హిమోగ్లోబిన్ లోపం: లక్షణాలు, కారణాలు, చికిత్స, మందులు, నివారణ, వ్యాధినిర్ధారణ

Note: this article is and the information and information provided in this article are based on general information. and it is not suitable for everyone, and neither MDN NEWS, mydigitalnews.in. nor its team does not confirm these. Please contact the relevant expert, or doctor before implementing them.) గమనిక: ఈ వ్యాసం మరియు ఈ వ్యాసంలో అందించిన సమాచారం , సాధారణ సమాచారం మీద ఆధారపడి ఉంటాయి. మరియు ఇది అందరికీ అనుకూలంగా ఉండదు మరియు MDN NEWS, mydigitalnews.in. లేదా దాని బృందం వీటిని నిర్ధారించదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించండి.)

Jul 11, 2021 - 19:12
Jul 11, 2021 - 19:22
 0
హిమోగ్లోబిన్ లోపం: లక్షణాలు, కారణాలు, చికిత్స, మందులు, నివారణ, వ్యాధినిర్ధారణ

హిమోగ్లోబిన్ లోపం: లక్షణాలు, కారణాలు, చికిత్స, మందులు, నివారణ, వ్యాధినిర్ధారణ

హీమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ లేదా రక్తచందురం అనేది అన్ని సకశేరుకాల (చేప కుటుంబం చన్నిచ్త్యిడే మినహా) యొక్క ఎర్ర రక్త కణాలలో ఇనుమును కలిగి ఆక్సిజన్ రవాణా చేసే మెటల్లొప్రోటీన్ (లోహ ప్రోటీన్), అలాగే కొన్ని అకశేరుకాల యొక్క కణజాలం. రక్తంలో హీమోగ్లోబిన్ శ్వాసకోశ అవయవాల (ఊపిరితిత్తులు లేదా మొప్పలు) నుండి మిగిలిన శరీరానికి (ఉదా: కణజాలం) ఆక్సిజన్‌ చేరవేస్తుంది. అక్కడ ఇది ఆక్సిజన్‌ను జీవక్రియ అనే ప్రక్రియలో జీవి యొక్క విధులకవసరమైన శక్తి కొరకు శక్తిని అందించడానికి వాయుసహిత శ్వాసక్రియను అనుమతించడానికి విడుదల చేస్తుంది. హీమోగ్లోబిన్ అనే ఈ పదార్థము కారణంగానే మానవ శరీరంలోని రక్తం ఎర్రగా ఉంటుంది.

శరీరంలో రక్తం ప్రయాణిస్తున్న సమయంలో ఊపిరితిత్తులవద్ద హీమోగ్లోబిన్ ప్రాణవాయువును పీల్చుకొని శరీరం మొత్తానికి ప్రాణవాయువును సరఫరా చేస్తూ ఉంటుంది. అలా హీమోగ్లోబిన్ ద్వారా శరీర అవయవాలలోని విడిపోయిన కణజాలాలకు ప్రాణవాయువు వెళుతుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు లెక్క. అందువలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకొనుటకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. మాంసం, చేపలు, గ్రుడ్లు వంటి జంతు సంబంధమైన ఆహారపదార్థాలను శరీరం త్వరగా జీర్ణించుకొని ఐరన్ ను స్వీకరించగలుగుతుంది. శాకాహార సంబంధమైన ఆకుకూరలు, ఎండుఫలాలు, పండ్లు, కాయగూరలలో ఐరన్ (ఇనుము) తగినంత ఉన్నప్పటికి శరీరం వాటిని పూర్తిగా జీర్ణించుకోలేకపోవటంతో వాటి నుండి శరీరం తగినంత ఐరన్ ను స్వీకరించలేకపోతుంది.

అయితే శాఖాహారాన్ని అధికంగా తీసుకోవటం ద్వారా శరీరానికి కావలసినంత ఐరన్ పొందవచ్చు, తద్వారా రక్తంలో తగినంత హీమోగ్లోబిన్ శాతం ఏర్పడి రక్తహీనత బారి నుండి తప్పించుకోవచ్చు. ఒక వ్యక్తి తన సాధారణ ఆరోగ్య పరిస్థితికి భిన్నంగా మార్పు సంభవించిందని భావించినప్పుడు, ముఖ్యంగా రక్తహీనతకు గురవుతున్నానని భావించినప్పుడు ఎర్రరక్తకణాలు తగినన్ని ఉన్నాయా, వాటిలో హీమోగ్లోబిన్ శాతం తగినంత ఉన్నదా, లేదా అని క్లినికల్ పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుటకు అవసరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.

హిమోగ్లోబిన్ లోపం అంటే ఏమిటి?

మన ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ ఒక ముఖ్యమైన ప్రోటీన్. దాని పని కణాలకు  మరియు కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడం (సరఫరా చెయ్యడం). తక్కువ హేమోగ్లోబిన్ శాతాన్ని హేమోగ్లోబిన్ లోపం అని కూడా పిలుస్తారు దీనిని రక్త పరీక్ష ద్వారా తేలికగా గుర్తించవచ్చు. సాధారణంగా పురుషులలో 13.5 g / dL (135 g / L) కంటే తక్కువ మరియు స్త్రీలలో 12 g / dL (120 g / L) కంటే తక్కువ ఉంటే దానిని హిమోగ్లోబిన్ లోపం అని పరిగణిస్తారు.

తక్కువగా ఉంటే సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మాములుగా, హేమోగ్లోబిన్ శాతం సాధారణం కన్నా కొంచెం తక్కువగా ఉంటే, వ్యక్తికి ఎటువంటి లక్షణములు ఉండకపోవచ్చు.

అయితే, హిమోగ్లోబిన్ లోపం యొక్క లక్షణాలు:

 • అలసట
 • బలహీనత
 • మైకముగా అనిపించడం
 • వణుకు
 • పాలిపోయిన చర్మం
 • శ్వాస ఆడకపోవడం
 • శారీరక కార్యకలాపాలు నిర్వహించలేకపోవటం
 • పాదములలో వాపు

హిమోగ్లోబిన్ శాతం తక్కువకి కారణాలు ఏమిటి?

అనేక కారణాల వలన అధికంగా  రక్తం నష్టపోవడం వలన హిమోగ్లోబిన్ శాతం తక్కువ కావచ్చు:

 • గాయం వలన అధిక రక్తస్రావం కావడం
 • తరచుగా రక్తదానం చెయ్యడం
 • భారీ రుతు రక్తస్రావం కావడం

శరీరంలోని ఎర్ర రక్త కణాల అధికంగా విచ్ఛిన్నం అవ్వడానికి కారణమయ్యే కొన్ని సమస్యలు   కూడా తక్కువ హిమోగ్లోబిన్ శాతానికి దోహదం చేస్తాయి: ప్లీహము (spleen) విస్తరించడం, సికిల్ సెల్ ఎనీమియా , తలస్సెమియా. 

హిమోగ్లోబిన్ లోపానికి దారితీసే తక్కువ ఎర్ర రక్త కణ ఉత్పత్తికి కారణమయ్యే ఇతర కారకాలు:

 • విటమిన్ B12 ను తక్కువగా తీసుకోవడం
 • ఎముక మజ్జ వ్యాధి (Bone marrow disease, ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి)
 • అప్లాస్టిక్ ఎనీమియా (Aplastic anaemia) - ఇది ఒక రకమైన ఎముక మజ్జ క్యాన్సర్, ఇది కొత్త  కణాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది
 • కిడ్నీ వ్యాధులు
 • ఆహారంలో ఇనుము మరియు ఫోలేట్ల  యొక్క తక్కువ స్థాయి

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు సాధారణ రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేయబడతాయి. పూర్తి రక్త గణన (CBC, complete blood count) పరీక్ష సాధారణంగా వైద్యులు ఆదేశించే మొదటి పరీక్ష. ఇది ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు,ప్లేటిలెట్లు, హేమోగ్లోబిన్ మరియు హేమాటోక్రిట్ (ఎర్ర రక్త కణాలతో తయారు చేయబడిన రక్తం యొక్క శాతం) వంటి రక్తంలో పదార్దాలను కొలుస్తుంది. ఈ క్రింది సందర్భాలలో రక్త పరీక్ష జరగవచ్చు:

 • అంతర్గత రక్తస్రావం యొక్క గమనించదగ్గ గుర్తు
 • గర్భం
 • రక్త నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు
 • కిడ్నీ సమస్యలు
 • రక్తహీనత
 • క్యాన్సర్
 • కొన్ని మందులను తీసుకోవడం

తక్కువ హిమోగ్లోబిన్ కు చికిత్స లోపం యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. రక్తహీనత లేదా పోషక లోపల కారణంగా ఐతే, డాక్టర్ ఇనుము, విటమిన్ B12 లేదా రక్తంలో ఫోలేట్ స్థాయిలను పెంచడంలో సహాయపడే ఆహార పదార్ధాలను సూచించవచ్చు. గాయం కారణంగా  రక్త నష్టం ఏర్పడితే, రక్త మార్పిడి అవసరం కావచ్చు. సాధారణంగా, అంతర్లీన కారణానికి చికిత్స చేయడమనేది తక్కువ హిమోగ్లోబిన్ శాతాన్ని పరిష్కరిస్తుంది. అధికంగా ఎర్ర రక్త కణాలకు నష్టం కలిగిన సందర్భాల్లో, బాహ్యంగా రక్తం ఎక్కించడంతో పాటు వ్యాధికి చికిత్స చేయడం అవసరమవుతుంది.

హీమోగ్లోబిన్ సాధారణ స్థాయిలు

1 లీటరులో పదో వంతుని డెసీలీటరు అంటారు.  1 డెసీలీటరుని 1dL అని రాస్తారు.

 • పురుషులు: 13.8 నుంచి 18.0 గ్రాములు/డెసీలీటరు (138 నుంచి 180 గ్రాములు/లీటరు, or 8.56 to 11.17 mmol/L)
 • మహిళలు: 12.1 నుంచి 15.1 గ్రాములు/డెసీలీటరు (121 నుంచి 151 గ్రాములు/లీటరు, or 7.51 to 9.37 mmol/L)
 • పిల్లలు: 11 నుంచి 16 గ్రాములు/డెసీలీటరు (111 నుంచి 160 గ్రాములు/లీటరు, or 6.83 to 9.93 mmol/L)
 • గర్భిణీ స్త్రీలు: 11 నుంచి 14 గ్రాములు/డెసీలీటరు (110 నుంచి 140 గ్రాములు/లీటరు, or 6.83 to 8.69 mmol/L)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow