చెడుగుడు అంటే ?

ఒక భారతదేశపు గ్రామీణ ఆట.ఇందులో ఆటగాళ్ళు రెండు జట్లుగా విడిపోతారు. ఒక్కొక్క జట్టులో ఏడు మంది ఉంటారు. భారతదేశం లోనే కాకుండా ఇతర ఆసియా దేశాలైన జపాన్, ఇరాన్ లలో కూడా ఆడతారు. బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ . ఆంధ్రప్రదేశ్,, పంజాబ్ లలో రాష్ట్ర అధికార క్రీడ. మన రాష్ట్రంలో దీనిని 'చెడుగుడు' ఆట అనికూడా వ్యవహరిస్తారు.
ఆట విధానం
అంతర్జాతీయ కబడ్డీ ఆటలో రెండు టీములు 13 మీటర్లు : 10 మీటర్లు కోర్టులో ఆడుతారు. ఒక్కొక్క జట్టులో 7 గురు ఆటగాళ్ళు ఉంటారు. 5 గురు రిజర్వ్ లో ఉంటారు. ఆట సమయం 40 నిమిషాలు; మధ్యలో 5 నిమిషాల విరామం ఉంటుంది. ఒక టీము నుండి ఒక ఆటగాడు రెండవవైపు కబడ్డీ, కబడ్డీ, ... అని గుక్కతిప్పుకోకుండా వెళ్ళి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని ముట్టుకొని తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అందరూ ఔట్ అయిపోయినట్లు. వారిని బయటికి పంపిస్తారు. రెండవ జట్టుకు అన్ని మార్కులు వస్తాయి. ఒకవేళ కూత ఆపితే ఒక మార్కు విరోధి జట్టుకు వస్తుంది. ఆపిన ఆటగాన్ని బయటికి పంపిస్తారు.
తరువాత రెండవ జట్టు నుండి ఒక ఆటగాడు మొదటి జట్టులోని ఇదేవిధంగా వచ్చి కొందర్ని ఔట్ చేసి వెళ్ళిపోతాడు. ఒక ఆటగాడు ఒకసారి ఏడుగురినీ ఔట్ చేస్తే ఏడు మార్కులతో సహా రెండు బోనస్ మార్కులు కూడా వస్తాయి. విరోధి జట్టులోని ఏడుగురు ఒక గొలుసు మాదిరిగా ఏర్పటి కూత పెడుతున్న ఆటగాన్ని తిరిగి వెనకకి పోకుండా ఆపాలి. ఆట పూర్తి అయిన తరువాత ఏవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ జట్టు గెలిచినట్లుగా నిర్ణయిస్తారు.
చరిత్ర
కబడ్డీ ఆట తమిళనాడు రాష్ట్రంలో పుట్టింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందినది. భారత కబడ్డీ సమాఖ్య 1950 సంవత్సరంలో స్థాపించబడింది. 1979లో ఈ ఆట జపాన్ దేశంలోకి ప్రవేశపెట్టబడింది. కబడ్డీ మొదటిసారిగా చైనాలో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి 2006 వరకు మనదేశం ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు. ప్రముఖ కబడ్డీ క్రీడాకారులు రాహుల్ చౌదరి అనూప్ కుమార్ ప్రదీప్ నర్వాల్ అజయ్ తకుర్ జాస్విర్ సింగ్ సందీప్ నర్వాల్ దీపక్ నివ్స్ హూడా మన్జీత్ చిల్లర్ మోహిత్ చిల్లర్ సురేంద్ర నద రాకేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు:
రాష్ట్ర చిహ్నం: పూర్ణకుంభం
రాష్ట్ర గీతం: మా తెలుగు తల్లికి మల్లె పూదండ
రాష్ట్ర జంతువు: కృష్ణ జింక రాష్ట్ర పక్షి: పాలపిట్ట
రాష్ట్ర వృక్షం: వేప
రాష్ట్ర ఆట: కబడ్డీ
రాష్ట్ర నాట్యం: కూచిపూడి (నృత్యము)
రాష్ట్ర పుష్పం: కలువ పువ్వు
రాష్ట్ర భాష: తెలుగు
What's Your Reaction?






