రేపో రేట్ UPSC knowledge

Aug 19, 2020 - 03:29
Sep 23, 2020 - 13:10
 0

రెపో రేట్ తగ్గితే ప్రజలకు ఏం లాభం?

రెపో రేట్ తగ్గితే ఆర్‌బీఐ దగ్గర బ్యాంకులు ఎక్కువగా అప్పులు చేస్తాయి. వాటిని ప్రజలకు రుణాలుగా ఇస్తాయి. ఎలాగూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి బ్యాంకులు కూడా సామాన్యులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తాయి.

రెపో రేట్ Decreased?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను తగ్గించించడం సామాన్యులకు శుభవార్తే. ఎందుకంటే గతేడాది జూన్ నుంచి రెపో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గతంలో 6.50 ఉన్న రెపో రేట్ 6.25 శాతానికి తగ్గించింది ఆర్‌బీఐ. రెపో రేట్ తగ్గిస్తే సామాన్యులకు లాభం అంటున్నారు కానీ... ఏ విధంగా లాభం అన్నది చాలామందికి తెలియదు. ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు అసలు రేపో రేట్, రివర్స్ రేపో రేట్ అంటే ఏంటీ? రెండింటి మధ్య తేడాలు ఏంటీ? తెలుసుకోవాలి.

రెపో రేట్ ?

బ్యాంకుల దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసూలు చేసే వడ్డీనే రెపో రేట్ అంటారు. అంటే ప్రజలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు స్వల్ప కాలం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తీసుకుంటాయి. అందుకు బదులుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని ఆర్‌బీఐకి ఇస్తారు. తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తాయి. ఆ అప్పులపై నిర్ణయించే వడ్డీనే రెపో రేట్ అంటారు. ఒక వేళ రెపో రేట్ పెరిగితే ఆర్‌బీఐ దగ్గర బ్యాంకులు అప్పులు తీసుకోవడానికి వెనకడుగు వేస్తాయి. అప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలకు అప్పులు ఇచ్చే విధానం కాస్త కఠినతరం అవుతుంది. వడ్డీలు పెరుగుతాయి. అదే రెపో రేట్ తగ్గితే ఆర్‌బీఐ దగ్గర బ్యాంకులు ఎక్కువగా అప్పులు చేస్తాయి. వాటిని ప్రజలకు రుణాలుగా ఇస్తాయి. ఎలాగూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి బ్యాంకులు కూడా సామాన్యులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అలా రెపో రేట్లు తగ్గితే సామాన్యులకు లాభమే.

రివర్స్ రెపో రేట్  ?

ఆర్‌బీఐ కూడా బ్యాంకుల దగ్గర డబ్బును అప్పుగా తీసుకుంటుంది. దానికి వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీనే రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు ఇంతే వడ్డీ ఇస్తామని నిర్ణయించడం అన్నమాట. ఎప్పుడూ రివర్స్ రెపో రేట్ కన్నా రెపో రేట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రివర్స్ రెపో రేట్‌ని కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్‌బీఐ. బ్యాంకులు రుణాలు ఇచ్చేప్పుడు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR) ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఇప్పుడు రెపో రేట్ తగ్గింది కాబట్టి MCLR కూడా తగ్గుతుంది. అంతేకాదు... ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow