Nasadheeya Suktham Telugu

Apr 20, 2024 - 16:09
 0

నాస॑దాసీ॒న్నో సదా॑సీత్త॒దానీ॒మ్ నాసీ॒ద్రజో॒ నో వ్యో॑మా ప॒రో యత్ ।
కిమావ॑రీవ॒: కుహ॒ కస్య॒ శర్మ॒న్నంభ॒: కిమా॑సీ॒ద్గహ॑నం గభీ॒రమ్ ॥ ౧ ॥

పదచ్ఛేదం: న । అసత్ । ఆసీత్ । నో ఇతి । సత్ । ఆసీత్ । తదానీమ్ । న । ఆసీత్ । రజః । నో ఇతి । వ్యోమ । పరః । యత్ । కిమ్ । అవరీవః । కుహ । కస్య । శర్మన్ । అమ్భః । కిమ్ । ఆసీత్ । గహనమ్ । గభీరమ్ ॥

న అసత్ ఆసీత్ = అసత్తు లేదు; న ఇతి ఆసీత్ సత్ = లేదు సత్తు; తదానీమ్ = ఆ వేళలో, అప్పుడు; న ఆసీత్ = లేదు; రజః = రజస్సు; నో ఇతి = లేదు; వ్యోమ = వ్యోమము; పరః = పరము; యత్ = ఏదైతే; కిమ్ = ఏది; అవరీవః = ఆవరించినది; కుహ = ఎక్కడ; కస్య = ఎవరి; శర్మన్ = రక్షణలో; అమ్భః = అంభువు; కిమ్ = ఎందుకు; ఆసీత్ = ఉన్నది; గహనమ్, గభీరమ్ = గహన, గంభీరంగా.

న మృ॒త్యురా॑సీద॒మృత॒మ్ న తర్హి॒ న రాత్ర్యా॒ అహ్న॑ ఆసీత్ప్రకే॒తః ।
ఆనీ॑దవా॒తం స్వ॒ధయా॒ తదేక॒మ్ తస్మా॑ద్ధా॒న్యన్న ప॒రః కిం చ॒నాస॑ ॥ ౨ ॥

పదచ్ఛేదం: న । మృత్యుః । ఆసీత్ । అమృతమ్ । న ।తర్హి । న । రాత్ర్యాః । అహ్నః । ఆసీత్ । ప్రకేతః । ఆనీత్ । అవాతమ్ । స్వధయా । తత్ । ఏకమ్ । తస్మాత్ । హ । అన్యత్ । న । పరః । కిమ్ । చన । ఆస ॥

టీకా: న మృత్యుః = లేదు మృత్యువు; ఆసీత్ అమృతమ్ న = లేదు అమృతము; తర్హి = అప్పుడు; న రాత్ర్యాః = రాత్రి లేదు; న అహ్నః ఆసీత్ = పగలు లేదు; ప్రకేతః = సూచన; ఆనీత్ = ఊపిరి; అవాతమ్ = లేదు గాలి; స్వధయా = తనంతట; తత్ = తాను; ఏకమ్ = ఒక్కటి; తస్మాత్ = అందుకు; అన్యత్ = ఇతరము; న పరః = దాటిలేదు; కిమ్ = ఏది; న ఆస = లేదు

తమ॑ ఆసీ॒త్తమ॑సా గూ॒ళ్హమగ్రే॑ఽప్రకే॒తం స॑లి॒లం సర్వ॑మా ఇ॒దమ్ ।
తు॒చ్ఛ్యేనా॒భ్వపి॑హిత॒మ్ యదాసీ॒త్తప॑స॒స్తన్మ॑హి॒నాజా॑య॒తైక॑మ్ ॥ ౩ ॥

పదచ్ఛేదం: తమః । ఆసీత్ । తమసా । గూళ్హమ్ । అగ్రే । అప్రకేతమ్ । సలిలమ్ । సర్వమ్ । ఆః । ఇదమ్ । తుచ్ఛ్యేన । ఆభు । అపిహితమ్ । యత్ । ఆసీత్ । తపసః । తత్ । మహినా । అజాయత । ఏకమ్ ॥

టీకా: తమః = తమస్సు; ఆసీత్ = ఉన్నది; తమసా = తమస్సులో; గూళ్హమ్ = గూఢంగా; అగ్రే = తొల్లి; అప్రకేతమ్ = తెలియలేనట్టి; సలిలమ్ = జలము; సర్వమ్ = అంతా; ఆః ఇదమ్ = అక్కడ ఉండెను; తుచ్ఛ్యేన = శూన్యముతో; ఆభు = ఉండిన; అపిహితమ్ = కప్పబడిన; యత్ ఆసీత్ = ఏది ఉండెనో; తపసః = తపస్సుచే; తత్ = అది; మహినా = మహిమచే; అజాయత = ఉద్భవించింది; ఏకమ్ = ఒకటి

కామ॒స్తదగ్రే॒ సమ॑వర్త॒తాధి॒ మన॑సో॒ రేత॑: ప్రథ॒మం యదాసీ॑త్ ।
స॒తో బన్ధు॒మస॑తి॒ నిర॑విన్దన్ హృ॒ది ప్ర॒తీష్యా॑ క॒వయో॑ మనీ॒షా ॥ ౪ ॥

పదచ్ఛేదం: కామః । తత్ । అగ్రే । సమ్ । అవర్తత । అధి । మనసః । రేతః । ప్రథమమ్ । యత్ । ఆసీత్ । సతః । బన్ధుమ్ । అసతి । నిః । అవిన్దన్ । హృది । ప్రతీష్యా । కవయః । మనీషా ॥

టీకా: కామః = కోరిక; తత్ = అప్పుడు; అగ్రే = తొల్లి; సమవర్తత = సమవర్తించెను; అధి మనసః = అధిమనస్సు; రేతః ప్రథమమ్ = ప్రథమ రేతస్సు; యత్ ఆసీత్ = అప్పుడు ఉండెను; సతః బన్ధుమ్ అసతి = సత్తు అసత్తుల బంధమును; నిః అవిన్దన్ = తెలుసుకొన్నారు; హృది = హృదయంలో; ప్రతీష్యా = వెతకి, తరచి; కవయః = కవులు; మనీషా = బుద్ధిచే.

తి॒ర॒శ్చీనో॒ విత॑తో ర॒శ్మిరే॑షామ॒ధః స్వి॑దా॒సీ౩దు॒పరి॑ స్విదాసీ౩త్ ।
రే॒తో॒ధా ఆ॑సన్మహి॒మాన॑ ఆసన్త్స్వ॒ధా అ॒వస్తా॒త్ప్రయ॑తిః ప॒రస్తా॑త్ ॥ ౫ ॥

పదచ్ఛేదం: తిరశ్చీనః । వితతః । రశ్మిః । ఏషామ్ । అధః । స్విత్ । ఆసీత్ । ఉపరి । స్విత్ । ఆసీత్ । రేతఃధాః । ఆసన్ । మహిమానః । ఆసన్ । స్వధా । అవస్తాత్ । ప్రయతిః । పరస్తాత్ ॥

టీకా: తిరశ్చీనః = అడ్డునిలువుగా; వితతః = ప్రసరించు; రశ్మిః = రశ్మి; ఏషామ్ = ఇక్కడది; అధః స్విత్ ఆసీత్ = క్రింద ఉన్నది; ఉపరి స్విత్ ఆసీత్ = పైన ఉన్నది; రేతఃధాః = రేతస్సు ఇచ్చువారలు; ఆసన్ = ఉన్నారు; మహిమానః ఆసన్ = మహిమానులు ఉన్నారు; స్వధా = స్వధ†; అవస్తాత్ = క్రిందగా; ప్రయతిః = ప్రయతి†; పరస్తాత్ = పైగా ఉండగా.

కో అ॒ద్ధా వే॑ద॒ క ఇ॒హ ప్ర వో॑చ॒త్కుత॒ ఆజా॑తా॒ కుత॑ ఇ॒యం విసృ॑ష్టిః ।
అ॒ర్వాగ్దే॒వా అ॒స్య వి॒సర్జ॑నే॒నాథా॒ కో వే॑ద॒ యత॑ ఆబ॒భూవ॑ ॥ ౬ ॥

పదచ్ఛేదం: కః । అద్ధా । వేద । కః । ఇహ । ప్ర । వోచత్ । కుతః । ఆజాతా । కుతః । ఇయమ్ । విసృష్టిః । అర్వాక్ । దేవాః । అస్య । విసర్జనేన । అథ । కః । వేద । యతః । ఆబభూవ ॥

టీకా: కః = ఎవరు; అద్ధా = నిజముగా, పూర్తిగా; వేద = తెలియును; కః = ఎవరు; ఇహ = ఇక్కడ; ప్ర+వోచత్ = చెప్పగలరు; కుతః = ఎట్లా; ఆజాతా = పుట్టింది; కుతః = ఎట్లా; ఇయమ్ = ఈ; విసృష్టిః = విసృష్టి; అర్వాక్ = ఇక్కడి; దేవాః = దేవతలు; అస్య = ఇక్కడ; విసర్జనేన = తరువాత వచ్చినవారు; అథ = అయితే; కః = ఎవరు; వేద = తెలియును; యతః = ఎట్లా; ఆబభూవ = పుట్టిందో?

ఇ॒యం విసృ॑ష్టి॒ర్యత॑ ఆబ॒భూవ॒ యది॑ వా ద॒ధే యది॑ వా॒ న ।
యో అ॒స్యాధ్య॑క్షః పర॒మే వ్యో॑మ॒న్త్సో అ॒ఙ్గ వే॑ద॒ యది॑ వా॒ న వేద॑ ॥ ౭ ॥

పదచ్ఛేదం: ఇయమ్ । విసృష్టిః । యతః । ఆబభూవ । యది । వా । దధే । యది । వా । న । యః । అస్య । అధిఅక్షః । పరమే । వ్యోమన్ । సః । అఙ్గ । వేద । యది । వా । న । వేద ॥

టీకా: ఇయమ్ = ఈ; విసృష్టిః = విసృష్టి; యతః = దేనినుండి; ఆబభూవ = ఉద్భవించెను; యది = ఒకవేళ; వా = కానీ; దధే = ధరించి నిలుపునదో; యది వా = కానీ; న యః = నిలుపనిదో; అస్య = అక్కడ; అధిఅక్షః = అధివీక్షించేవాడు; పరమే వ్యోమన్ = ఉన్నత ఆకాశంలో; సః = తాను; అఙ్గ = పూర్తిగా; వేద = తెలుయునో; యది వా = లేదా; న వేద = తెలియదో.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow