయతేహనః ఉశతీరివ మాతరః, తస్మా అరంగ మామవో యస్యక్షయాయ జిన్వథ, అపో జనయథా చ నః.

శ్లో// నదీనాం చైవ సర్వసా మానీతం నిర్మలోదకం! స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర !!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, శుద్దోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం సుద్దాచమనీయం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)


వస్త్రం:

సప్తాస్యాస న్పరిధయః, త్రిస్సప్త సమిధః కృతాః, దేవాయ ద్యజ్ఞం తన్వానాః, అబధ్న స్పురుషం పశుమ్‌.

శ్లో// వేదసూక్తసమాయుక్తే యజ్ఞసామ సమన్వితే !

సర్వవర్ణప్రదే దేవ వాససీ ప్రతిగృహ్యతామ్‌!!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్ష్మ, పురుషం జాతమగ్రతః, తేన దేవా అయజంత, సాధ్యా బుషయశ్చ యే.


శ్లో // బ్రహ్మవిష్ణు మహేశైశ్చ నిర్మితం బ్రహ్మసూత్రకం ! గృహాణ భగవన్‌ విష్ణో సర్వేష్టఫలదో భవ!!


శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

తస్మా ద్యజ్ఞా త్సృర్వ హుతః, సంభృతం పృషదాజ్యం, పశూగ్‌ స్తాగ్‌ శృక్రేవాయవ్యాన్‌, అరణ్యాన్‌ గ్రామాశృయే.

శ్లో // శ్రీఖండం చందనం దివ్యం గంధాధ్యం సుమనోహరం !
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌ !!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, దివ్య శ్రీ చందనం సమర్పయామి.

(గంధం చల్లవలెను.)

ఆభరణములు:

తస్మా ద్యజ్ఞా త్సృర్వహుతః, బుచ స్సమాని జజ్ఞిరే తస్మాత్‌, తస్మా జ్ఞాతా ఆజావయః.


శ్లో// మల్లికాది సుగంధీని మాలత్యాదీనివై ప్రభో ! మయాహృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతామ్‌!! 


శ్రీ రమా సత్యనారాయణ అవామినే నమః, పుష్పాని సమర్పయామి.

(పుష్పములు సమర్పించవలెను)

పుష్పసమర్పణం (పూలమాలలు):
 

తస్మాదశ్వా అజాయన్త| యేకేచో భయాదతః॥|

గావోహజిజ్జిరే తస్మాత్‌! యస్మాజ్ఞాతా అజావయః

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, పుష్పె పూజయామి

తులసీ కుందమన్దార పారిజాతాం బుజైర్యుతాం!

వనమాలాం ప్రదాస్యామి గృహాన జగదీస్వరా !!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, వనమాలాం సమర్పయామి

(పుష్పాములు వేయవలెను)

అథాంగపూజా:

  1. ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి 
  2. ఓం గోవిందాయ నమః, గుల్ఫౌ పూజయామి
  3. ఓం అనఘాయ నమః, జానునీ పూజయామి
  4. ఓం ఇందిరాపతయే నమః, జంఘే పూజయామి
  5. ఓమ్‌ జనారధనాయ నమః, ఊరూ పూజయామి
  6. ఓమ్‌ జనార్ధనాయ నమః, కటిం పూజయామి
  7. ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః, ఉదరం పూజయామి
  8. ఓం లక్ష్మీవక్షస్సృలాలయాయ నమః, హృదయం పూజయామి
  9. ఓం శంఖచక్రగదా శార్‌ బి పాణయే నమః, బాహున్‌ పూజయామి
  10. ఓం కంబుకంఠాయ నమః, కంఠం పూజయామి
  11. ఓం కుందకుట్మ్టలదంతాయ నమః, దంతా న్పూజయామి
  12. ఓం పూర్ణేందు నిభ వక్షాయ నమః. వక్త్రం పూజయామి
  13. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః, నాసికం పూజయామి
  14. ఓం సూర్యాచంద్రాగ్ని ధారిణే నమః, నేత్రే పూజయామి
  15. ఓం సహస్రశిరసే నమః, శిరః పూజయామి
  16. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ,

సర్వాంణ్యంగాని పూజయామి.

[తదుపరి ఇక్కడ స్వామి అష్టోత్తరము చదువవలెను.]
 

తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను

ధూపం:

య త్పురుషం వ్యదధుః, కతిధా వ్యకల్పయన్‌, ముఖం కి మస్య కౌ బాహూ, కా వూరూ పాదా వుచ్చ్యేతే.

శ్లో// దశాంగం గగ్గులూపేతం సుగంధం సుమనోహరం,  ధూపం గృహాణ దేవేశ సర్వ దేవనమస్కుత.

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ధూప మాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)


దీపం:

బ్రాహ్మణోస్య ముఖ మాసీత్‌, బాహూరాజన్యః కృతః ఊరూ త దస్య య ద్వెశ్యః, పద్భ్యాగం శూద్రో అజాయుత

శ్లో// ఘృతత్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం ! దీపం గృహాణ దేవేశ తైలోక్యతిమిరాపహమ్‌!!

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, దీపం దర్శయామి. దూపదీపానంతరమ్‌ శుద్దాచమనీయం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను మ్రోగించ వలెను )


నైవేద్యం:


చంద్రమా మనసో జాటహః, చక్షో స్ఫూర్యో అజాయుత, ముఖా దింద్ర శ్చాగ్నిశ్చ, ప్రాణా ద్వాయు రజాయత.

శ్లో// సౌవర్ణస్థాలిమధ్యే మణిగణఖచితే గోఘృతాతాన్‌ సుపక్వాన్‌ ! భక్ష్యాన్‌ భోజ్యాంశ్చ లేహ్యా నపరిమితరసాన్‌ చోష్య మన్నం నిధాయ,!!
నానాశాకై రుపేతం దధిమధు సగుడ క్షీర పానీయయుక్తం !!! తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివస మహం మానసే కల్పయామి.!!!!
 

రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్యసమన్వితం, ఘృత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతి గృహ్యతామ్‌.

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్‌, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, మహా నైవేద్యం సమర్పయామి

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి

హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:

నాభ్యా ఆసీ దంతరిక్షం, శీర్ణో దౌ స్పమవర్తత,

పద్భ్యాం భూమి ర్థిశ శ్రోత్రాత్‌, తథా లోకాగం అకల్పయన్‌

శ్లో // పూగీఫలై స్పకర్పూరై ర్నాగవల్లీదళై ర్యుతం

ముక్తాచూర్ణ్జ సమాయుక్తం తాంబూలం ప్రిగృహ్యతామ్‌.

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

ఓం వెదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్థం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్యధీరః,
 

నామాని కృత్వాభివదన్‌ యదాస్తే.  నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే. జాతాం జనిష్యమాణాం చ. అమృతే సత్యే ప్రతిష్టితాం,

అథర్వపితుం మే గోపాయ. రసమన్న మిహాయుషే, అదబ్ధాయో శీతతనో. అవిషం నః పితుం కృణు.  శగ్గ్‌ స్య పశూన్‌ మే గోపాయ. ద్విపాదోయే చతుష్పదః. అష్టాశఫాష్ప య ఇహగ్నే. యే చైకశఫా అశుగాః. సప్రథ సభాం మే గోపాయ. యే చ సభ్యాస్సభాసదః. తా నింద్రియావతః కురు. సర్వ మాయు రు పాసతాం. అహే బుధ్నియ మంత్రం మే గోపాయ, యమృషయ సైవిదా విదుః. బుచ స్సామాని యజూగంషి, సాహి శ్రీ రమృతాసతామ్‌. మానో హిగంసీ జ్ఞాతవేదో గా మశ్వం పురుషం జగత్‌ అభిభ్ర దగ్న అగహి శ్రియా మా పరిపాతయ, సమ్రాజం చ విరాజం చ అభిశ్రీ ర్యాచ నో గృహే. లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సగం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు.

శ్లో// నీరాజనం గృహణేదం పంచవర్తి సమన్వితం ! తేజోరాశిమయం దత్తం గృహాణ త్వం సురేశ్వర. !!
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః !!!

కర్పూర నీరాజనం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)


మంత్రపుష్పమ్‌:

ఓం ధాతా పురస్తాద్యముదాజహార, శక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశ శ్చృతస్రః  తమేవం విద్యానమృత ఇహ భవతి,! నాన్యః పంథా అయనాయ విద్యతే. ! 

ఓం సహస్ర శీర్‌ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం, I విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం. II విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం.III విశ్వమేవేదం పురుషస్త ద్విశ్వముఅపజీవతి,IIII

పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం  I  నారాయణం మహాజ్జేయం విశ్వాత్మానం పరాయణం,
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః, I నారాయణ పరంబ్రహ్మ తత్త్వం నారాయణః పరః I నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః I యచ్చకించిజ్ఞగ త్సర్వం దృశ్యతే శ్రూయతే పివా,I అంతర్భహిశ్చ త త్సర్యం వ్యాప్య నారాయణ స్నితః 

అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం Iపద్మకోశ ప్రతీకాశగం హృదయం చాపష్యధోముఖం, I అధోనిష్ట్యా వితస్యాన్తే నాభ్యాముపరి తిష్టతి,I జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్‌,Iసన్తతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.I తస్యాన్తే సుషిరగం సూక్ష్మం తస్మిన్‌ త్సర్వం ప్రతిష్టతం, Iతస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖ:. I

సోగ్రభు గ్విభజ న్తిష్ట న్నాహార మజరః కవిః I తిర్యగూర్ధ్య మధశ్శాయీ రశ్మయస్తస్య సంతతా, I సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తగః, I  తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ట్వా వ్యవస్థితః, I నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా, I నీవారశూకవ త్తన్వీ పీతా భాస్వత్యణూపమా, I తస్య శిభాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః, I స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్ఫోక్షరః పరమః స్వరాట్‌. I రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే, I

నమో వయం వై శ్రవణాయ కుర్మహే I స మే కామా న్మామకామాయ మహ్యం I కామేశ్వరోవైశ్రవణో దదాతు. I కుబేరాయవైశ్రవణాయ, మహారాజాయ నమః I తద్విష్టా పరమం పదగం సదా పశ్యంతి సూరయః, దివీచ చక్షురాతతం, I తద్విప్రాసో విపన్యవో జాగృవాంస స్పమింధతే విష్టోర్యత్సరమం పదమ్‌. I నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ I

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. I
(అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో//

యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ    తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే   పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ  !త్రాహిమాం కృపయా దేవ !  శరణాగత వత్సల  !అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ !! తస్మాత్‌ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన !!  ప్రదక్షిణం కరిష్యామి సర్వభమనివారణం. సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో. 


శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి. ఛత్రం ధారయామి చామరైః ధారయామి గీతం శ్రావయామి నృత్యం శ్రావయామి ఆందోళికా మారోపయామి  సమస్త రాజోపచారాన్‌ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, సాష్టాంగనమస్మ్కారన్‌ సమర్పయామి
 

అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం, I హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్‌. I సగుణం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం I జనార్దనం జనానందం జానకీవల్లభం హరిమ్‌. I ప్రణమామి సదా భక్తా నారాయణ మజం పరం, I దుర్గమే విషమే ఘోరే శత్రుణా పరిపీడితమ్‌. I నిస్తారయతు సర్వేషు తథా నిష్టభయేషు చ I నామాన్యేతాని సంకీర్త్య ఫల మీప్సిత మాప్షుయాత్ I సత్య్నారాయణం దేవం వందేహం కామదం ప్రభుం, I లీలయా వితతం విశ్వం యేన తస్మె నమోనమః. I

శ్రీ రమాసత్యనారాయణ స్వామినే నమః * ప్రార్థనా నమస్కారాన్‌ సమర్పయామి.

సర్వోపచారాలు:

చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి, I గీతంశ్రాపయామి ,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి. Iశ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వోపచారాన్‌ సమర్పయామి

ఫలమ్‌

ఇదం ఫలం మయా స్టాపితం పురతస్తవ.

తేన మే సఫలా వాప్తి రృవే జ్ఞన్మని జన్మని

శ్లో// యస్య స్కృత్యా చ నమోక్సా తపః పూజా క్రియాదిషు, I న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్‌.

క్షమా ప్రార్థన:


(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)

  • మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన I 
  • యాత్స్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే I
  • అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్‌ సర్వాత్మక I

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః

శ్రీ రమా సత్యనారాయణ స్వామి పూజావిధానం సంపూర్ణం

(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను).

అకాల మృత్యుహరణమ్‌ సర్వవ్యాది నివారణం !! సర్వపాపక్షయకరం శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభమ్‌ !!!!

(శ్రీ రమా సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)


అష్టోత్తర శతనామావళి

  1. ఓం నారాయణాయ నమః
  2. ఓం నరాయ నమః
  3. ఓం శౌరయే నమః
  4. ఓంచక్రపాణయే నమః
  5. ఓం జనార్దనాయ నమః
  6. ఓం వాసుదేవాయ నమః
  7. ఓం జగద్యోనయే నమః
  8. ఓం వామనాయ నమః
  9. ఓం జ్ఞానపంజరాయ నమః
  10. ఓం శ్రీవల్లభాయ నమః
  11. ఓం జగన్నాథాయ నమః
  12. ఓం చతుర్మూర్తయే నమః
  13. ఓం వ్యోమకేశాయ నమః
  14. ఓం హృషీకేశాయ నమః
  15. ఓం శంకరాయ నమః
  16. ఓం గరుడధ్వజాయ నమః
  17. ఓం నారసింహాయ నమః 
  18. ఓం మహాదేవాయ నమః
  19. ఓం స్వయంభువే నమః
  20. ఓం అచ్యుతాయ నమః
  21. ఓం శంఖపాణయే నమః
  22. ఓం పార్థసారధయే నమః
  23. ఓం పరంజ్యోతిషే నమః
  24. ఓం ఆత్మజ్యోతిషే నమః
  25. ఓం అచంచలాయ నమః
  26. ఓం శ్రీవత్సాంకాయ నమః
  27. ఓం అభిలాధారాయ నమః
  28. ఓం సర్వలోకపతయే నమః
  29. ఓం ప్రభవే నమః
  30. ఓం త్రివిక్రమాయ నమః
  31. ఓం త్రికాలజ్ఞానాయ నమః
  32. ఓం త్రిధామ్నే నమః
  33. ఓం కరుణాకరాయ నమః
  34. ఓం సర్వజ్ఞాయ నమః
  35. ఓం సర్వగాయ నమః
  36. ఓం సర్వస్మె నమః
  37. ఓం సర్వేశాయ నమః
  38. ఓం సర్వసాక్షికాయ నమః
  39. ఓం హరయే నమః
  40. ఓం భువనేశ్వరాయ నమః
  41. ఓం శ్రీధరాయ నమః
  42. ఓం దేవకీపుత్రాయ నమః
  43. ఓం హలాయుధాయ నమః
  44. ఓం సహస్రబాహవే నమః
  45. ఓం అవ్యక్తాయ నమః
  46. ఓం సహస్రాక్షాయ నమః
  47. ఓం అక్షరాయ నమః
  48. ఓం క్షరాయ నమః
  49. ఓం గజారిఘ్నాయ నమః
  50. ఓం కేశవాయ నమః
  51. ఓం కేశిమర్దినాయ నమః
  52. ఓం కైటభారయే నమః
  53. ఓం అవిద్యారయే నమః
  54. ఓం కామదాయ నమః
  55. ఓం కమ్లేక్షణాయ నమః
  56. ఓం హంసశత్రవే నమః
  57. ఓం అధర్మశత్రవే నమః
  58. ఓం కాకుత్భాయ నమః
  59. ఓం ఖగవాహనాయ నమః
  60. ఓం నీలాంబుదద్యుతయే నమః
  61. ఓం శారిజ్ఞణే నమః
  62. ఓం హరయే నమః
  63. ఓం శేషాయ నమః
  64. ఓం పీతవాసనే నమః
  65. ఓం గుహశ్రయాయ నమః
  66. ఓం వేదగర్భాయ నమః
  67. ఓం విభవే నమః
  68. ఓం విష్ణవే నమః
  69. ఓం శ్రీమతే నమః
  70. ఓం తైలోక్యభూషణాయ నమః
  71. ఓం యజ్ఞమూర్తయే నమః
  72. ఓం అమేయాత్మనే నమః
  73. ఓం వరదాయ నమః
  74. ఓం వాసువానుజాయ నమః
  75. ఓం జితేంద్రియాయ నమః
  76. ఓం జితకోధాయ నమః
  77. ఓం సమదృష్టయే నమః
  78. ఓం సనాతనాయ నమః
  79. ఓం భక్తప్రియాయ నమః
  80. ఓం జగత్పూజ్యాయ నమః
  81. ఓం పరమాత్మనే నమః
  82. ఓం నిత్యాయ నమః
  83. ఓం నిత్యతృప్తాయ నమః
  84. ఓం నిత్యానందదాయ నమః
  85. ఓం సురాధ్యక్షాయ నమః
  86. ఓం నిర్వికల్పాయ నమః
  87. ఓం నిరంజనాయ నమః
  88. ఓం బ్రహ్మణ్యాయ నమః
  89. ఓం పృథీవీనాథాయ నమః
  90. ఓం నిష్కళంకాయ నమః
  91. ఓం నిరాభాసాయ నమః
  92. ఓం నిష్రపంచాయ నమః
  93. ఓం నిరామయాయ నమః
  94. ఓం భక్తవశ్యాయ నమః
  95. ఓం మహోదరాయ నమః
  96. ఓం అసురాంతకాయ నమః
  97. ఓం సర్వలోకనామంతకాయ నమః
  98. ఓం అనంతాయ నమః
  99. ఓం అనంతవిక్రమాయ నమః
  100. ఓం మయాధారాయ నమః
  101. ఓం నిరాధారాయ నమః
  102. ఓం సర్వాధారాయ నమః
  103. ఓం దరాధారాయ నమః
  104. ఓం పుణ్యకీర్తయే నమః 
  105. ఓం పురాతనాయ నమః
  106. ఓం త్రికాలజ్ఞాయ నమః
  107. ఓం విష్టరశ్రవసే నమః
  108. ఓం చతుర్భుజాయ నమః

సత్యనారాయణ వ్రత కథ - ప్రథమోధ్యాయః

శ్లో// ఓం శుక్తాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌, 
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయే //

శ్రీమంతమైన నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు,తమ దగ్గరకు వచ్చిన మహాపురాణవేత్తయైన సూతునికి మర్యాదలు చేసి, యిట్లడిగిరి. పౌరాణిక శేఖరా ! మానవులు కోజిన ఇహలోక, పరలోకములందలి సౌఖ్యములు ఏ వ్రతము చేసిన లభించును ? ఏ తపము చేసిన లభించును -
అదంతయు మాకు చెప్పుము. అని కోరగా సూతుడిట్లనెను. మునులారా ! మీరడిగిన ప్రశ్ననే

ఒకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీమన్నారాయణు నడిగెను.ఆయన నారదునకు చెప్పిన దానినే మీకు చెప్పెదను, వినుడు.ఒకానొకప్పుడు నారదమహాముని లోకములను అనుగ్రహించు కోరిక గలవాడై వివిధ లోకములు దిరుగుచు భూలోకమునకు వచ్చెను. అక్కడ, తాము చేసిన కర్మములచే నానాదుఃఖములనుభవించుచు, అనేక జన్మములెత్తుచున్న జనములనుజూచి, ఏ యపాయముచే వీరి దుఃఖములు తొలగు నని చింతించి, సర్వలోక పరిపాలకుడగు శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెడలను. అక్కడ, తెల్లని శరీరకాంతి గలవాడును, నాలుగు భుజములు గలవాడును, శంఖము - చక్రము - గద - పద్మము వనమాల వీనిచే అలంకరింపబడినవాడును  అగు శ్రీమన్నారయణుని జూచి స్తుతించుట ఆరంభించెను. "మాటలకును మనస్సునకును అందని రూపముగలవాడవును, సృష్టి స్థితి లయములు చేయు అనంతశక్తి గలవాడవును, పుట్టుట - పెరుగుట - నశించుట లేనివాడవును, మొదట సత్వరజస్తమో గుణములు లేనివాడవే అయినను సృష్టి వ్యవహారములో త్రిగుణములు గలవాడవును, అన్నింటికి మొదటివాడవును, భక్తుల బాధలు తీర్చువాడవును అగు నీకు నమస్కారము" నారదుని యీ స్తోత్రమును విని విష్ణువు

నారదమునీ తో నిట్లనెను.

నారదమునీ ! నీవిక్కడి కేల వచ్చితివి? నీ మన్సులో నేమి కోరిక యున్నది? చెప్పుము. 

నీవడిగిన వన్నియు వివరింతును. అని నారదుడిట్లనెను. స్వామీ ! భూలోకమున జనులందరును చాల దుఃఖము లనుభవించున్నారు. మృగ పశుపక్షి మనుష్యాది అనేక జన్మములెత్తుచున్నారు అనేక పాపములు చేసి ఆ పాప ఫలములనుభవించుచున్నారు. తేలికయైన ఉపాయము చేత వారి పాపములన్నియు నశించు మార్గమును దయచేసి ఉపదేశింపుము.అని అడుగగా భగవానుడిట్లనెను,
 

నారదా! లోకములోనివారు సుఖపడవలెనను మంచిబుద్దితో నీవడిగిన విషయము చాల బాగున్నది.  జనులు దేనిచే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యము పొందుదురో అట్టి సులభోపాయమును జెప్పెదను, వినుము.

భూలోకమందును, స్వర్గలోకమందును గూడ దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రత మొక్కటి కలదు. నీయందలి వాత్సల్యము చే చెప్పుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. దానిని విధివిధానముగా ఆచరించినవాడు ఈ లోకమున సమస్త సౌఖ్యముల ననుభవించి ఆపైన ముక్తి నొందును. అని చెప్పగా స్వామీ ! ఆ వ్రతవిదానమేమి? ఆ వ్రత మట్లు చేసినచో ఫలమేమి? పూర్వ మెవ్వరైన చేసి ఫలము నొందినారా? ఆ వ్రతమెప్పుడు చెయవలెను? ఇవ్వన్నియు వివరముగా జెప్పుమని యడిగెను. భగవానుడిట్లు చెప్పెను. వ్రతవిష్టత ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు
సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును. ఈవ్రతము ఏప్పుడు చేయాలిమాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ద ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదళినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను. .ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను.
పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్దికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్జముల ముగ్గులు పెట్టవలెను. ఆ ముగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో  నుంచవలెను.

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహము లను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను.

ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్టించి పూజచేయవలెను. బ్రాహ్మణ - క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్జాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక - పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశద్ధలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులతోను బంధువులతోను గూడి వ్రతము చేయవలెను. అరటిపండ్లు, ఆవునేయి, ఆవుపాలు, శేరంబావు గోధుమనూక, గోధుమనూక లేనిచో వరినూక, పంచదార వీనినన్నిటిని కలిపి
ప్రసాదము చేసి స్వామికి నివేదనము చేయవలెను.

బంధువులతో గూడి సత్యనారాయణ వ్రతకథను విని, బ్రాహ్మణులకు దక్షిణతాంబూలములిచ్చి,వారికిని బంధువులకును భోజనములు పెట్టి స్వామి ప్రసాదమును స్వీకరించి, స్వామికి నృత్యగీతాది మహారాజోపచారములర్పించి తానును భుజింపవలెను. నదీతీరమున ఇట్లు వ్రతము చేసి, స్వామిని స్మరించుచు స్వగృహమునకు చేరవలెను. ఇట్లు సాంగముగ భక్తి శ్రద్ధలతో వ్రతము చేసినవారికి కోరినవి సిద్ధించును. విశేషించి, కలియుగములో సర్వార్థ సిద్ధికి ఇదియే సులభమైన ఉపాయము. దీనిని మించినదేదియు లేదు. అని శ్రీమన్నారయణుడు, నారదున కుపదేశించెనని సూతుడు శౌనకాది మహామునులకు జెప్పెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ప్రథమోధ్యాయః సమాప్తం
 

శ్రీ సత్యనారాయణ వ్రత కథ - ద్వితీయోధ్యాయః 

// అధాన్యత్సం ప్రవక్ష్యామి కృతం యేన పురాద్విజాః, కశ్చిత్మాశీపురేమ్యేహ్యా సీద్విప్రోతి నిర్ధనః   క్షుత ద్భ్యాం వ్యాకులో భూత్వా నిత్యాంబభ్రామ్‌ భూతలే //

సూతుడు మరల ఇలా చెప్పుచున్నాడు. మునులారా ! పూర్వమీ వ్రతము చేసిన వాని కథ చెప్పెదను  వినుడు. కాశీనగరమున ఆతి దరిద్రుదైన ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు నిత్యము ఆకలిదప్పులతో   అలమటించుచు తిరుగుచుండెను. శ్రీ సత్యనారాయణ స్వామి, దుఃఖపడుచున్న బ్రాహ్మణుని జూచి కరుణ గలవాడై తానొక బ్రాహ్మణ వేషము దరించి వచ్చి,

'ఓ విప్రడా ! ఇట్లు దుఃఖించుచు తిరుగుచుంటివేమి?

నీ కథనంతను జెప్పుము. వినవలెనని యున్నది' అనెను.     విప్రడిట్లు చెప్పెను.

ఓ మహానుభావా ! నేనొక బ్రాహ్మణుడను. అతి దరిద్రుడను. బిక్ష కొరకు ఇంటింటికి తిరుగుచున్నాను. నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు చెప్పుము.

అని ప్రార్థించెను.

అంత వృద్ధబ్రాహ్మణుడు,

ఓ బ్రాహ్మణుడా !

సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతమున్నది.  అది చేసినవారికి సర్వదుఃఖాలు తొలగిపోవును. నీవును ఆ వ్రతము చేయు మనుచు దాని విధానమును భోధించి అంతర్జానము చెందెను.

ఆ బ్రాహ్మణుడు, రేపే నేనా వృద్ధభ్రాహ్మణుడు చెప్పిన వ్రతము చేసెదనని సంకల్పించి, దానినే తలచుకొనుచు రాత్రి నిద్దురగూడ పోలేదు. అతడు ప్రొద్దున్నే లేచి, ఈ రోజున సత్యదేవుని వ్రతము చేసెదనని మరల సంకల్పించుకొని భిక్షకై బయలుదేరెను.

ఆ రోజున స్వామి దయవలన అతనికి చాల ద్రవ్యము లభించెను. బంధువులను గూడ పిలిచి, దానితో అతడు సత్యనారాయణ వ్రతము చేసెను. ఆ వ్రతము యొక్క ప్రభావము చేత అతడు దారిద్ర్యము మున్నగు సర్వ దుఃఖములనుండి విముక్తుడై, సమస్త సంపదలతో తులతూగెను. అది మొదలుగా అతడు ప్రతి మాసము నందు ఈ వ్రతమును ఆచరించి సర్వపాప విముక్తుడై తుదకు మోక్షము నొందెను.

ఆ బ్రాహ్మణుడు చేసినట్లు ఏ మానవుదైనను ఈ సత్యనారాయణ వ్రతము చేసినచో , అతని సర్వదుఃఖములును నశించును. సూతుడు, మునులారా ! మీరడిగిన కథ చెప్పినాను.

ఇంకేమి చెప్పమందురు ?

అని యడిగెను.

శౌనకాది బుషులు, :-  మహాత్మా ! ఆ బ్రాహ్మణుని వలన తెలిసికొని యెవ్వడీ వ్రతమాచరించెనో చెప్పుము. మాకు వినవలెనని యున్నది అని యడిగిరి. సూతుడిట్లు చెప్పనారంబించెను.

మునులారా! ఒకనాడా బ్రాహ్మణుడు తన వైభవము కొలది బందువులను బిలిచికొని వ్రతము చేయుటకు ప్రారంభించెను. అంతలో అక్కడి కొక కట్టెలమ్ము కొనువాడువచ్చి కట్టెల మోపు బయట దింపి విప్రని ఇంటికి వచ్చెను.
 

అతడు చాల దప్పిక గలవాడై యుండియు ఓపికగా బ్రాహ్మణుడు చేయు వ్రతమును పూర్తిగా చూచి  తుదకు ఆయనకును దేవునుకును నమస్కరించి,

మహానుభావా ! నీవు చేసిన పూజయేమి? దీనివలన కలుగు ఫలమేమి ? వివరముగా జెప్పమని యడిగెను.

బ్రాహ్మణుడిట్లు చెప్పెను.

ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినచో ధనధాన్యములు , సర్వసంపదలు కలుగును. ఇట్లు ఆ విప్రుని వలన ఆ వ్రతమును గూర్చి తెలుసుకొని మంచి నీరు త్రాగి, ప్రసాదమును స్వీకరించి తన యూరికి బోయెను. అతడు సత్యదేవుని మనసులో ధ్యానించుచు, ఈ కట్టెల మోపును రేపు అమ్మెదను. అమ్మగా వచ్చిన ధనముతో సత్యదేవుని వ్రతము చేసెదను, అనుకొని మరనాడు కట్టెల మోపు తలపై పెట్టుకొని నగరములో ధనికులుండు ఇండ్లవైపు వెళ్ళెను.

అతడానాడు స్వామి యనుగ్రహముచే కట్టెలమ్మి రెట్టింపు లాభము నొందెను. దానికి సంతోషించి, అరటిపండ్లు,పంచదార, ఆవునేయి, ఆవు పాలు, శేరుంబావు గోధుమనూక, పూజాద్రవ్యములు అన్నియుదీసుకొని ఇంటికి వెళ్ళెను. వెళ్ళి, బందువులునందరిని బిలిచి సత్యదేవుని వ్రతమును యథాశక్తిగాచేసెను.

ఆ వ్రతము చేసిన ప్రభావముచే అతడు ధనములతోను, పుత్రులతోను సర్వసమృద్ధిగలవాడై యీ లోకమున సౌఖ్యములననుభవించి చివరికి సత్యలోకమును పొందెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ద్వితీయోధ్యాయః సమాప్తం 

శ్రీ సత్యనారాయణ వ్రత కథ తృతీయోధ్యాయః -

మరల సూతుడిట్లు చెప్పసాగెను. మునులారా ! ఇంకొక కథను జెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను రాజుందెను. అతడు సత్యవాక్సాలకుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు బోయి దైవదర్శనము చేసి, బ్రాహ్మణులుకు ధనమును ఇచ్చెడివాడు. అతని భార్య సౌందర్యవతి, సాధ్వి. ఆమెతో గలిసి రాజొకనాడు భద్రశీలానదీ తీరమున సత్యనారాయణ వ్రతమాచరించెను. ఇంతలో అక్కడికి సాధువను ఒక వర్తకుడు, అనేక వస్తువులతోను, ధనముతోను నిండిన నావను ఒద్దున నిల్పి, వ్రతము చేయుచున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇట్లడిగెను. ఓ మహారాజా ! ఇంత భక్తిశ్రద్ధలతో మీరు చేయుచున్నయీ
వ్రతమేమి? దయచేసి నాకు వివరింపుడు. వినవలెననియున్నది. సాధువిట్లడగగా ఆ రాజు, 'ఓ సాధూ ! పుత్రసంతానము కావలెనను కోరికతో నేను మా బందుమిత్రులను బిలుచుకొని సత్యనారాయణ వ్రతము చేయుచున్నాను, అని చెప్పెను. రాజు మాటలు విని సాధువు, మహారాజా !  

నాకును సంతానము లేదు. ఈ వ్రతము వలన సంతానము కలుగుచున్నవో నేనును దీని నాచరించెద ననెను. తరువాత సాధువు వర్తకము పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి భార్యయైన లీలావతితో సంతానప్రదమైన యీ సత్యదేవుని గూర్చి చెప్పి, మనకు సంతానము కలిగినచో ఆ వ్రతము చేసెదనని పలికెను. సాధువు భార్య లీలావతి ధర్మప్రవృత్తి గలదై భర్తతో ఆనందముగా గడిపి గర్భవతియై సత్యదేవుని అనుగ్రహమువలన పదవ నెలలో ఒక బాలికను గనెను. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె వృద్ధి చెందుచుండగా తల్లిదండ్రులామెకు కళావతి అని పేరు పెట్టిరి.

ఆ సమయములో లీలావతి భర్తను జూచి, సంతానము గలిగినచో వ్రతము చేయుదమంటిరిగదా ! పుత్రిక కలిగినది కదా! ఇంకను వ్రతము మాట తలపెట్టరేమి? అని అడిగెను. అందుకు భర్త , లీలావతీ ! మన అమ్మాయి వివాహములో వ్రతము తప్పక చేయుదును. అని యామెను సమాధానపరిచి వర్తకమునకై నగరమునకు బోయెను. కళావతి తండ్రి యింటిలో పెరుగుచుండెను.

అట్లు యుక్తవయసు వచ్చిన కుమార్తెను జూచి సాధువు తన మిత్రులతో ఆలోచించి , వరుని వెదుకుటకై దూతను పంపెను. వర్తకునిచే పంపబడిన ఆ దూత కాంచనగరమునకు బోయి, అక్కడ యొగ్యుడైన వైశ్యబాలకుని జూచి పెండ్లి చూపులకై తీసుకొని వచ్చెను. సుందరుడైన ఆ వైశ్యబాలును జూచి సాధువు తన కుమార్తె నిచ్చి పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి వేడుకలలో బడి సత్యదేవుని వ్రతము సంగతి మరిచిపోయెను. అందుచే ఆ స్వామి చాలా కోపించెను. తరువాత కొంతకాలమునకు వ్యాపారమునందు దక్షతగల ఆ సాధువు అల్లునితో గలిసి వాణిజ్యమునకై బయలుదేరెను. అతడు నౌకలలో సముద్రతీరమున నున్న రత్నసానుపురమును
జేరుకొని అక్కడ అల్లునితో గూడి వ్యాపారము సాగించుచుండెను. తరువాత వ్యాపారమునకై వారిద్దరును చంద్రకేతు మహారాజు నగరమునకు బోయిరి. అంతటి , వ్రతము చేసెదనని ప్రతిజ్ఞ చేసి మరచి పోయిన ఆ సాదువును జూచి, స్వామి కోపించి, దారుణము, కఠినము అయిన మహాదుఃఖ మతనికి కలుగుగాక అని  శపించెను.

ఆనాడే రాజ దనాగారములో ఒక దొంగ ప్రవేశించి ధనము దోచుకొని పారిపోవుచుండెను.

రాజభటులు తరుముచుండగా వాడీ వర్తకులున్నవైపు పరుగెత్తెను. ఆ దొంగ, తన్ను తరుముకొని వచ్చుచున్న రాజభటులను జూచి భయపడి దనమును వర్తకులముందు గుమ్మరించి పారిపోయెను. రాజభటులక్కడికి వచ్చి, రాజదనముతో ఎదుట కనబడుచున్న ఆ వర్తకులను బందించి రాజునొద్దకు తీసుకొనిపోయిరి.

ఆ భటులు సంతోషముతో వీరిని దీసుకొనిపోయి, మహారాజా ! ఇద్దరు దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ చేయనక్కరలేదనచు, కారాగారమున బందింపుడనెను. వారు వర్తకులను కారాగృహమున బందించిరి. సత్యదేవుని మాయచేత వర్తకులెంత మొరపెట్టుకున్నను వారి మాటలెవ్వరును పట్టించుకొనలేదు.

రాజు వారి ధనమును తన దనాగారమున చేర్చించెను.

ఆ దేవుని శాపముచే ఇంటి దగ్గర సాధువు భార్య కూడ కష్టాలపాలయ్యెను. ఇంటిలోని ధనమునంతను దొంగ లపహరించిరి. లీలావతి మనోవ్యథచే రాగగ్రస్తురాలయ్యెను. తినుటకు తిండి దొరకక ఇంటికి దిరిగి బిచ్చమెత్తుకొనసాగెను. కుమార్తెయైన కళావతి కూడ బిచ్చ మెత్తుటకు పోసాగెను.

ఒకనాడు సాయంకాలం వేళ , కళావతి ఒక బ్రాహ్మణునింటికి మాధవకబళమునకు బోయెను. అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి, కథయంతయు విని,తమకు మేలు కలుగునట్లు వరమిమ్మని స్వామిని కోరుకొనెను. స్వామి ప్రసాదమును గూడ
పుచ్చుకొని కళావతి, రాత్రి ప్రొద్దు పోయి యింటికి చేరెను. అప్పుడు తల్లి ఆమెతో ఇట్లనెను.

అమ్మాయీ ! ఇంత రాత్రి వరకు ఎక్కడనుంటివి? నీ మనస్సులో ఏమున్నది? అని యడిగెను.

వెంటనే కళావతి, అమ్మా! నేనొక బ్రాహ్మణుని యింటిలో సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా
చూచుచు ఉండిపోయితిని.

ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చునట గదా ! అనెను.

ఆ మాటవిని
సాధుభార్య, తామా వ్రతము చేయకపోవుటచేతనే ఇట్టి దురవస్థ కలిగినదని గ్రహించి, వ్రతము చేయుటకు సంకల్పించి, ఆ మరునాడు యథాశక్తిగా వ్రతము చేసెను. వ్రతాంతమునందు, స్వామీ ! నా భర్తయును అల్లుడును సుఖముగా తిరిగి యింటికి చేరునట్లు అనుగ్రహింపుము. వారి తప్పులను క్షమింపుము అని ప్రార్థించెను. లీలావతి చెసిన యా వ్రతముచే సంతోషించబడిన సత్యదేవుడు
చంద్రకేతు మహారాజు కలలో కనబడి , నీవు బంధించిన వారిద్దరును దొంగలు కారు, వర్తకులు. రేపు వారిని విడిపించి వారి ధనమును వారికిచ్చి పంపుము. లేనిచో నిన్ను సమూలముగా నాశనము చేసెదనని చెప్పి అదృశ్యుడయ్యెను. మరునాడు ఉదయమున రాజు సభలో తనకు వచ్చిన కలను చెప్పి , ఆ వర్తకులను చెరసాలనుండి విడిపించి తెండని భటుల కాజ్ఞాపించగా వారట్లే ఆ వైశ్యులను
సభలోనికి దెచ్చి రాజా ! వైశ్యులిద్దరిని తెచ్చినామని విన్నవించిరి. ఆ వైశ్యులిద్దరును చంద్రకేతు మహారాజుకు నమస్కరించి వెనుకటి సంగతులు తలచుకొనుచు ఏమియు పలుకలేక నిలుచుచుండిరి. రాజప్పుడా వైశ్యులను జూచి ఆదరముతో , వర్తకులారా ! మీకీ కష్టము దైవ వశమున కలిగినది. ఇప్పుడా భయములేదని ఓదార్చి , వారి సంకెళ్ళను తీయించి క్షౌరము మున్నగు అలంకారములు జేయించెను.(మండనం ముండనం పుంసాం = పురుషులకు క్షౌరము అలంకారము.) వస్థాద్యలంకారములనిచ్చి, మంచి మాటలతో వారిని సంతోషపరచవలెను. ఇది వరకు వారివద్దనుండి తీసికొన్న ద్రవ్యమును రెట్టింపు ద్రవ్యమిచ్చి, 'ఓ సాదూ! ఇంక మీ యింటికేగుమని ఆ రాజు చెప్పగా వారు సెలవు తీసుకొని బయలు దేరిరి'.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పె తృతీయోధ్యాయః సమాప్తం
 

శ్రీ సత్యనారాయణ వ్రత కథ చతుర్జోధ్యాయః -

తరువాత సాధువు శుభశకునములు చూచి, విప్రులకు దానధర్మములు చేసి ప్రయాణం సాగించెను. సాదువు కొంతదూరము ప్రయాణించెను. సత్యదేవునికి సాధువును పరీక్షించు కోరిక గలిగి, సన్యాసి వేషముతో వచ్చి సాధూ! నీ పడవలలో నున్నదేమి? అని యడిగెను.

ఆ వైశ్యులు ధనమదముగలవారై,

అడిగిన ఆ సన్యాసిని జూచి, పరిహసించి, ఇందులో నున్నదేమైన అపహరించుటకు చూచుచున్నావా? ఇందులో మాత్రమేమున్నది? ఆకులు తీగలు తప్ప? అని చెప్పిరి.

సన్యాసి రూపుడైన ఆ దేవుడతని మాటలు విని 'తథాస్తు' అని పలికి  కొంతదూరములో నది యొడ్దుననే నిలుచుండెను.

సన్యాసి అటు వెళ్ళగానే సాధువు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలు ఆకులలములతో నిండియుండుట చూచి ఆశ్చర్య పడి , దుఃఖముతో మూర్చపోయెను తెలివి వచ్చిన తరువాత ధనములు అట్లయినందుకు చాల విచారించెను.

అప్పుడల్లుడు సాదువును జూచి, మహాత్ముడైన సన్యాసిని పరిహసించినాము. అతడు కోపముతో శపించి పోయినాడు. ఆయనయే మరల మనలను రక్షింపగలడు. ఆయనను శరణు వేడినచో మన కోరికలు తీరును అని చెప్పెను. అల్లుని మాటలు విని సాధువు వెంటనే సన్యాసి దగ్గరకు బోయి భక్తితో నమస్కరించి వినయవిధేయతలతో ఇట్లనెను. స్వామీ ! అజ్ఞానముచే నేను పలికిన మాటలను మన్నించి నన్ను క్షమింపుము. అని పదే పదే మొక్కుచు ఏద్చెను. గోలున ఏడ్చుచున్న సాదువును జూచి స్వామి, ఏడువవద్దు. నీవు నా పూజ చేయుదునని ప్రతిజ్ఞ చేసి, అశ్రద్ద చేత మరచినావు.

దుష్టబుద్దీ! నా శాపము చేత నీ కీ కష్టాలు కలుగుచున్నవని యిప్పటికైనా గ్రహించితివా? అనెను.

స్వామి మాటలు విని సాధువు చేతులు జోడించి , ఓ పుండరిక నేత్రా ! బ్రహ్మాదిదేవతలే నీ మాయను దాటలేక సతమతమగుచున్నారు. నీ గుణములను రూపమును తెలిసికొనలేకున్నారు. మానవమాత్రుడను, అజ్ఞానిని. ఆపైన , అనీ మాయలో చిక్కుకొని, నీ అనుగ్రహమునకు దూరమైనవాడను. నిన్ను నేనెట్లు తెలిసికొనగలను? నా యపరాధమును క్షమింపుము.

నిన్నెప్పుడును మరువక నా శక్తి కొలది నిన్ను పుజించెదను. శరణాగతుడైన నన్ను అనుగ్రహించి , నాధనములు నాకిచ్చి రక్షింపుము. అని ప్రార్థించెను. భక్తితో సాధువు చేసిన స్తోత్రమునుకు స్వామి సంతోషించి అతడు కోరిన వరమిచ్చి అక్కడనే అదృశ్యుడయ్యెను. సాదువు నావ దగ్గరకు వచ్చి అది ధనములతోను , వస్తువులతోను నిండి యుండుట చూచి, సత్యదేవుని దయవలన నా కొరిక
తిరనదనుచు, పరివారముతో గలసి స్వామిని పూజించి తన నగరమునకు ప్రయాణము సాగించెను.
 

సాధువు తన ధనములను జాగ్రత్తగా కాపాడుచున్న అల్లుని జూచి, అల్లుడా ! చూచితివా?

రత్నపురమునకు జేరినాము. అనుచు తమ రాకను తెలియజేయుటకై ఇంటికొక దూతను పంపెను. ఆ వార్తాహరుడు నగరమునకు బోయి సాధువు భార్యను జూచి నమస్కరించి,

'అమ్మా! మన షావుకారుగారు అల్లునితోను, బందుమిత్రులతోను మన నగరమునకు వచ్చినారని' చెప్పెను.

దూత చెప్పిన మాట విని సాధువు భార్య తాను చేయుచున్న సత్య వ్రతమును త్వరగా పూర్తిచేసి కుమార్తె తో ఇట్లనెను. నేను వెళ్ళుచున్నాను. నీవు కూడ త్వరగా నీతండ్రిని , భర్తను జూచుటకు రమ్ము.

అనగా , తల్లిమాటలు విని కళావతి వ్రతమును ముగించి ప్రసాదమును భుజించుట మరచి భర్తను చూచుటకు వెళ్ళెను. అందుకు సత్యదేవుడు కోపించి ఆమె భర్తను పడవతో నీళ్ళలో ముంచి వేసెను.

తీరమందున్న జను లందురును పరమ దుఃఖము తో నున్న కళావతిని జూచి దుఃఖము నొందిరి. ఉన్నట్లుండి పడవ మునిగి పోయినందుకు ఆశ్చర్యమును గూడ పొందిరి.

కళావతి దుఃఖితురాలైన కుమార్తె ను జూచి దుఃఖించుచు భర్తతో ఇట్లనెను. మన అల్లుడు పడవతో ఇట్లేల మునిగి పోయినాడు?

ఇది ఏ దేవుని మాయవల్ల జరిగినది ? అని పలుకుచు కుమార్తెను ఒడిలోనికి దీసుకొని దుఃఖించెను కళావతీ తన భర్త అట్లు మునిగిపోయినందుకు విచారించుచు, అతని పాదుకలతో పాటు సహగమనము చేయుటకు సిద్దపడెను.

తన కుమార్తె అవస్థ జూచి సాధువు చాల విచారించెను. అక్కడివారు కూడా బాదపడిరి. అప్పుడు సాధువు 'ఇది యంతయు సత్యదేవుని మాయయై యుండును. స్వామి నన్ననుగ్రహించినచో నా వైభవము కొలది సత్యదేవ వ్రతము చేసెదనని చెప్పుచు ఆ దేవునికి అనేక సాష్టాంగనమస్కారములు చేసెను.

సాధువుపై ప్రసన్నుడైన సత్యదేవుడు అతనితో ఇట్లు చెప్పెను. ఓ సాధూ ! నీ కుమార్తె సత్యవ్రతము చేసి ప్రసాదము పుచ్చు కొన కుండ భర్తను జూచుటకు వచ్చినది. అందుచేతనే ఆమె భర్త కనబడకుండా పోయినాడు. ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని వచ్చినచో ఆమె భర్త మరల జీవించును. ఆకాశమునుండి వినవచ్చిన ఆ వాక్యమును విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని త్వరగా తిరిగివచ్చి నీటిపై తేలుచున్న పడవలోని భర్తను జూచి సంతోషపడెను.

అప్పుడామె తండ్రితో, తండ్రీ ! మన యింటికి పోవుదుము.

ఇంక ఆలస్యమెందుకు ? అనెను.

కుమార్తె మాటలు విని సాదువు సంతోషపడి,తన వారందరితో గలసి ఆ నదీతీరమునందే సత్యనారాయణ వ్రతము చేసి , తరువాత తన యింటికి చేరెను. ప్రతి పూర్ణిమనాడును ప్రతి సూర్య సంక్రమణనాడును సత్యనారాయణ వ్రతము యధావిధిగా చేయుచు ఆ సాధువు ఇహలోకమున సమస్తెశ్వర్యములు అనుభవించి చివరికి సత్యదేవుని సన్నిదానము చేరెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖందే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్చే చతుర్జోధ్యాయః
 

శ్రీ సత్యనారాయణ వ్రత కథ - పంచమోధ్యాయః

మునులారా! మీకు మరియొక కథ వినిపించెదను. వినుడు. పూర్వము తుంగద్వజుడను రాజుండెను.

అతడు ప్రజలను కన్నబిడ్డ్ణలవలె చూచుచు దర్శముగా పాలించుచుండెను. ఒకప్పుడాతడు వేటకు వెళ్ళి అనేక మృగములను జంపి , అలసి ఒక మారేడు చెట్టు క్రింద విశ్రాంతికై ఆగి, ఆ ప్రక్కనే కొందరు గొల్లవారు సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి కూడ ఆ
సమీపమునకు వెళ్ళక తాను రాజునను గర్వముతో స్వామికి నమస్కరింపక నిర్లక్ష్యము చేసెను.

వ్రతము పూర్తెన తరువాత ఆ గోపాలురు ప్రసాదము దెచ్చి రాజు నెదుట ఉంచి స్వీకరింపుడని ప్రార్థించి తిరిగి వెళ్ళి తాము కూడ ప్రసాదమును స్వీకరించిరి. రాజు అహంకారముతో వారు పెట్టిన ప్రసాదమును అక్కడనే విడిచి వెళ్ళిపోయెను. అందువల్ల రాజునకు నూరుమంది కొడుకులును, ధనధాన్యములను, ఐశ్వర్యములను నశించి చాల దుఃఖములు కలిగెను. సత్యదేవుని ప్రసాదమును
తిరస్కరించి వచ్చినాను గనుక, ఆయన కోపము వల్లనే నాకీ యనర్ధము కలిగినది.

ఆ గొల్లలు సత్యదేవుని పూజించినచోటుకే మరల వెళ్ళి నేనును ఆ దేవునారాధించెదను. అని మనసులో నిశ్చయించుకొని ఆ గోపాలురు ఉన్నచోటు వెదుకుకొనుచు వెళ్ళెను. రాజు గోపాలురును జూచి మీరు జేసిన వ్రతమేదో చెప్పుడని యడిగి, వారితో గలసి భక్తిశ్రద్దలతో సత్యదేవుని వ్రతము యథావిధిగా చెసెను. సత్యదేవుని అనుగ్రహము వలన మరల ధనదాన్యాధిక సంపదలను పుత్రులను
పొంది రాజ్య సుఖములనుభవించి, చివరకు సత్యలోకమును బొందెను. పరమోత్తమమైన యీ సత్యనారాయణ వ్రతమును చేసిన వారును, ఎవరైనా చేయచుండ చూచువరైనను, కథను విన్నవరైనను, సత్యనారాయణ స్వామి యనుగ్రహము వలన ధనధాన్యాది సంపదలను, పుత్రపొత్రాది సంతతిని పొంది ఇహలోకమున సర్వసౌఖ్యాలను అనుభవించి పరమున మోక్షమునొందుదురు.

ఈ వ్రతమును భక్తిశ్రద్దలతో చేసినచో , దరిద్రుడు దనవంతుడగును. బందింపబడినవాడు విముక్తుడగును. బయటి శత్రువుల వలనగాని, అంతశ్శత్రువులైన కామక్రోధాధుల వలన గాని, జనన మరణరూపమైన సంసారము వలన గాని, భయమందినవాడు ఆ భయమునుండి విముక్తుడగును. కోరిన కోరికలన్నియు లభించుటచే ఆనందించి, చివరకు సత్యలోకమునకు చేరును. ఇది నిశ్చయము. ఓ మునులారా మానవులను సర్వదుఃఖములనుండియు విముక్తులను జేయగల్లిన ప్రభావముగల

శ్రీ సత్యనారాయణ వ్రత విధానమును, ఆచరించి ఫలమును బొందినవారి కథలను మీకు వివరించినాను. విశేషించి ఈ కలియుగములో , సమస్త దుఃఖములు తొలుగుటకును , సర్వసౌఖ్యములు కలుగుటకును, తుదకు మోక్షము నిచ్చుటకును ఈ సత్యనారాయణ వ్రతమును మించినది ఏదియు లేదు. కలియుగమున కొందరు దేవుని సత్యమూర్తియనియు, కొందరు సితేశ్వరుడనియు, కొందరు
 

సత్యనారాయణుడనియు, కొందరు సత్యదేవుడనియు పిలిచెదరు. ఎవ్వరే పేరుతో బిలిచినను పలికెడి దయామయుడైన ఆ సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తుల కోరికలు తీర్చెడివాడై కలియుగమున వ్రతరూపుడై ప్రకాశించుచుండును. వ్రతము చేయుచున్నప్పుడు చూచినను, వ్రతకథను విన్నను, సత్యనారాయణ స్వామి అనుగ్రహము వలన సర్వపాపములును నశించును.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే పంచమోధ్యాయః సమాప్తం 

శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము సమాప్తము.

((( క్రింద కామెంట్ బాక్స్ లో  దోషముల తెల్ప వలసింది గా మనవి -- ధన్య వాదములు - శ్రీ సత్య దేవుని అను గ్రాహ పాత్రులు కావాలి అని కోరుకుంటూ -- స్వస్తి )))
  

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow