ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2020 -ఖాఖీ ప్రియులకు శుభవార్త

ఏపీలో 6500 పోలీస్ ఉద్యోగాలు.. డిసెంబర్‌లో నోటిఫికేషన్..!
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారని.. కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం రూ.50లక్షలు ప్రకటించారని.. పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల జీతాల పెంపులాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని.. సవాళ్లు ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.
What's Your Reaction?






