విషక్రిమిన్యాయం

Aug 7, 2021 - 06:58
Aug 7, 2021 - 07:08
 0

విషములో పుట్టినపురుగు విషమే తిని జీవించునట్లు. చాణక్య నీతి దర్పణమున నీన్యాయము నుద్బోధించుచు నిట్లు నుడువఁబడియున్నది.

"విప్రాస్మి న్నగరే మహాన్‌ కథయ కః | తాలద్రుమాణాం గణః; కో దక్షః|| పరవిత్తదారహరణే సర్వోఽపి పౌరో జనః; కోదాతా| రజకో, దదాతి వసనం ప్రాత ర్గృహీత్వానిశి;|| తత్కిం జీవసి హే సఖే: విషక్రిమిన్యాయేన జీవామ్యహమ్‌."

ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామానికి భిక్షాటనకై వెళ్ళి ఊరి బయట కనిపించిన వేరొక బ్రాహ్మణుని ఆ గ్రామ పరిస్థితులను తెలుసుకొనుటకు ఈ విధంగా ప్రశ్నిస్తాడు. అపుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానము నిచ్చెను.

ఈ వూరిలో అందరికన్నా గొప్పవాడెవడు? - ఈ వూరిలో అందరికంటే గొప్పవాడు ఆ కనబడు తాటి తోపు. ఇచట సమర్థుడెవడు ? - ఇతరుల ధనమును, భార్యలను అమాంతముగా దొంగిలించువారందరూ సమర్థులే. పోనీ, దాత ఎవడో వినిపింతువా?

ఈ గ్రామంలో దాత చాకివాడు. అతడే మహాదాత. ఎందువలనంటే అతను ఉదయం తీసుకొని పోయిన గుడ్డలను రాత్రికి మరల తెచ్చుచున్నాడు. అయితే ఈ ఊరిలో ఎట్లు జీవించుచున్నావు? - అయ్యా! ఏమి చెప్పను? విషక్రిమిన్యాయముగా జీవించుచున్నాను.

భావము : అనగా యీయూరఁ (ఈ ఊర ) బుట్టినవాఁడ (పుట్టిన వాడిని ) నగుటచే నిచటిప్రకృతి కలవాటుపడి బ్రదుకుచున్నాను అని భావము. విషములోని పురువునకు విష మిష్టాహారమే. అవిషము దాని కేమియు హాని చేయదు; కాని, యితరులకుమాత్రము హానికర మవును." (ఒకనికి ఆహార మయిన వస్తువు మఱొకనికి విషమవును. ఒకరిమేలు మఱొకరికి కీడు. పై విషకీటన్యాయము, ఈ విషక్రిమిన్యాయము రెండు నొకటియే.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow