రొద్దానికి ఎద్దునీ, పెనుగొండకి పిల్లనీ ఇవ్వకూడదని అంటారు. ఈ సామెత ఎలా వచ్చింది?

అనంతపురము జిల్లాలోని రొద్దము అనే ఊరిలో(అక్కడ రుద్ర పాదం ఉందట. దాని పేరు మీద రుద్రం ఏర్పడి క్రమంగా వాడుకలో రొద్దం అయిందని ప్రాచుర్యం ) నీళ్ళు పుష్కలంగా ఉండి మూడు పంటలు పండుతాయేమో! మరి అలాంటి ఊరికి ఎద్దును పంపితే 365 రోజు లు వ్యవసాయపు పనులుంటాయి.ఎద్దుకు విశ్రాంతి ఉండదు.

అనంతపురము జిల్లాలోని పెనుగొండ లో నీటికొరత ఉంటుంది.అలాంటి ఊరికి పిల్లనిస్తే ఎంతో దూరం నుండి మంచి నీళ్ళు మోసుకుని రావలసి ఉంటుంది.ఇలాగైతే ఆడపిల్ల కు చాకిరీ ఎక్కువ అంటే రొద్దము లో ఎద్దు కాస్త పడినట్టు పడాలి ,

అందుకే అలంటి ఊళ్ళలోని మగపిల్లలకు పెళ్ళికి పిల్లల నిచ్చేందుకు ముందు కు వచ్చే వారు కారు. పైన రెండు ప్రదేశాలు అనంతపురము జిల్లాలోనివి. రెంటి మధ్య దూరము 20 కిలో మీటర్లు మాత్రమే . కానీ రొద్దము దగ్గర పెన్నానది ప్రవహిస్తుంది అందుకే నీటి వసతి ఎక్కువ. అందు చేత రొద్దానికి ఎద్దును, పెనుగొండ కు పిల్ల ను ఇవ్వకూడదని అంటారు.